E-Paper
Advertisement

Airtel, Jio, Vi.. చౌకైన వార్షిక ప్లాన్స్‌కు.. మూడింటిలో ఏది బెస్ట్?

Airtel, Jio, Vi.. చౌకైన వార్షిక ప్లాన్స్‌కు.. మూడింటిలో ఏది బెస్ట్?
Advertisement

Cheapest Annual Plans: మెుబైల్ యూజర్లలో అధికమంది నెలవారి, త్రైమాసిక రీఛార్జ్ ప్లాన్స్ ను ఎక్కువగా చేస్తుంటారు. అయితే ప్రతీ నెల సగటున రూ.300 చెల్లిస్తారని అనుకుంటే అది ఏడాది పూర్తయ్యే సరికి రూ.3600 అవుతుంది. అయితే ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా.. అంతకంటే తక్కువకే తమ వార్షిక ప్లాన్స్ ను అందిస్తున్నాయి. ఈ మూడు నెట్ వర్క్స్ లోని చౌకైన వార్షిక ప్లాన్స్ ఏవి? ఏ ఏ ప్రయోజనాలు యూజర్ కు లభించనున్నాయి? చీపెస్ట్ వార్షిక ప్లాన్ లో ఏ నెట్ వర్క్ బెస్ట్? వంటివి ఈ కథనంలో పరిశీలిద్దాం.

జియో వార్షిక ప్లాన్..

జియో తన యూజర్ల కోసం ఆల్ రౌండర్ వార్షిక ప్యాకెజీని అందుబాటులో ఉంచింది. రూ.3599 పెట్టి ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను యూజర్ పొందవచ్చని జియో వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5GB డేటా, అపరిమిక కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ లో జియో టీవీ, జియో సినిమా యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు. ప్రతీనెల రీఛార్జ్ కోసం రూ.300-350 చెల్లించే వారికి ఈ ప్లాన్ ఏడాది పాటు మెరుగైన ప్రయోజనాలను అందించనుంది.

ఎయిర్ టెల్ చౌకైన వార్షిక ప్లాన్

Advertisement

365 రోజుల పాటు సిమ్ ను యాక్టివ్ గా ఉంచుకునేందుకు ఎయిర్ టెల్.. రూ.1,849 వార్షిక ప్లాన్ ను తీసుకొచ్చింది. దీని ప్రకారం నెలకు రూ. 154 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇందులో ఏడాదిపాటు అపరిమిత కాల్స్, 3600 SMSలు యూజర్ లభిస్తాయి. సిమ్ యాక్టివ్ ప్లాన్ కాబట్టి రోజూవారి మెుబైల్ డేటా ఉండదు. ఇల్లు, కార్యాలయాల్లో వై-ఫై ఉన్నవారికి.. మెుబైల్ ఇంటర్నెట్ పెద్దగా అవసరలేని వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలవనుంది. ఈ ప్లాన్ లో అదనపు ప్రయోజనాల కింద హలోట్యూన్స్, ఏఐ సబ్ స్క్రిప్షన్ లభించనున్నాయి.

Also Read: ఐర్లాండ్‌లో జాబ్.. రూ.96 లక్షల జీతం.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న టెక్కీ!

వొడాఫోన్ ఐడియా ప్లాన్..

Advertisement

వినియోగదారుల అవసరాలను బట్టి వీఐ.. బడ్జెట్ లో 2 రకాల వార్షిక ప్లాన్స్ లాంచ్ చేసింది. అందులో ఒకటి రూ.1,189 ప్లాన్. దీనిని రీఛార్జ్ చేసుకుంటే ఏడాది కాలానికి 50GB డేటా లభిస్తుంది. పెద్దగా డేటా అవసరం లేకుండా అపరిమిత కాల్స్ కోరుకునేవారికి మాత్రం ఇది అత్యుత్తమమైన ప్లాన్ గా నిలుస్తోంది. పైన పేర్కొన్న ఎయిర్ టెల్ రూ.1,849 వార్షిక ప్లాన్ సైతం ఇంచుమించు ఇదే తరహా ప్రయోజనాలతో వచ్చింది. కానీ దానితో పోలిస్తే.. వీఐ ప్లానే చాలా చౌకగా ఉందని చెప్పవచ్చు.

Also Read: టార్గెట్ టీటీడీ ఛైర్మన్.. ఉచ్చుబిగుస్తున్న వైసీపీ.. ఇరకాటంలో టీడీపీ!

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×