E-Paper
Advertisement

OTT Movie : అరవింద్ కేజ్రీవాల్ మెచ్చిన వెబ్ సిరీస్ ఇదే… ఇంకా చూడలేదా ?

OTT Movie : అరవింద్ కేజ్రీవాల్ మెచ్చిన వెబ్ సిరీస్ ఇదే… ఇంకా చూడలేదా ?
Advertisement

OTT Movie : బిహార్ రాజకీయాల ఆధారంగా రూపొందిన ‘మహా రాణి’ వెబ్ సిరీస్‌లోని నాల్గవ సీజన్ కి విశేష స్పందన వస్తోంది. ఈ సిరీస్ ను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బాగా మెచ్చుకున్నారు. ఈ సీజన్‌ ను ప్రజలు తప్పక చూడాల్సినదని ట్విట్టర్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ అవుతూ, రాజకీయ, సినిమా వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొందరు భారతీయ రాజకీయాలకు అద్దం పట్టినట్లు ఉందని మెచ్చుకుంటే, మరికొందరు కేజ్రీవాల్ ఇప్పుడు సినిమా రివ్యూయర్ అయిపోయారని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో రాణి భారతి పాత్రలో హుమా ఖురేషీ బిహార్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. 1990లలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రబ్రీ దేవిని వారసురాలిగా ప్రకటించబడిన సంఘటలను ప్రధాన అంశంగా ఈ సిరీస్ చూపిస్తుంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

పూనీత్ ప్రకాష్ దర్శకత్వంలో ఈ సిరీస్ సోనీ లివ్‌లో నవంబర్ 7న విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. సీజన్ 4 ఎనిమిది ఎపిసోడ్‌లను కలిగి ఉంది. రాణి భారతి రెండుసార్లు సీఎంగా ఉండి, ఇప్పుడు ఢిల్లీలో జాతీయ అధికారం కోసం పోరాడుతుంది. సీజన్ 4లో హుమా ఖురేషీనే మెయిన్ హీరోయిన్ రానీ భారతిగా మళ్లీ దుమ్ము రేపింది. ఆమెతో పాటు విపిన్ శర్మ (ప్రధాని సుధాకర్ జోషి), అమిత్ సియాల్ (నవీన్ కుమార్), ప్రమోద్ పాఠక్, వినీత్ కుమార్, కని కుసృతి, రాజేశ్వరీ సచ్దేవ్ వంటి సీనియర్ నటులు కీ రోల్స్‌లో కనిపిస్తారు. ఈ సారి కొత్తగా శ్వేతా బాసు ప్రసాద్ (రానీ కూతురు రోష్ణి భారతిగా, బిహార్ కొత్త సీఎం) ఎంట్రీ ఇచ్చింది. ఈ ఇద్దరూ ఈ సీజన్‌లో చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

కథ ఏమిటంటే

Advertisement

2012లో రాణి భారతి (హుమా ఖురేషీ) రెండుసార్లు బిహార్ సీఎంగా ఉండి, ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి కావాలని ప్లాన్ చేస్తుంది. ప్రధాని సుధాకర్ జోషి (విపిన్ శర్మ) ఆమెను ఆపడానికి CBI, ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్స్ పెట్టి ఇబ్బందులు పెడతాడు. రాణి పీఎం అయ్యే దశలో ఉంటుంది కానీ ఒక్కసారిగా పెద్ద స్కాండల్ ఆమె మీద పడుతుంది. దీంతో ఆమె సీఎం పదవికి రాజీనామా చేసి, తన పెద్ద కూతురు రోష్ణిని (శ్వేతా బాసు ప్రసాద్) బిహార్ సీఎంగా చేస్తుంది. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. ఇంతలో రాణి పెద్ద కొడుకు జైని ఎవరో హత్య చేస్తారు. రాణి పీఎం కలలు బూడిద అవుతాయి. ఆమె కుటుంబం విషాదంలో మునుగుతుంది. ఆమె చిన్న కొడుకు సూర్య లండన్ నుంచి వచ్చి సపోర్ట్ చేస్తాడు. చివరి సీన్‌లో జోషి భార్యాభర్తలు రానీ ఇంటికి వచ్చి సంతాపం చెప్పినట్టు నటిస్తారు. కానీ రాణి కళ్లు ఎర్రగా చేస్తూ ‘తుమ్హే మై జీనే నహీ దూంగీ’ అని ఒక రివెంజ్ డైలాగ్ కొడతుంది. ఇక సీజన్ 5లో రాణి పూర్తిగా రివెంజ్ మోడ్‌లోకి వెళ్తుందని అర్థమవుతుంది.

 

Advertisement

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×