BigTV English

Indira Gandhi Posters in Canada: కెనడాలో ఇందిరాగాంధీ హత్య పోస్టర్లు.. స్పందించిన మంత్రి!

Indira Gandhi Posters in Canada: కెనడాలో ఇందిరాగాంధీ హత్య పోస్టర్లు.. స్పందించిన  మంత్రి!

Indira Gandhi Killing Posters in Canada: కెనడాలో ఖలిస్తానీ వేర్పాటు వాదులు ఇందిరాగాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లు అతికించడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ చర్యను కెనడా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని తెలిపింది. దీనిపై కెనడా మంత్రి డామినిక్ ఏ లెబ్లాంక్ ఎక్స్ వేదికగా స్పందించారు.


వాంకూవర్‌లో కొందరు ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లు వేసారు. దీంతో కెనడాలో ఈ విధంగా హింసను ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదని కెనడా మంత్రి పేర్కొన్నారు. దీనికి ముందు కెనడాలోని వాంకోవర్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యపై వివాదాస్పద పోస్టర్లు అతికించడాన్ని హిందూ-కెనడియన్ ఎంపీ, మంత్రి చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుబట్టారు. కెనడాలో హింసను ప్రోత్సహించడాన్ని అంగీకరించమని స్పష్టం చేశారు. అంతే కాకుండా కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్రూడో ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

ప్రధాని జస్టిస్ ట్రూడో పార్టీకి చెందిన ఎంపీ ఆర్య ట్విట్టర్ వేదికగా భారత ప్రధాని ఇందిరాగాంధీ శరీరంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని, ఆమె అంగరక్షకులే తుపాకులు పట్టుకుని హంతకులుగా మారారని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు పోస్టర్లు వేసి.. హిందూ- కెనడియన్లలో భయం కలిగించడానికి ప్రయత్నిస్తుననారని పేర్కొన్నారు.


Also Read: తీవ్ర కలకలం.. ఏకంగా దేశ ప్రధానిపై వ్యక్తి దాడి..

ఇది కొన్ని ఏళ్ల క్రితం బ్రాంప్టన్‌లో జరిగిన బెదిరింపు కొనసాగింపని, కెనడాలోని హిందువును భారత్‌కు తిరిగి వెళ్లాలని కోరుతున్నట్లు ఖలిస్థానీ ఉద్యమ నేత పన్నూన్ చర్యలని పేర్కొన్నారు. ఆయన ప్రత్యేక సిక్కు రాష్ట్ర ఉద్యమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అంతే కాకుండా పన్నూన్‌పై కెనడాలోని లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్య డిమాండ్ చేశారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×