BigTV English

Chandrababu Assurance: ఆ బాబును నేనే చదివిస్తా: సీఎం చంద్రబాబు

Chandrababu Assurance: ఆ బాబును నేనే చదివిస్తా: సీఎం చంద్రబాబు

Chandrababu Assurance of Soma’s Son Education(AP News today): నక్సల్స్ చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా సోమ సతీమణి ఇచ్చావతి యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సోమ కుమారిడి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని వారికి హామీ సీఎం హామీ ఇచ్చారు.


అంతకుముందు సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. సమస్యలతో వచ్చినవారిని చూసి రోడ్డుపైనే కాన్వాయ్ ని ఆపారు. అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారి వినతులను స్వీకరించారు. తమను ఆదుకోవాలంటూ అరకు సర్పంచ్ శ్రీనివాస్ సీఎం చంద్రబాబును కోరగా.. సమస్యను పరిష్కరిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు.

Also Read: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి.. అనంతపురంలో విమానాశ్రయం


ఇదిలా ఉంటే.. రహదారులు భవనాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుత రోడ్ల పరిస్థితిని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ. 300 కోట్లు అసరమని అధికారులు సీఎంకు చెప్పారు. అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలంటూ సీఎం ఆదేశించారు.

గత ప్రభుత్వం రోడ్ల పరిస్థితులను పట్టించుకోలేని కారణంగా.. వాహనదారులు, ప్రజలు ఐదేళ్లపాటు నరకం చూశారన్నారు. ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు పెట్టాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో 4,151 కిలో మీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందన్నారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సినటువంటి రోడ్లు మరో 2,936 కిలో మీటర్ల మేర ఉన్నాయంటూ చంద్రబాబు చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలో మీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×