E-Paper
Advertisement

GST Notice: కుమ్మరికి జీఎస్టీ అధికారులు షాక్.. కోటిన్నర కట్టాలంటూ నోటీసు, అతడి పేరుతో నాలుగు కంపెనీలు

GST Notice: కుమ్మరికి జీఎస్టీ అధికారులు షాక్.. కోటిన్నర కట్టాలంటూ నోటీసు,  అతడి పేరుతో నాలుగు కంపెనీలు
Advertisement

GST Notice: కొత్త కొత్త రూల్స్ తెచ్చి పేదవాళ్లకు నోటీసులు ఇవ్వడం జీఎస్టీ అధికారులకు అలవాటుగా మారింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు చాలామందికి నోటీసులు ఇచ్చారు. వారంతా పేదవారే. తాజాగా పేద కుమ్మరికి జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కోటి 25 లక్షలు కట్టాలని అందులో ప్రస్తావించారు. అది చూసి షాక్ అవ్వడం ఆ పేదోడి వంతైంది.

యూపీలో నిరుపేదకి షాకిచ్చిన జీఎస్టీ అధికారులు.. కోటిన్నర కట్టాలంటూ నోటీసు

Advertisement

ఈ మధ్యకాలంలో సామాన్యుడు బ్యాంకులకు వెళ్తే ఆధార్‌తోపాటు పాన్ కార్డు కూడా కచ్చితంగా ఇవ్వాలని అడుగుతున్నారు బ్యాంకు ఉద్యోగులు. లేకుంటే అకౌంట్ ఇవ్వమని, పాత అకౌంట్ మూసి వేస్తామని చెబుతున్నారు. ఇది తెలియక చాలావరకు పేద ప్రజలు షాకైన సందర్భాలు ఉన్నాయి. అకౌంట్లు తీసుకున్నవారిలో కనీసం రాయడం, చదవడం రాని వారు ఉన్నారు. వారి ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు.

అలాంటివారిలో యూపీలోని రాయ్ బరేలీ జిల్లా హర్‌చంద్‌పూర్ నివాసి సయీద్ ఒకడు. సయీద్ మట్టి కుండలు తయారు చేసి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అతడి ఆదాయం మీద ఐదుగురు కుటుంబ సభ్యులను పోషించేవాడు. వారి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేవాడు.

Advertisement

పేదోడి పేరుతో నాలుగు కంపెనీలు.. జిల్లా అధికారుల వద్ద మొర

కొద్దిరోజులు రుణం కోసం ప్రయత్నించినప్పుడు సయూద్ నుంచి ఓ వ్యక్తి పాన్, ఆధార్‌కార్డు తీసుకున్నాడు. చివరకు లోన్ మంజూరు కాలేదు. పాన్, ఆధార్ కార్డు తిరిగి రాలేదు. దీన్ని అదునుగా భావించిన కొందరు మోసగాళ్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. సయ్యిద్ పేరిట పత్రాలను ఉపయోగించి బీహార్‌లోని పాట్నాలో నాలుగు కంపెనీలను రిజిస్టర్ చేశారు.

కోట్లలో లావాదేవీలు నడిపారు. ఎంతకీ సదరు వ్యక్తులు జీఎస్టీ కట్టకపోవడంతో నిరుపేద సయ్యిద్‌కు నోటీసు ఇచ్చారు జీఎస్టీ అధికారులు. ఏకంగా రూ.1.25 కోట్ల పన్ను చెల్లించాలంటూ అందులో పేర్కొన్నారు. నోటీసు అందుకున్న ఆ కుటుంబం, వాటిని చూసి లబోదిబోమన్నారు.

ALSO READ: దేశంలో ఉగ్ర కుట్ర భగ్నం..  8 మంది అరెస్ట్

ఆరు నెలల కిందట తొలుత జీఎస్టీ అధికారుల నుంచి తొలి నోటీసు వచ్చింది. దాని గురించి తెలియక పెద్దగా పట్టించుకోలేదు. ఫిబ్రవరి 15న మరోసారి నోటీసు రావడంతో అనుమానం వచ్చి ఇరుగుపొరుగువారికి చూపించాడు. దీంతో అసలు విషయం బయటపడింది. సయీద్ తన కొడుకులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. స్పందించిన జిల్లా అధికారులు సయీద్ పత్రాలు దుర్వినియోగం అయినట్లు తేలింది.

స్థానిక అధికారులు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికారులు తన వాదనలను ధృవీకరిస్తారని, జీఎస్టీ నుంచి తన పేరును తొలగిస్తారని ఎదురుచూస్తున్నాడు. తనకు న్యాయం కావాలని కోరుతున్నాడు.  ఇలాంటి మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో నిరుపేద ప్రజలు తమ ఆధార్, పాన్ కార్డులు ఇతరులకు ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నారు అధికారులు.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×