E-Paper
Advertisement

భార్యను వేధించే సైకో భర్త కథ.. నందు ‘అగ్లీ స్టోరీ’ ఎలా ఉందంటే?

భార్యను వేధించే సైకో భర్త కథ.. నందు ‘అగ్లీ స్టోరీ’ ఎలా ఉందంటే?
Advertisement

Ugly Story  Review: తెలుగు ఇండస్ట్రీలో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న నటుడు నందు. ఇటీవల ‘సైక్ సిద్ధార్థ్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ఇప్పుడు మరోసారి అలాంటి సైకోటిక్ షేడ్స్ ఉన్న క్యారెక్టరైజేషన్‌తో ‘అగ్లీ స్టోరీ’ (Ugly Story) అంటూ థియేటర్లలోకి వచ్చాడు. మరి ఈ బోల్డ్ అండ్ ఇంటెన్సివ్ డ్రామా నందుకి ఆశించిన బ్రేక్ ఇచ్చిందా? ప్రెజెంట్ జనరేషన్‌కు ఈ స్టోరీ కనెక్ట్ అవుతుందా? రివ్యూలో చూద్దాం.

కథ 

Advertisement

కార్తీక్ (నందు) పైకి నార్మల్‌గా కనిపించినా, లోపల తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తి. తన భార్య నేహా (అవికా గోర్)ను ఒక భార్యలా కాకుండా, కేవలం తన శారీరక అవసరాల కోసం వాడుకునే వస్తువులా చూస్తుంటాడు. కార్తీక్ పెట్టే మానసిక, శారీరక హింసలకు నేహా నరకం అనుభవిస్తూ ఉంటుంది. పెళ్ళికి ముందు నేహా ‘గౌతమ్’ అనే యువకుడిని ప్రేమిస్తుంది, అందుకు గుర్తుగా ఆమె చేతిపై ఉన్న టాటూని చూసిన ప్రతిసారీ కార్తీక్ సిగరెట్లతో ఆమెను కాల్చుతూ వికృతానందం పొందుతుంటాడు.ఇంతటి రాక్షస ప్రవృత్తి ఉన్న భార్తను నేహా ఎందుకు భరిస్తూ వచ్చింది? కార్తీక్ ఇలా సైకోలా మారడానికి గల ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? అసలు నేహా తన ప్రియుడికి ఎందుకు దూరమైంది? చివరకు ఈ నరకం నుండి నేహా ఎలా విముక్తి పొందింది? అనేదే ‘అగ్లీ స్టోరీ’ సినిమా.

సినిమా ఎలా ఉందంటే? 

Advertisement

దర్శకుడు ప్రణవ స్వరూప్ నేటి జెన్-జీ (Gen-Z) ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఒక బోల్డ్ అండ్ డార్క్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. అయితే, ఇలాంటి సినిమాలకు కేవలం బోల్డ్‌నెస్ మాత్రమే సరిపోదు, బలమైన ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉండాలి. ఈ విషయంలో ‘అగ్లీ స్టోరీ’ కాస్త వెనుకబడిందని చెప్పాలి.

హీరోయిన్‌ను హీరో అంతలా వేధిస్తున్నా, ప్రేక్షకుడికి ఆమె పాత్రపై పెద్దగా జాలి కలగదు. నేటితరం అమ్మాయిలు నచ్చని బంధం నుండి వెంటనే బయటకు వచ్చేస్తున్న తరుణంలో, హీరోయిన్ అంత నిస్సహాయంగా ఎందుకు ఉండిపోయిందో చూపించడంలో లాజిక్ లోపించింది. కనీసం తన ఫ్రెండ్‌కి గానీ, మావయ్యకు గానీ చెప్పుకోలేని స్థితిలో ఆమెను చూపించడం అంతగా కన్విన్సింగ్‌గా లేదు. అలాగే కొడుకు మానసిక రోగి అని తెలిసి కూడా తండ్రి పాత్ర (శివాజీ రాజా) ప్రవర్తించే తీరు కూడా రైటింగ్ లోపాలను ఎత్తిచూపుతుంది. బెడ్‌రూమ్ సీన్లలో లొంగిపోతూ, మిగతా విషయాల్లో భర్తను ఎదిరించే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గందరగోళంగా ఉంది. క్లైమాక్స్ కూడా చాలా సాదాసీదాగా ముగిసిపోతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్

నందు సైకో భర్త పాత్రలో వైవిధ్యం చూపించడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని సీన్లలో అతని నటన బాగున్నా, ఓవరాల్ బాడీ లాంగ్వేజ్‌లో ఉపేంద్ర, విజయ్ దేవరకొండ మార్క్ మేనరిజమ్స్‌ని ఇమిటేట్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక అవికా గోర్ గ్లామర్ పరంగానే కాకుండా, నటన పరంగానూ నిరాశపరిచింది. ఆమె ముఖంలో ఉండాల్సిన ఎమోషన్స్ సరిగ్గా పలకలేదు. సీనియర్ నటుడు శివాజీ రాజా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు, ఆ క్యారెక్టర్ కంటే ఇంట్లో పనిమనిషి క్యారెక్టరే బెటర్‌గా డిజైన్ చేశారు.

సాంకేతిక వర్గం

టెక్నికల్‌గా సినిమా చాలా లో బడ్జెట్‌లో తెరకెక్కినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఒకటి రెండు ఫ్లాట్స్‌లోనే మెజారిటీ షూటింగ్ ముగించేశారు. అయితే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) కొన్ని సీన్లను బాగానే ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ పర్వాలేదు, రన్ టైమ్ తక్కువగా ఉండటం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.

ప్లస్ పాయింట్స్:

  • నందు ఎంచుకున్న బోల్డ్ కాన్సెప్ట్
  • సినిమా రన్ టైమ్ (క్రిస్ప్ ఎడిటింగ్)
  • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  •  కథలో బలమైన ఎమోషన్ లోపించడం
  • లాజిక్ లేని కొన్ని కీలక సన్నివేశాలు
  • సాదాసీదాగా ముగిసే క్లైమాక్స్

చివరిగా ..

మొత్తంగా చెప్పాలంటే.. ‘అగ్లీ స్టోరీ’ ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న భర్త చుట్టూ తిరిగే కథ. కథనంలో ఇంకాస్త బలమైన ఎమోషన్స్, హీరో క్యారెక్టర్‌ను మరికొంత పకడ్బందీగా రాసుకుని ఉంటే ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచేది. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే బోల్డ్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రెజెంట్ జనరేషన్ (Gen-Z) ప్రేక్షకులు ఈ వారాంతంలో ఈ ‘అగ్లీ స్టోరీ’పై ఓ లుక్కేయవచ్చు.

  Ugly Story  Movie Review and Rating : 2.75/5

Related News

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

హుషారు పిట్టలు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×