BigTV English

WI Won by 134 Runs: మరో అత్యల్ప స్కోరు నమోదు.. ఉగండా 39కి ఆలౌట్ .. వెస్టిండీస్ ఘన విజయం!

WI Won by 134 Runs: మరో అత్యల్ప స్కోరు నమోదు.. ఉగండా 39కి ఆలౌట్ .. వెస్టిండీస్ ఘన విజయం!

West Indies Won by 134 Runs against Uganda in T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ 2004లో  మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. వీటిలో దాదాపు సగం జట్లన్నీ కూడా కొత్తవే.. వాళ్లు ఎన్నో క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఆడి, వరల్డ్ కప్ టోర్నమెంట్ లో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి దేశాల్లో ఒకటైన ఉగండా నేడు వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అత్యల్ప స్కోరు 39కి ఆలౌట్ అయ్యింది.


2014లో శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో నమీబియా ఇలాగే 39 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అదే ఇంతవరకు ఆల్ టైమ్ చెత్త రికార్డుగా ఉంది. ఇప్పుడు ఉగండా ఆ స్కోరుని సమం చేసింది.

అయితే టీ20 ప్రపంచకప్ 2024లో ఆతిథ్య వెస్టిండీస్ దుమ్ము రేపుతోంది. గ్రూప్-సీలో వరుసగా రెండో విజయాన్నందుకుంది. పసికూన ఉగాండాతో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 134 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.


ఈ గెలుపుతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పరుగుల పరంగా భారీ విజయాన్ని నమోదు చేసిన రెండో జట్టుగా వెస్టిండీస్ (134) చరిత్ర సృష్టించింది. అంత కన్నా ముందు శ్రీలంక 172 పరుగుల భారీ తేడాతో కెన్యాపై గెలిచి  అగ్రస్థానంలో ఉంది.

Also Read: Rohit Sharma with Team India : మనవాళ్లకు ఒకటే మాట చెప్పాను: : కెప్టెన్ రోహిత్ శర్మ

వివరాల్లోకి వెళితే వెస్టిండీస్ వర్సెస్ ఉగండా మధ్య గయానాలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. అలా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఉగండా 12 ఓవర్లలో 39 పరుగులకి ఆలౌట్ అయిపోయింది.

174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఉగండా ఏ దశలోనూ పోరాట పటిమ చూపలేదు. అంతమందిలో ఒకే ఒకరు రెండంకెల స్కోరు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జుమా మియాగి (13) ఒక్కరే కాసేపు వెస్టిండీస్ బౌలింగుని ప్రతిఘటించి, కాసేపు క్రీజులో నిలిచాడు. అందరూ 1, 2, 3, 4, 5,6 ఇలా పరుగులు చేశారు. వీరిలో ముగ్గురు డక్ అవుట్లు అయ్యారు. ముగ్గురు ఒకొక్క పరుగు మాత్రమే చేశారు. చివరికి  12 ఓవర్లలో 39 పరుగులకి చాప చుట్టేశారు.

Also Read: టీ 20 ప్రపంచకప్ లో.. పాకిస్తాన్ పై టీమ్ ఇండియా రికార్డు

వెస్టిండీస్ బౌలర్.. ఆకైల్ హోసైన్ నిప్పులు చెరిగే బంతులు వేసి  ఉగండాను వణికించాడు. 5 వికెట్లు తీశాడు. జోసెఫ్ 2, రొమారియో 1, ఆండ్రీ రసెల్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (13) వెంటనే అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (44) కాసేపు పోరాడాడు. అయితే మిగిలిన వారు గొప్పగా ఆడలేదు కానీ, తమ వంతుగా 20 పరుగుల చొప్పున చేశారు. చివర్లో ఆండ్రి రసెల్ మాత్రం 17 బంతుల్లో 30 పరుగులు చేసి స్కోరు బోర్డుని ముందుకి నడిపించాడు. లేకపోతే ఆ టార్గెట్ కూడా వచ్చేది కాదు. మొత్తానికి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.

ఉగండా బౌలింగులో అల్పేష్ రంజానీ 1, కాస్మోస్ 1, బ్రియాన్ మసాబా 2, దినేష్ నక్రానీ 1 వికెట్ పడగొట్టారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×