నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న 23 అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రంగంలో కెరీర్ ప్రారంభించాలని ఆశించే అభ్యర్థులు మే 1వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ఫీజు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ (NE5 లెవల్) విభాగానికి 16 ఖాళీలు కేటాయించారు. అలాగే అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్ – E1 లెవల్) విభాగానికి 7 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 23
విద్యార్హత: అర్హత గల అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సీఏ, సీఎంఏ, ఎంబీఏ, డిగ్రీ లేదా మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండటం తప్పనిసరి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: వేతనాల విషయానికొస్తే ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతభత్యాలు లభిస్తాయి. అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.21,000 నుంచి రూ.74,000 వరకు వేతనం అందుతుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం లభిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష కీలక పాత్ర పోషిస్తుంది. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు. జూన్ 2026లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించే అవకాశం ఉంది.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా సాధారణ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
నోట్: దరఖాస్తుకు చివరి తేది: మే 1
అఫీషియల్ వెబ్ సైట్: https://irfc.co.in/hi
ALSO READ: ఏపీలో నకిలీ సర్టిఫికెట్లతో జాబ్స్.. APSPDCLలో 69 మంది ఉద్యోగుల తొలగింపు