E-Paper
Advertisement

చిక్కుల్లో మోహన్ లాల్ దృశ్యం 3.. విడుదల కష్టమేనా?

చిక్కుల్లో మోహన్ లాల్ దృశ్యం 3.. విడుదల కష్టమేనా?
Advertisement

Drishyam 3:మలయాళం లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన దృశ్యం సిరీస్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ , మీనా కాంబినేషన్లో వచ్చిన ఈ సిరీస్ సంచలనాలు సృష్టించింది. ఇప్పటికే దృశ్యం, దృశ్యం 2 ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ సిరీస్ లో 3వ భాగమైన దృశ్యం 3 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే విడుదల కాబోతోందని సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సరిగ్గా ఈ సినిమా ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడడం కేరళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఇప్పుడు చిక్కుల్లో పడడం ఏంటి అంటూ అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. మరి దృశ్యం 3 సినిమాకి వచ్చిన ఇబ్బందులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చిక్కుల్లో పడ్డ దృశ్యం 3..

అసలు విషయంలోకెళితే .. దృశ్యం సిరీస్ ను నిర్మిస్తున్న ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ ఒకప్పుడు ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ తో కుదుర్చుకున్న డిజిటల్ డీల్ ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

కోర్టు తీర్పు ఎటువైపు?

Advertisement

దీంతో ఈ పిటీషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు అటు డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ కి అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. మే 15వ తేదీ వరకు దృశ్యం 3 సినిమాకు సంబంధించి ఎటువంటి కొత్త డీల్స్ ఓటీటీ లేదా ఇతర డిజిటల్ హక్కులు కుదుర్చుకోకూడదని నిర్మాతలకు స్టే ఆర్డర్ రిలీజ్ చేసింది. ఈ అనూహ్య పరిణామంతో చిత్ర బృందం ఇప్పుడు డైలమాలో పడిపోయింది. నిజానికి ఈ సినిమాను మే 21న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ సినిమా ఇలా చిక్కులు ఎదుర్కోవడం గమనార్హం. మరి మోహన్ లాల్ అభిమానులు మాత్రం ఈ వివాదం త్వరగా పరిష్కారం కావాలి అని, సినిమా థియేటర్లలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు . మరి ఈ సినిమా నిర్మాణ సంస్థ ఈ సమస్యకు త్వరగా పరిష్కారం వెతుకుతుందో లేదో చూడాలి.

also read:30 ఏళ్ల నో కిస్సింగ్ పాలసీకి బ్రేక్.. లిప్ లాక్ చేయడంపై నిజం బయటపెట్టిన కాజోల్!

దృశ్యం 3 ..

Advertisement

సినిమా విషయానికి వస్తే.. జీతూ జోసెఫ్ రచన దర్శకత్వంలో దృశ్యం సిరీస్ లో రాబోతున్న మూడవ భాగం . ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై అంటోనీ పెరంబవూర్ నిర్మించిన చిత్రం ఇది. మోహన్ లాల్ , మీనా, అన్సిబా హాసన్, ఎస్తేరు అనిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సతీష్ కురుపు సినిమాటోగ్రఫీ అందించగా.. అనిల్ జాన్సన్ సంగీతాన్ని అందించారు. ఇకపోతే ఈ సినిమా మలయాళం లో విడుదలైనప్పటికీ తెలుగు, హిందీ వంటి ఇతర భాషలలో కూడా రీమేక్ చేయబడింది.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×