E-Paper
Advertisement

చెవులకు క్లిప్‌లా తగిలించుకోవడమే.. నథింగ్ CMF నుంచి క్రేజీ ఇయర్‌బడ్స్ వచ్చేస్తున్నాయ్!

చెవులకు క్లిప్‌లా తగిలించుకోవడమే.. నథింగ్ CMF నుంచి క్రేజీ ఇయర్‌బడ్స్ వచ్చేస్తున్నాయ్!
Advertisement

CMF Clip Pro: నథింగ్ సబ్‌బ్రాండ్ అయిన CMF నుంచి త్వరలోనే సరికొత్త ఇయర్‌బడ్స్ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. CMF Clip Pro పేరుతో వస్తున్న ఈ సరికొత్త ఆడియో డివైజ్.. ఇటీవల సింగపూర్‌కు చెందిన ఐఎండిఏ (IMDA) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతో ఈ ఇయర్‌బడ్స్ త్వరలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

క్లిప్ తరహా డిజైన్‌:

ఈ కొత్త ఇయర్‌బడ్స్‌కు పెట్టిన పేరును బట్టి చూస్తుంటే.. ఇవి క్లిప్ స్టైల్ డిజైన్‌తో వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. చెవులకు క్లిప్‌లా తగిలించుకునే వీలుండే ఈ తరహా డిజైన్ యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే.. CMF బ్రాండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి క్లిప్-ఆన్ ఇయర్‌బడ్స్ ఇవే అవుతాయి. అయితే దీనికి సంబంధించిన డిజైన్ వివరాలు కానీ, ఫొటోలు కానీ ఇంకా అధికారికంగా బయటకు రాలేదు.

Advertisement

Also Read: బియ్యం డబ్బా కథే మళ్లీ రిపీట్.. ఫోన్ ఓవర్ హీటైందని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? కంపెనీల సీరియస్ వార్నింగ్!

సర్టిఫికేషన్ ద్వారా లీకైన వివరాలు:

తాజాగా లీకైన నివేదికల ప్రకారం.. ఈ సరికొత్త డివైజ్ B189 మోడల్ నెంబర్‌తో సర్టిఫికేషన్ పొందింది. కేటగిరీ పరంగా దీనిని బ్లూటూత్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌గా పేర్కొన్నారు. అయితే దీని ఫీచర్లు, ధర లేదా లాంచ్ తేదీకి సంబంధించిన వివరాలేవీ ఈ సర్టిఫికేషన్ ద్వారా వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఈ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచారు. అయితే ఈ ఇయర్‌బడ్స్ భారత మార్కెట్‌లోకి వచ్చేసరి బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి రావొచ్చని టెక్ నిపుణుల అంచనా.

ఆడియో విభాగంలో గట్టి పోటీ:

Advertisement

ఇటీవలే నథింగ్ బ్రాండ్ తమ ఆడియో పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ కొత్త ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది. కొద్దిరోజుల క్రితమే CMF బడ్స్ 2ఎ, బడ్స్ 2 వంటి మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా వస్తున్న CMF క్లిప్ ప్రో ఎలాంటి ఫీచర్లతో అలరిస్తుందో చూడాలి. దీని లాంచ్ తేదీపై కంపెనీ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Also Read: OnePlus 15 యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఒక్క అప్‌డేట్‌తో ఇక డబుల్ ధమాకా!

Related News

బియ్యం డబ్బా కథే మళ్లీ రిపీట్.. ఫోన్ ఓవర్ హీటైందని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? కంపెనీల సీరియస్ వార్నింగ్!

రూ.1500 లోపు నోరువెళ్లబెట్టే ఫీచర్లు.. ఏకంగా 75 గంటల బ్యాటరీతో కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్!

OnePlus 15 యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఒక్క అప్‌డేట్‌తో ఇక డబుల్ ధమాకా!

రూ.21,000 బడ్జెట్‌లో 48 గంటల బ్యాటరీ బ్యాకప్.. Realme Narzo 100x భారత్‌లోకి వచ్చేసిందోచ్!

పవర్‌ఫుల్ కెమెరా, లాంగ్ బ్యాటరీ బ్యాకప్.. Motorola Edge 70 Max ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

భారత్‌లోకి Poco సరికొత్త ఫోన్.. ఏకంగా 8000mAh బ్యాటరీతో రచ్చ లేపనున్న M8 Power!

బడ్జెట్ ధరలో అదిరిపోయే సౌండ్.. టాప్ 5 మివి ఇయర్‌బడ్స్ ఇవే!

Big Stories

Advertisement
×