E-Paper
Advertisement

రోజుకు 24 గంటలు కాదు.. 25 గంటలు, ఎప్పటి నుంచి అంటే?

రోజుకు 24 గంటలు కాదు.. 25 గంటలు, ఎప్పటి నుంచి అంటే?
Advertisement

రోజుకు ఎన్ని గంటలు? అని అడిగితే.. ఠక్కున ‘‘24 గంటలు’’ అని చెప్పేస్తాం. అయితే, భవిష్యత్తులో మాత్రం అలా చెప్పలేరు. ఎందుకంటే.. అప్పటికి రోజుకు 25 గంటలు ఉంటాయి. ఔనా.. అదెలా? అయినా అలా ఎలా మార్చేస్తారు? అనేగా మీ సందేహం? ఇలా జరగడం మంచిదేగా.. ఒక గంట ఎక్స్‌ట్రా గడపొచ్చు. అయితే, రోజు గడపడం కష్టంగా భావించేవారికి మాత్రం ఇది కొంచెం భారమే. అసలు 24 గంటలను 25 గంటలకు ఎందుకు మార్చాల్సి వస్తుంది? దాని వెనుక ఉన్న కథేంటీ?

25 గంటలకు ఎందుకు? 24 ఉంచేయొచ్చుగా?

అయినా ఇప్పటికిప్పుడు 25 గంటలకు మార్చడం ఎందుకు? రాత్రయితే టైమ్‌ను కూడా సరిగ్గా పట్టించుకోము కదా. 24 కంటిన్యూ చేస్తే సరిపోద్ది కదా అని మీరు అనుకుంటున్నారా? అది కూడా కరెక్టే. కానీ, అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. భవిష్యత్తులో భూమిపై విపరీతమైన మార్పులు వస్తాయి. దాని ఫలితంగా రోజుల సంఖ్య పెరుగుతుంది. మనకు జస్ట్ ఒక గంటే కదా అనిపించవచ్చు. కానీ, అది కాలంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే, ఈ నిర్ణయం.

కంగారు వద్దు.. ఇప్పట్లో కాదులే!

Advertisement

ఈ విషయంలో మీరేమీ కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే.. ఈ టైమ్ మార్పు జరిగేది ఇప్పుడు కాదు. ఇంకా ‘టైమ్’ ఉంది. కానీ, మీరు తెలుసుకోవల్సిన సీక్రెట్ ఒకటి ఉంది. అదే భూమిలో వస్తున్న మార్పు. మన భూమి చాలా విశాలమైనది కాబట్టి.. ఏ మార్పు జరిగినా మనకు పెద్దగా తెలీదు. కానీ ఇప్పటి ఫలితాలు మాత్రం భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. 24 గంటలు.. 25 గంటలుగా మారే ప్రక్రియ వెంటనే జరగదు. అత్యంత నెమ్మదిగా, లక్షల సంవత్సరాల కాలంలో జరగనుంది. అసలు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో తెలుసుకుందాం.

ఇది మనం సెట్ చేసుకున్న టైమ్

రోజుకు 24 గంటలు అనేది మనం సెట్ చేసుకున్న టైమ్. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లడానికి.. నిద్రపోవడానికి.. నిద్రలేవడం కోసం రూపొందించుకున్న వెసులుబాటు. కానీ, అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం ప్రకారం.. రోజు అనేది స్థిరమైనది కాదు. రోజు అంటే ఒక సోలార్ డే. అంటే.. సూర్యుడు ఉదయించి.. తిరిగి అదే స్థానానికి చేరకోడానికి పట్టే సమయమే మనం అనుకొనే రోజు (24 గంటలు). అయితే. నక్షత్ర దినం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఎంతో దూరంలో ఉండే నక్షత్రాల ఆధారంగా భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగేందుకు పట్టే సమయం 24 గంటల కంటే తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే.. భూమి తన చుట్టూ తాను తిరిగడం వల్ల సూర్యుడు తిరిగే అదే స్థానానికి చేరుకోడానికి భూమి తన భ్రమణంలో అదనంగా మరికొంచెం దూరం తిరగాలి. దానివల్ల 24 గంటల సమయంలో కూడా కాస్త మార్పు వస్తుంది. ఈ భ్రమణంలో మార్పుకు కారణం చంద్రుడే.

