E-Paper
Advertisement

Government Doctors: రాష్ట్రంలో 94 మంది ప్రభుత్వ వైద్యులు సస్పెండ్.. ఉత్తర్వులు జారీ..!

Government Doctors: రాష్ట్రంలో 94 మంది ప్రభుత్వ వైద్యులు సస్పెండ్.. ఉత్తర్వులు జారీ..!
Advertisement

Government Doctors: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లో పనిచేస్తూ, ఏడాది కాలానికి పైగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన 94 మంది వైద్యులను ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. ఈమేరకు వైద్య విద్యా శాఖ సంచాలకులు డాక్టర్ ఎ. నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనే వీరికి వివరణ కోరుతూ 15 రోజుల గడువుతో షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ, వారి నుంచి వచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Also Read: Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు ‘ శృతి ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

ఈ చట్టాల ప్రకారం..

Advertisement

తెలంగాణ లీవ్ రూల్స్- 1933, స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 ప్రకారం, సుదీర్ఘ కాలం గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరు ప్రధానంగా ఉస్మానియా(OU), గాంధీ(Gandhi), నిజామాబాద్(Nizamabad), సంగారెడ్డి(Sangareddy), వరంగల్(Warangal), ఖమ్మం(Khammam) వంటి వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్నారు. అత్యధికంగా గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్ విభాగాలకు చెందిన వారే ఉండటం గమనార్హం. ఈ ఉత్తర్వులను సంబంధిత డాక్టర్ల శాశ్వత చిరునామాలకు పంపాలని మెడికల్ కాలేజీల హెచ్ వోడీలను డీఎంఈ ఆదేశించారు.

Also Read: Today Horoscope in Telugu: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – నిరుద్యోగులకు శుభవార్తలు

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×