E-Paper
Advertisement

Flipkart GOAT Sale: కొత్త సేల్ తెచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. కళ్లు తిరిగే ఆఫర్లు!

Flipkart GOAT Sale: కొత్త సేల్ తెచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. కళ్లు తిరిగే ఆఫర్లు!
Advertisement

Flipkart GOAT Sale: ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) పేరుతో మరో సేల్‌తో రావడానికి సిద్ధంగా ఉంది. కొత్త సేల్‌లో టీవీలు, ఏసీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులుపై మరెన్నో డిస్కౌంట్లు, ఆఫర్‌లు అందించనుంది. ఈ రాబోయే సేల్ ఈ నెలలోనే లైవ్ కానుంది. ఈ సేల్‌లోని ప్రత్యేకత ఏమిటంటే 80 శాతం వరకు తగ్గింపుతో అనేక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. మీరు ఐఫోన్ లవర్స్ అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఐఫోన్ 14 ప్లస్‌లో పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్‌లు ఉంటాయి. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 23,901 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ బెస్ట్ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Also Read: మిడిల్ క్లాస్ ఫోన్.. రెడ్‌మీ 5G మొబైల్.. వరదల్లా ఆఫర్లు!

ఇండియాలో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ బేస్ 128GB వేరియంట్ ధర రూ. 79,990గా ఉంది. అయితే  ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 55,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాదు మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగిస్తే మీకు రూ. 1,000 తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఇది కాకుండా కస్టమర్లు తమ పాత ఫోన్‌‌ను రూ. 48,000 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది ఫోన్ పర్ఫామెన్స్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది.

Advertisement

మీరు ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ నుండి ఆపిల్ 14 ప్లస్ కొనుగోలు చేస్తే మీరు 79,990 రూపాయలు చెల్లించాలి. మీరు విజయ్ సేల్స్‌ను ఎంచుకుంటే మీరు రూ. 70,490 చెల్లించాల్సి ఉంటుంది. అయితే క్రోమా ఈ స్మార్ట్‌ఫోన్ రూ.71,090కి అందిస్తోంది. అమెజాన్ ఈ ఫోన్‌ను రూ.64,999కి అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్‌సై అనేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇతర సైట్‌లలో కూడా విపరీతమైన బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందవచ్చు.

Also Read: బడ్జెట్ ఫ్లాగ్‌షిప్.. CMF ఫోన్‌పై ఆఫర్లు.. కొత్తగా ట్రై చేశారు!

ఐఫోన్ 14 ప్లస్ బ్యాంక్ ఆఫర్‌లతో సుమారు రూ. 55,000కి కొనుగోలు చేయవచ్చు. ఈ ధరలో మంచి డీల్ అవుతుంది. ఈ ఫోన్ A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు డ్యూయల్ 12MP కెమెరా, 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. దీనికి IP68 రేటింగ్‌ను కూడా ఉంటుంది. దీంతో ఇది మంచి వాటర్‌ప్రూఫ్ ఫోన్‌గా మారింది. అదే సమయంలో మీ బడ్జెట్ ఎక్కువగా ఉంటే మీరు త్వరలో విడులయ్యే iPhone 16 సిరీస్ కొనుగోలు చేయవచ్చు. దీనిలో బెస్ట్ కెమెరా,  డిజైన్ అప్‌గ్రేడ్‌లతో పాటు అనేక AI ఫీచర్లు ఉంటాయి.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×