E-Paper
Advertisement

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!
Advertisement

Temple Wearable: జొమాటో మాజీ బాస్ దీపిందర్ గోయల్ గురించి మనందరికీ తెలుసు. ఆ పదవికి గుడ్‌బై చెప్పిన ఆయన.. ఇప్పుడు Temple అనే కొత్త హెల్త్ వేరబుల్ స్టార్టప్‌తో మళ్లీ మన ముందుకొచ్చారు. మనం వాడే స్మార్ట్ వాచ్‌లు కేవలం గుండె కొట్టుకునే వేగాన్ని మాత్రమే చూపిస్తాయి. కానీ, ఈ కొత్త టెంపుల్ డివైస్ అంతకంటే మంచింది అని, నేరుగా మన మెదడులోని రక్త ప్రసరణను కూడా పసిగడుతుందని గోయల్ చెబుతున్నారు. అసలు ఈ టెంపుల్ డివైస్ ఎంతవరకు పనిచేస్తుంది? రీసెంట్ స్టడీస్ ఏం చెబుతున్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం.

టెంపుల్ డివైస్ ప్రత్యేకత ఏంటి?

ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న స్మార్ట్‌వాచ్‌లు అన్నీ మన చేతి మణికట్టుకే పరిమితమయ్యాయి. కానీ దీపిందర్ గోయల్ తెచ్చిన ఈ టెంపుల్ డివైస్ చాలా చిన్నదిగా ఉండి, నేరుగా మన నుదుటి పక్క భాగంలో లేదా కణత వద్ద అతుక్కుంటుంది. ఇది కేవలం హార్ట్ రేట్ మాత్రమే కాకుండా.. బ్రెయిన్ బ్లడ్ ఫ్లోను కూడా అంచనా వేస్తుందని కంపెనీ చెబుతోంది. సైక్లింగ్ చేసేటప్పుడు లేదా పడుకునేటప్పుడు మెదడులో జరిగే రక్త ప్రసరణ మార్పులను ఇది ఇట్టే పట్టుకోగలదని రీసెర్చ్‌లో తేలింది.

Advertisement

Also Read: వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!

స్టడీలో వెల్లడైన నిజాలు..

ఈ డివైస్ పనితీరును పరీక్షించడానికి 23 మంది ఆరోగ్యకరమైన వ్యక్తులపై ఒక వాలిడేషన్ స్టడీ చేశారు. మెదడు రక్త ప్రసరణను కొలవడంలో స్టాండర్డ్ పరికరంగా భావించే ‘ట్రాన్స్‌క్రానియల్ డోప్లర్’ (TCD) తో టెంపుల్ పనితీరును పోల్చి చూశారు. సైక్లింగ్ చేసినప్పుడు హార్ట్ రేట్‌తో పాటు బ్రెయిన్ బ్లడ్ ఫ్లో కూడా పెరుగుతుందని ఈ స్టడీలో తేలింది. టెంపుల్ డివైస్ కూడా సరిగ్గా ఇదే ట్రెండ్‌ను గుర్తించింది. అలాగే నిలబడిన స్థితి నుంచి పడుకున్నప్పుడు హార్ట్ రేట్ తగ్గినప్పటికీ.. మెదడులో రక్త ప్రసరణ పెరిగినట్లు ఈ చిన్న డివైస్ కచ్చితంగా చూపించగలిగింది.

సాధారణ వాచ్‌లకు దీనికి తేడా ఏంటి?

Advertisement

మనం చేతికి పెట్టుకునే రెగ్యులర్ వాచ్‌లు కేవలం హార్ట్ రేట్ పడిపోవడాన్ని మాత్రమే చూపిస్తాయి. కానీ మనం పడుకున్నప్పుడు బ్రెయిన్ బ్లడ్ ఫ్లో ఎలా మారుతుందనేది అవి చెప్పలేవు. టెంపుల్ మాత్రం ఈ విషయంలో చాలా ముందంజలో ఉంది. ఎక్సర్‌సైజ్ చేసే సమయంలో కూడా ఇది హార్ట్ రేట్‌ను కేవలం 4% లోపు తప్పులతో చాలా పర్ఫెక్ట్‌గా ట్రాక్ చేసింది. పెద్ద పెద్ద మెడికల్ పరికరాలు అమర్చుకోవడంలో ఉండే ఇబ్బందులు ఈ చిన్న వేరబుల్‌తో ఉండవని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంకా పరిశోధనలు జరగాలి..

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ.. టెంపుల్ డివైస్ ఇంకా పూర్తి స్థాయిలో రీసెర్చ్ దశలోనే ఉంది. ప్రస్తుతం ఇది పీర్ రివ్యూ కోసం సమర్పించబడింది. ఇది నేరుగా బ్రెయిన్ ఫ్లోనే కొలుస్తుందా లేక ఆ చుట్టుపక్కల ఉన్న కణజాలం ఆధారంగా రీడింగ్‌లు ఇస్తుందా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ.. భవిష్యత్తులో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి క్లిష్టమైన సందర్భాల్లో డాక్టర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది మార్కెట్లో ఒక సంచలనమనే చెప్పాలి.

Also Read: మీ ఐఫోన్ స్పీడ్ పెంచే సూపర్ అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి!

Tags

Related News

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌లో కాకుండా.. మెటల్‌‌ లోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

మీ ఐఫోన్ స్పీడ్ పెంచే సూపర్ అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి!

భారీ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ ఫీచర్‌తో Oppo A7 Pro లాంచ్.. ధర ఎంతంటే?

వాట్సప్‌లో చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేశారో.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!

ఇక ఏ భాషలోనైనా మాట్లాడొచ్చు.. లైవ్ ట్రాన్స్‌లేషన్, 50% ఎక్కువ ఏఎన్‌సీతో Apple AirPods 5 లాంచ్!

Big Stories

Advertisement
×