Basit Ali : టీమిండియాపై పాకిస్తాన్ నిత్యం విషం కక్కుతుందన్న సంగతి తెలిసిందే. టీమిండియా బాగా ఆడితే… చిప్పులు పెట్టారని ఆరోపణలు చేస్తూ రచ్చ చేస్తూ ఉంటారు. ఇక ఇంగ్లాండ్, ఐర్లాండ్ లాంటి జట్ల చేతిలో దారుణంగా ఓడిపోయినప్పుడు మనోళ్లకు ఏది చేతకాలని హేళన చేశారు. హైవే పిచ్ లపై మాత్రమే టీమిండియా క్రికెటర్లు ఆడతారని సెటైర్లు పేల్చారు. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మధ్య కాలంలో వరుసగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన నేపథ్యంలో.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ (Basit Ali) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ వేసిన బిస్కెట్లకు ఐసీసీ అమ్ముడుపోయిందని.. అందుకే టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ లో హైవే లాంటి పిచ్ లు తయారు చేసినట్లు వెల్లడించారు. అందుకే ఐసీసీ ట్రోఫీలు అవలీలగా టీమిండియా గెలిచిందని సంచలన ఆరోపణలు చేశారు.
గడిచిన మూడేళ్లలో టీమిండియా (Team India) మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన సంగతి తెలిసిందే. 2024 టీ20 ప్రపంచ కప్ , ఛాంపియన్ ట్రోఫీ, అలాగే 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్స్ దక్కించుకుంది టీమిండియా. అయితే ఈ టైటిల్స్ వరుసగా టీమిండియా గెలవడం వెనక బీసీసీఐ కుట్ర ఉందని ఆరోపణలు చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ. బీసీసీఐ వేసిన బిస్కెట్లకు ఐసీసీ అమ్ముడుపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకే ఏ టోర్నమెంట్ జరిగినా టీమిండియా క్రికెటర్లకు హైవే లాంటి మైదానాలు సిద్ధం చేసిందని ఐసీసీ పై సంచలన ఆరోపణలు చేశారు. మొన్న జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ (ICC T20 world Cup 2026) సందర్భంగా ఇండియాలో మొత్తం ఫ్లాట్ మైదానాలు ఏర్పాటు చేసి కుట్రకు తెర లేపింది అన్నారు. 2024 టీ20 ప్రపంచ కప్ వెస్టిండీస్ లో జరిగినప్పటికీ… ఇండియాలో ఉన్న తరహాలోనే మైదానాలను అక్కడ ఐసీసీ సిద్ధం చేసిందన్నారు. అందుకే రోహిత్ సేన అవలీలగా టైటిల్ గెలిచినట్లు సంచలన ఆరోపణలు చేశారు.
గడిచిన మూడు సంవత్సరాలలో టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా… ఫ్లాట్ మైదానాలను ఐసీసీ తయారు చేసినట్లు బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆసియా ఖండంలో ఎలాంటి మైదానాలు ఉంటాయో… వాటినే ప్రతి ఐసీసీ (ICC) టోర్నమెంట్లలో సిద్ధం చేసినట్లు వివరించారు. అందుకే ఎన్నడు టైటిల్స్ గెలవని టీమిండియా (Team India)… గడిచిన మూడేళ్లలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచినట్లు షాకింగ్ ఆరోపణలు చేశారు.
Basit Ali criticizing Shadab Khan in front of Saqlain Mushtaq. 🤯 pic.twitter.com/QUKK0RStuS
— Sheri. (@CallMeSheri1_) May 31, 2026