BigTV English

Samsung Galaxy F14 Offer: హలో బ్రదర్.. రూ.387లకే 5G స్మార్ట్ ఫోన్.. ఇలాంటి ఆఫర్ నెవర్ బీఫోర్.. ఎవర్ ఆఫ్టర్!

Samsung Galaxy F14 Offer: హలో బ్రదర్.. రూ.387లకే 5G స్మార్ట్ ఫోన్.. ఇలాంటి ఆఫర్ నెవర్ బీఫోర్.. ఎవర్ ఆఫ్టర్!

Offers on Samsung Galaxy F14 5G Mobile: స్మార్ట్‌ఫోన్ కంపెనీలు బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేశాయి. ఈ క్రమంలో కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నాయి. కంపెనీలు ఈ సెగ్మెంట్‌పై స్పెషల్ ఫోకస్ చేశాయి. పోటాపోటీగా గ్యాడ్జెట్లను తక్కువ ప్రైస్‌లో ఆఫర్ చేస్తున్నాయి. అయితే మీరు కూడా బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే మీకో మంచి స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆఫర్‌లో చాలా తక్కవ ధరకే లభిస్తుంది.


కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీరు Samsung Galaxy F14ని కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే ఈ  Samsung స్మార్ట్‌ఫోన్‌పై చాలా ఆకర్షణీయమైన ఆఫర్‌లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. అంతేకాకుండా నెలకు రూ. 387 చెల్లించడం ద్వారా మీరు ఈ ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు మీరు ఈ ఫోన్‌ని వన్ టైమ్ పేమెంట్ చేయడం ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే మీరు దాని 4 GB RAM వేరియంట్‌ను కేవలం రూ. 10,990కి ఆర్డర్ చేయవచ్చు.

Also Read: ఇదేంది భయ్యా.. ఐఫోన్లు, వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు.. ఇక రచ్చ రచ్చే!


Samsung Galaxy F14 5G స్మార్ట్‌ఫోన్ 6 GB RAM వేరియంట్‌లో వస్తుంది. ఇది ప్రస్తుతం రూ. 11,990కి అందుబాటులో ఉంది. ఈ వేరియంట్‌ని నెలకు రూ. 422తో EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ఈ ఫోన్ 4GB/6GB RAM +128GB స్టోరేజ్‌తో వస్తుంది. దీన్ని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

Samsung Galaxy F14 5G Specifications
ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ కెమెరా గురించి మాట్లాడుతే మీరు ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం బ్యాక్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ చూస్తారు. ఇందులో 2 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇది 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలతో మంచి క్వాలిటీ పిక్స్‌ను క్లిక్ చేయచ్చు.

Also Read: అంబానీ మావ తాటతీశాడు.. రూ.3వేలకే 5G ఫోన్.. ఫీచర్లు సూపరో సూపర్!

ఈ చవకైన శామ్‌సంగ్ ఫోన్‌లో ఉన్న అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే ఇందులో లభించే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్. కంపెనీ ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ 6000mAh బ్యాటరీని తీసుకొచ్చారు. ఇది అద్భుతమైన బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీని 25W ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. ఇందులో పెద్ద 6.6 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. స్మార్ట్‌ఫోన్ Exynos 1330, ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో Android 13 OSలో రన్ అవుతుంది.

Tags

Related News

ATM PIN Safety: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Xiaomi 17 Pro: 5x జూమ్, 6,300mAh బ్యాటరీ.. అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 17 ప్రో లాంచ్

Amazon Xiaomi 14 CIVI: షావోమీ 14 సివీపై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.17000 డిస్కౌంట్!

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Big Stories

×