E-Paper
Advertisement

Organ Donation: సరికొత్త చరిత్ర.. ఐదుగురు ప్రాణాలు కాపాడిన.. 10 నెలల పసికందు..!

Organ Donation: సరికొత్త చరిత్ర.. ఐదుగురు ప్రాణాలు కాపాడిన.. 10 నెలల పసికందు..!
Advertisement

Organ Donation: కేరళకు చెందిన 10 నెలల పసికందు తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసింది. అవయవధాతగా మారి ఐదు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. అంతేకాకుండా కేరళలో అవయవదానం చేసిన అతి పిన్న వయస్కురాలిగా ఆ శిశువు చరిత్రకెక్కింది. తద్వారా ఎంతో మందికి ఆ పసికందు ఆదర్శంగా నిలిచింది.

వివరాల్లోకి వెళ్తే..

కేరళలోని పాతనంతిట్ట జిల్లా మల్లపల్లికి చెందిన అరుణ్ అబ్రహం, షెరిన్ దంపతుల కుమార్తె అలిన్ షెరిన్ ఫిబ్రవరి 5న రోడ్డు ప్రమాదానికి గురైంది. కొట్టాయం నుంచి తిరువల్లకు వెళ్తుండగా.. ప్రమాదం జరిగి చిన్నారి తలకు బలమైన గాయం అయ్యింది. చిన్నారి స్పృహకోల్పోవడంతో వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో చెతిపుళలోని సెయింట్ థామస్ ఆస్పత్రికి తరలించారు.

చిన్నారికి బ్రెయిన్ డెడ్

Advertisement

అలా మరో రెండు ఆస్పత్రులు మారి ఫిబ్రవరి 6న రాత్రి అమృత హాస్పిటల్ కు తీసుకొచ్చారు. దాదాపు వారం రోజుల పాటు ప్రత్యేక వైద్య బృందాలు నిరంతరాయంగా ప్రయత్నించినప్పటికీ.. శిశువు ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో అలిన్ షెరిన్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఒక్కసారిగా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

శిశువు అవయవాలు సేకరించి..

తమ బిడ్డ దూరమైనా.. మరో ఐదుగురు చిన్నారులకు ప్రాణదాతగా మారాలని శిశువు తల్లిదండ్రులు నిర్ణయించారు. చిన్నారి అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో చిన్నారి శరీర భాగాలను సేకరించి.. కేరళలోని వివిధ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ఐదుగురికి వాటిని అమర్చారు.

ఆర్గన్ డోనేషన్ జరిగిందిలా..

Advertisement

కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 6 నెలల చిన్నారికి అలిన్ కాలేయాన్ని వైద్యులు అమర్చారు. మూత్ర పిండాలను SAT ఆస్పత్రిలోని పీడియాట్రిక్ నెఫ్రాలజీ వార్డులో చికిత్స పొందుతున్న బిడ్డకు అందించారు. గుండెను శ్రీచిత్ర తిరునాల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో చికిత్స పొందుతున్న ఒక రోగికి కేటాయించగా.. కంటికి సంబంధించిన కార్నియాను అమృత హాస్పిటల్ లోని మరో రోగికి దానం చేశారు.

Also Read: Viral Video: పెళ్లి వేదికపైకి.. స్టైల్‌గా వచ్చి సైలెంట్‌గా.. వధువు బ్యాగ్ కొట్టేసిన దొంగ

కేరళ మంత్రి రియాక్షన్..

మరోవైపు తల్లిదండ్రులు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని కేరళ వైద్యారోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రశంసించారు. బిడ్డను కోల్పోవడం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట కాలంలోనూ అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించి మానవత్వం చాటుకున్నారని పేర్కొన్నారు. బిడ్డను కోల్పోయిన సదరు కుటుంబానికి కేరళ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

Also Read: Single vs Double Door Fridges: డోర్లలోనే కాదు.. ఫీచర్లలోనూ వ్యత్యాసం.. రెండింటిలో ఏది కొంటే బెటర్

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×