E-Paper
Advertisement

OnePlus 15 యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఒక్క అప్‌డేట్‌తో ఇక డబుల్ ధమాకా!

OnePlus 15 యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఒక్క అప్‌డేట్‌తో ఇక డబుల్ ధమాకా!
Advertisement

OnePlus 15: భారతదేశంలోని వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కంపెనీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. సరికొత్త ఆక్సిజన్‌ఓఎస్ 16 (OxygenOS 16.0.9.400) అప్‌డేట్ ద్వారా ఈ ఫోన్‌లో ఒకేసారి రెండు ఈ-సిమ్‌లను (Dual eSIM) యాక్టివేట్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. గతంలో ఒక ఈ-సిమ్‌తో పాటు కేవలం ఒక ఫిజికల్ సిమ్ మాత్రమే వాడే వీలుండేది. కానీ తాజా అప్‌డేట్ ఈ పరిమితిని పూర్తిగా తొలగించింది.

ఎవరికి ఉపయోగం?

ఈ సరికొత్త ఫీచర్ నిరంతరం ప్రయాణాలు చేసే వారికి, ఆఫీస్, వ్యక్తిగత అవసరాల కోసం రెండు వేర్వేరు నంబర్లను ఉపయోగించే ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా ఈ-సిమ్‌ను ఫిజికల్‌గా తొలగించడం సాధ్యం కాదు కాబట్టి.. భద్రత పరంగా కూడా ఇది చాలా మేలు చేస్తుంది. త్వరలోనే ఈ ఫీచర్ వన్‌ప్లస్ 15ఆర్ మోడల్‌కు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read: రూ.21,000 బడ్జెట్‌లో 48 గంటల బ్యాటరీ బ్యాకప్.. Realme Narzo 100x భారత్‌లోకి వచ్చేసిందోచ్!

పవర్‌ఫుల్ ఫీచర్లు:

ఫీచర్ల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 15 ఫోన్ 1.5k రిజల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్‌తో రన్ అవుతుంది. ఇందులో 12GB RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

కెమెరా, బ్యాటరీ సామర్థ్యం:

Advertisement

ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. అలాగే 120 వాట్ల సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 7300mah సిలికాన్ కార్బన్ బ్యాటరీని అందించారు. దీనికి తోడు ఐదేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను వన్‌ప్లస్ హామీ ఇచ్చింది.

Also Read: పవర్‌ఫుల్ కెమెరా, లాంగ్ బ్యాటరీ బ్యాకప్.. Motorola Edge 70 Max ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×