చంద్రుడు ఒక స్పీడ్ బ్రేకర్

Advertisement

భూమి భ్రమణ వేగం తగ్గడానికి ముఖ్యమైన కారణం చంద్రుడు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి.. సముద్రపు నీటిని తనవైపు లాక్కుంటుంది. దాని వల్ల అలలు ఏర్పడతాయి. ఫలితంగా భూమి తిరిగే దిశకు వ్యతిరేకంగా రాపిడి ఏర్పడుతుంది. దానివల్ల ఒక్కసారే భూమి వేగం తగ్గుతుంది. ఆ సమయంలో భూమి దాదాపు భ్రమణ శక్తిని కోల్పుతుంది. అదే టైమ్‌కు చంద్రుడు నెమ్మదిగా వెనక్కి జరిగి భూమికి సహకరిస్తాడు. అప్పుడే భూమి తన భ్రమణం పూర్తి చేయగలగుతుంది.

శాస్త్రవేత్తలు దీన్ని ఎలా తెలుసుకున్నారంటే?

భూమి భ్రమణం తగ్గినా.. మనకు పెద్దగా తెలీదు. ఇది కొన్ని సెకన్ల ఇంపాక్ట్ మాత్రమే. ఈ సూక్ష్మమైన విషయాన్ని శాస్త్రవేత్తలు వివిధ ప్రక్రియల ద్వారా తెలుసుకుంటా. అత్యంత ఖచ్చితమైన సమాచారమిచ్చే అటామిక్ క్లాక్‌లను ఉపయోగించి భూభ్రమణంలో వచ్చే స్వల్ప మార్పులను లెక్కిస్తారు. అలాగే ప్రాచీన కాలంలో జరిగిన చంద్ర, సూర్య గ్రహణాల సమయాలను ప్రస్తుత లెక్కలతో పోల్చారు. ఈ తేడాలను గమనించిన తర్వాత భూమి భ్రమణ సమయానికి, మన గడియార సమాయానికి మధ్య వ్యత్యాసం లేకుండా లీప్ సెకన్లను జోడించి టైమ్‌ను సరిచేస్తుంటారు.

మరి 24 గంటలు.. 25 ఎప్పుడు అవుతుంది?

ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. భవిష్యత్తులో 24 గంటలు.. 25 గంటలుగా మారడానికి కారణం.. కొన్ని ఊహించని మార్పులే. భవిష్యత్తులో భూమి భ్రమణం బాగా తగ్గిపోనుంది. దానివల్ల ఇప్పుడు ఉన్న 24 గంటలు.. 25 గంటలకు మారుతుంది. అది ఇది జరగడానికి దాదాపు 20 కోట్ల సంవత్సరాలు పడుతుందని అంచనా. ఇలా జరగడానికి కారణం సూర్యుడు కాదు, చంద్రుడు. భూమికి, చంద్రుడికి మధ్య చోటుచేసుకొనే కొన్ని పరిణామాల ఫలితం. అయితే, దీనివల్ల ఆ తరంలో ఉండేవారికి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు.

Also Read: చంద్రుడిపై మగాళ్ల వీర్యం ఉత్తి నురగేనా? ఆస్ట్రేలియా స్టడీలో దిమ్మతిరిగే విషయాలు వెల్లడి

ఈ మార్పులు కూడా ప్రభావం చూపుతాయట

నింద మొత్తం చంద్రుడిదే కాదు. మన భూమిలో ఉండే భూగర్భ జలాల స్థాయిల్లో జరిగే మార్పుల వల్ల భూమి ద్రవ్యరాశి పంపిణీ మారుతుంది. అది కూడా భూభ్రమణంపై ప్రభావం చూపుతుంది. భూమి లోపల ద్రవరూపంలో పదార్థాల్లో మార్పులు, భూమిపై ఉండే మంచు కరగడం కూడా ఇందుకు కారణం అవుతాయి. కాబట్టి.. ఇప్పట్లో మనం 25 గంటలు చూడలేకపోవచ్చు. కానీ, టైమ్ మెషీన్‌లో ఆ కాలానికి వెళ్తే మాత్రం సాధ్యమే!!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×