E-Paper
Advertisement

Telecom Companies: పెరగనున్న Jio, Airtel, Vi రీఛార్స్ ధరలు!

Telecom Companies: పెరగనున్న Jio, Airtel, Vi రీఛార్స్ ధరలు!
Advertisement

టెలికాం కంపెనీలు ధరల పెంపునకు రెడీ అవుతున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా త్వరలోనే పెంపును అమలు చేయబోతున్నాయి. సుమారు 10 శాతం వరకు రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల మీద పడనుంది. 2024 తర్వాత మళ్లీ ఇప్పుడు ధరలను పెంచుతున్నాయి కంపెనీలు. సగటు కస్టమర్ ఆదాయాన్ని పెంచుకోవాలనే నిర్ణయంలో భాగంగా రేట్స్ హైక్ చేస్తున్నాయి.  ఆయా కంపెనీలు 5G విస్తరణలో భారీగా పెట్టుబడి పెడుతున్నాయ. దీనికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. ధరల పెంపుతో ఆ ఖర్చులను కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాయి.

చౌక ప్లాన్‌లపై తొలగింపు

టెలికాం కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను, జియో, ఎయిర్‌ టెల్ చౌక ప్లాన్లను ఎత్తివేయబోతున్నాయి. అంటే తమ ఎంట్రీ లెవల్ ప్లాన్లు అయిన రూ.249కి 1GBని ఇప్పటికే నిలిపివేశాయి. బేస్ ప్లాన్ ఇప్పుడు రూ.299కి 1.5GBగా ఉంది. ఇప్పటితో పోల్చితే, ఏకంగా 17 శాతం పెరిగింది. Vi  తన బేస్ ప్లాన్ ను రూ.299కి 1GBగా నిర్ణయించింది.

ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు

Advertisement

అటు నెలవారీ ప్లాన్లకు బదులుగా, కంపెనీలు మూడు నెలల ప్లాన్లను ప్రోత్సహించబోతున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఒకేసారి ఎక్కువ ఆదాయాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాయి. గత త్రైమాసికంలో, జియో సగటు కస్టమర్ ఆదాయం రూ.211.4గా చూపించింది. ఈ కారణంగా ఖర్చు, ఆదాయాలపై సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది.

రీఛార్జ్ ధరల పెరుగుదల ఎప్పుడంటే?

టెలికాం కంపెనీల సమాచారం ప్రకారం.. త్వరలోనే రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరగనున్నాయి. కొన్ని కంపెనీలు.. ముఖ్యంగా జియో, VI ఇప్పటికే తమ బేస్ ప్లాన్లలో మార్పులు చేసింది. డిసెంబర్ 2025, జూన్ 2026 మధ్య పూర్తి స్థాయిలో రీఛార్జ్ ధరల పెరుగుదల అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ధరల పెంపు సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఉండవచ్చని టెలికాం నిపుణలు భావిస్తున్నారు.

ధరల పెరుగుదల ఎందుకు?  

Advertisement

టెలికాం కంపెనీలు దేశ వ్యాప్తంగా తమ 5G నెట్ వర్క్ ను విస్తరిస్తున్నాయి. ఈ విస్తరణ భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం. మూల ధనం చాలా అవసరం ఉంటుంది. ఈ ఒత్తిడిని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో టారిఫ్ దిద్దుబాట్లకు దిగుతున్నాయి. ఈ నిర్ణయంతో నెలవారీ మొబైల్ రీఛార్జ్ బిల్లు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో డేటా కోసం కూడా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. చౌకైన ప్లాన్‌లు ఇప్పటికే కనుమరుగవుతున్నాయి. టెలికాం ఖర్చుల కోసం వినియోగదారుల నెలవారీ రీఛార్జ్ డబ్బులను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇకపై వినియోగదారులు ప్రస్తుత డేటా వినియోగాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరాలు, బడ్జెట్‌కు సరిపోయే ప్లాన్‌ ను సెలెక్ట్ చేసుకోవాలి. త్వరలోనే టెలికాం కంపెనీల నుంచి ధరల పెంపు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పెంపు ప్రకటన రాకముందే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ లు చేసుకుంటే ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

Read Also: రూ.100, రూ.110కు పెట్రోల్ కొట్టిస్తే ఏమవుతుంది? మోసపోకూడదంటే ఏ రూల్ పాటించాలి?

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×