ATM Metal Keypad: ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడం ప్రతీ ఒక్కరి జీవితంలో సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఏటీఎం వద్దకు వెళ్లిన చాలా మంది మిషన్ లోకి కార్డు పెట్టి, పిన్ నంబర్ ఎంటర్ చేసి, డబ్బు రాగానే వెంటనే వెళ్లిపోతుంటారు. వేళ్లతో నొక్కే ఆ కీప్యాడ్ తయారీకి ఏ మెటీరియల్ వాడారు అనే చిన్న విషయాన్ని అస్సలు పట్టించుకోరు. సాధారణంగా ఏటీఎంలలో ప్లాస్టిక్‌కు బదులుగా మెటల్ (లోహపు) కీప్యాడ్‌లను ఉపయోగిస్తుంటారు. దీని వెనకున్న కారణాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఏటీఎం మిషన్లను నిత్యం వేలాది మంది ఉపయోగిస్తుంటారు. ఫలితంగా వీటిలోని కీప్యాడ్‌లు నిరంతరం ఒత్తిడికి గురవుతుంటాయి. అలాగే క్లీనింగ్ ప్రక్రియ, వాతావరణ ప్రభావం కూడా వీటిపై పడుతూ ఉంటుంది. కాబట్టి బలంగా ఉండే మెటల్ మెటీరియల్ ఉపయోగించడం వల్ల బటన్లు సులభంగా అరిగిపోకుండా చాలా కాలం పాటు సరిగ్గా పనిచేస్తాయి.
సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ఏటీఎం ఎండ, వర్షం, గాలిలోని తేమ, ఉష్ణోగ్రత మార్పులకు గురవుతుంటాయి. కాబట్టి దీనిని తట్టుకునేలా ఏటీఎం మెటల్ బటన్లను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. దీనివల్ల వాతావరణ ప్రభావం వల్ల కీప్యాడ్ పాడైపోయే ప్రమాదం తప్పుతుంది.
ఒకవేళ ప్లాస్టిక్ కీప్యాడ్‌లను వాడినట్లైతే వేళ్లతో నొక్కిన బటన్లపై కొంతసేపు శరీర వేడి (హీట్) నిలిచి ఉంటుంది. ప్రత్యేకమైన థర్మల్ కెమెరాలను ఉపయోగించి ఆ వేడి ఆధారంగా ఎవరు ఏ పిన్ నంబర్ ఎంటర్ చేశారో కనిపెట్టవచ్చనే ప్రచారం ఉంది. కాబట్టి లోహపు కీప్యాడ్‌లు ఉష్ణాన్ని త్వరగా వ్యాప్తి చేయడం వల్ల ఇటువంటి థర్మల్ దాడుల ముప్పు తగ్గనుంది.
Also Read: రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?
రోజువారీ వినియోగంలో ఏటీఎం కీప్యాడ్‌పై పడే ఒత్తిడి లేదా అనుకోకుండా జరిగే భౌతిక నష్టాల నుంచి బలమైన మెటల్ కీప్యాడ్ రక్షణ ఇస్తుంది. బటన్లు విరిగిపోవడం లేదా ఊడిపోవడం వంటి సమస్యలు రాకుండా ఇది నిరోధిస్తుంది. మెుత్తంగా చూస్తే.. మన్నిక, భద్రత, నిర్వహణ పరంగా ఏటీఎంలకు మెటల్ కీప్యాడ్ అనే అనేది తెలివైన నిర్ణయంగా చెప్పవచ్చు.
Also Read: జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!