Majji Srinivasa: విజయనగరం రాజకీయాల్లో ఒక్క రాజీనామా.. పెద్ద ప్రకంపనలు రేపుతోంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పార్టీకి నిన్న గుడ్‌బై చెప్పడం బిగ్ టాక్ గా మారింది. జిల్లా అధ్యక్ష పదవితో పాటు భీమిలి ఇన్‌ఛార్జ్ బాధ్యతలకూ రాజీనామా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ… జడ్పీ చైర్‌పర్సన్ రేసులో బొత్స సత్యనారాయణ తన కుమార్తె అనూష పేరు తెరపైకి తీసుకురావడం… అప్పటికే జడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకున్న చిన్న శ్రీనుతో విభేదాలకు దారితీసిందన్న ప్రచారం ఉంది. ఇక్కడే టీడీపీ సైలెంట్ ఆపరేషన్ మొదలైందా? రాజీనామా చేసిన గంటల్లోనే చిన్న శ్రీను కుమార్తెతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం చూస్తే… ముందస్తు పొలిటికల్ ప్లాన్ ఉందన్న అనుమానాలు సహజంగానే వస్తున్నాయ్. ఒకవైపు బొత్స కుటుంబంలో జడ్పీ పీఠంపై పోటీ… మరోవైపు టీడీపీకి దొరికిన బలమైన నాయకుడు. ఈ రెండూ విజయనగరాన్ని గరంగరంగా మార్చేశాయ్. స్థానిక ఎన్నికల ముందు విజయనగరంలో బొత్సను టార్గెట్ చేస్తూ టీడీపీ పొలిటికల్ స్ట్రోక్.. వైసీపీపై ఎంత ప్రభావం చూపుతుంది?