E-Paper
Advertisement

కేవీపీ దెబ్బ అదుర్స్ క‌దూ! దీన్నే అడిగి త‌న్నించుకోవ‌డ‌మంటారు!

కేవీపీ దెబ్బ అదుర్స్ క‌దూ! దీన్నే అడిగి త‌న్నించుకోవ‌డ‌మంటారు!
Advertisement

త‌ల్లికి అన్నం పెట్ట‌నోడు.. పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తాన‌న్నాడ‌ట‌! అచ్చంగా అట్ల‌నే ఉంది.. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైఖ‌రి. వ్య‌వ‌హార తీరు. ఆంధ్ర‌లో ఇంకా రాజ‌ధాని నిర్మాణ‌మే కాలేదు… ఇదిలా ఉండ‌గానే.. తెలంగాణ‌లో మార్పు కోస‌మై పోలోమ‌ని బ‌య‌లుదేరాడు జ‌న సేనాని. చివ‌ర‌కు అనుకున్న‌ట్టే అయ్యింది. అడిగి త‌న్నించుకున్న‌ట్టే అయ్యింది.

ఒక్క తెలంగాణ బీజేపీ త‌ప్ప‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలంగాణ‌లో చేసిన ర‌చ్చ‌ను ఎవ‌రూ మెచ్చ‌లే. బాబు వ‌త్తాసు ప‌లికాడు. అది వారి కామ‌న్ ఎజెండా కాబ‌ట్టి. ఇక ఇవాళ మాజీ ఎంపీ కేవీపీ రామ‌చంద్రారావు లేఖ రూపంలో ప‌వ‌న్‌ను గ‌ట్టి దెబ్బే కొట్టాడు. రాజ‌కీయాలంటే అంత ఆషామాషీ కాద‌ని ఈ సంఘ‌ట‌న‌తో తేలింది ప‌వ‌న్‌కు. క‌ళ్లు తేలేయ‌డ‌మొక్క‌టే మిగిలుంది. ప‌వ‌న్ చేయాల్సిన బాధ్య‌త‌లు, క‌ర్త‌వ్యాల గురించి కేవీపీ ఆ లేఖ‌లో పేర్కొన‌డ‌మే కాదు.. నిల‌దీత‌లు, ప్ర‌శ్న‌లు.. కూడా స‌బ‌బుగానే ఉన్నాయి.

Advertisement

ఇప్ప‌టికీ రాష్ట్ర విభ‌జ‌న హామీల‌ను కేంద్రం నెర‌వేర్చ‌లేదు.. నువ్వేం చేస్తున్నావ‌యా? అని అడిగాడు. క‌రెక్టే క‌దా! చంద్ర‌బాబు, ప‌వ‌న్ బాబు.. అంత సాహసం చేయ‌గ‌ల‌రా? మోడీ ద‌గ్గ‌ర‌కు పోయి.. ఈ విష‌యాల‌ను అడ‌గ‌గ‌లరా? అనేదే అస‌లు స‌మ‌స్య‌. ఏపీలో మీ కూట‌మి బ‌ల‌మెంత‌..? దాని ద్వారా ఇక్క‌డి జ‌నానికి జ‌రుగుతున్న మేలెంత‌? మీరు కేంద్రంతో రాష్ట్రానికి రావాల్సిన హ‌క్కుల‌ను సాధిస్తున్న‌దెంత‌..? ఇవ‌న్నీ ఒక్క లేఖ‌లో.. ఒక్క ప్ర‌శ్న‌లో నిల‌దీసినంత ప‌నిచేశాడు కేవీపీ. అమ‌రావ‌తి విష‌యం తీయ‌లేదు. అది వాళ్ల పార్టీ విధానం కాదు కాబ‌ట్టి. ప్ర‌జారాజ్యం పార్టీ పెడ‌తామ‌ని తెలిసి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కేసులు పెట్టాడ‌ని, తెలంగాణ వేదిక‌గా ఓ విష‌యం చెప్పాడు ప‌వ‌న్‌. దీన్నీ గ‌ట్టిగానే నిల‌దీశాడు కేవీపీ.

నిరూపిస్తావా? అని ఛాలెంజ్ విసిరాడు. ఒక‌వేళ నిరూపిస్తే.. 10 కోట్లు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్ర‌క‌టిస్తామ‌ని కూడా ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. సంధించిన‌వి కొన్ని ప్ర‌శ్న‌లే కానీ.. సూటిగా, ఘాటుగా త‌గిలాయి ప‌వ‌న్‌కు, బాబుకు. అంటే నిత్యం మోడీ జ‌పం చేస్తున్న ఈ ఇద్ద‌రు.. అక్క‌డ్నుంచి తెచ్చిందేమీ లేదు కానీ.. తెలంగాణ గ‌డ్డ‌పై త‌మ ప్ర‌తాపాన్ని చూపి.. అక్క‌డి జ‌నంలో మార్పు తెచ్చి.. తెలంగాణ‌ని పూర్తిగా అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు కంక‌ణం క‌ట్టుకున్నార‌న్న మాట‌! ఈ వ్యంగ్యం వినిపిస్తున్న‌ది రెండు తెలుగు రాష్ట్రాల్లో.

Advertisement

తెలంగాణ‌లో బీజేపీకి జాకీలు పెట్టి లేపేందుకు.. మార్పు కోసం.. మీ అయ్య జాగీరా అని పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడి.. రెండు తెలుగు రాష్ట్రాల నేత‌ల తిట్ల‌కు నెత్తి బొప్పి క‌ట్టి.. క‌ళ్లు బైర్లు క‌మ్మి.. సొంత రాష్ట్రంలో కూడా ప‌లుకుబ‌డి ప‌లుచ‌న‌య్యే విధంగా స‌వాళ్లు ఎదుర్కొని, ఛాలెంజ్‌ల‌కు ముఖం చాటేసుకుని.. ! ఒక్క తెలంగాణ న‌వ నిర్మాణ సంక‌ల్ప స‌భ ఎంత ప‌ని చేసందయా ప‌వ‌ను! ఇక ప‌ర్య‌వ‌సానాలు మున్ముందు ఎలా ఉంటాయో చూడాలి మ‌రి.

Related News

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

నాన్న‌న‌నిన నేను నిన్న‌న‌నా..! న‌న్న‌నిన‌ నీ నాన్న‌ను నేన‌న‌నా?

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

Big Stories

Advertisement
×