Indian Techie Ireland: ఐర్లాండ్ లో పనిచేస్తున్న భారత సంతతి టెక్కీ.. తన జీతం, ఖర్చుల గురించి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్లిన్ నగరంలోని అమెజాన్ కార్యాలయంలో డెవలప్ మెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అతడు.. తన ఆదాయవ వ్యయాల గురించి మెుహమాటం లేకుండా మాట్లాడారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు.. విదేశాల్లో సెటిల్ అవ్వాలని భావించేవారిని ఆలోచనల్లో పడేసింది.
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఉమాంగ్ చౌదరి తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేశారు. అందులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాట్లాడుతూ.. తనకు అమెజాన్ లో ఏడాదికి 70,000 – 90,000 యూరోల ప్యాకేజీ వస్తున్నట్లు తెలిపారు. భారతీయ కరెన్సీలో దీని విలువ రూ.75-96 లక్షలు కావడం గమనార్హం.
అయితే డబ్లిన్ లాంటి ఖరీదైన నగరంలో జీవించడం ఎంతో ఖర్చుతో కూడుకున్న అంశమని కూడా సదరు టెక్కీ పేర్కొన్నారు. తన నెలవారి ఖర్చులకు 3000 యూరోలు ( సుమారు రూ.3.2 లక్షలు) అవుతాయని అతడు తెలిపారు. అద్దె, కిరాణా సామాగ్రి, యుటిలిటీ, రవాణా, ఇతర రోజువారి ఖర్చులు మెుత్తంలో ఇందులోనే ఉంటాయని చెప్పారు.
Also Read: గజ్వేల్ ఎమ్మెల్యే ఆఫీసుపై దాడి.. సీఎం రేవంత్‌పై.. హరీశ్ రావు ఫైర్
డబ్లిన్ నగరంలో ఎంతగా ఖర్చులు ఉన్నప్పటికీ పొదుపు కూడా సాధ్యమేనని టెక్కీ తెలిపారు. జీతంలో 30-40 శాతం వరకూ సేవింగ్స్ కింద భద్రపరుస్తున్నట్లు తెలిపారు. అమెజాన్ ప్రధాన కార్యాలయం సియాటిల్ నుంచి డబ్లిన్ కు మారడంపైనా యువ టెక్కీ స్పందించారు. డబ్లిన్ చాలా అందమైన ప్రశాంతమైన నగరమని కొనియాడారు. అలాగే ఐర్లాండ్ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని చాలా మంచివారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ టెక్కీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Also Read: సమ్మర్ స్పెషల్.. ఈ 6 రిఫ్రెష్ డ్రింక్స్‌తో వేసవి తాపానికి గుడ్ బై చెప్పండి!