E-Paper
Advertisement

Fossibot F113: 50 మీటర్ల చీకటిలో కూడా క్లియర్ ఫోటోలు తీసే మిలిటరీ ఫోన్.. 12GB ర్యామ్, 20,000mAh బ్యాటరీ ఫీచర్లు

Fossibot F113: 50 మీటర్ల చీకటిలో కూడా క్లియర్ ఫోటోలు తీసే మిలిటరీ ఫోన్.. 12GB ర్యామ్, 20,000mAh బ్యాటరీ ఫీచర్లు

Fossibot F113 rugged smartphone| మిలిటరీ గ్రేడ్ స్మార్ట్ డివైజ్‌లు తయారు చేసే ఫాసిబాట్ కంపెనీ తాజాగా ఒక స్పెషల్ ఫీచర్స్ తో రగ్గడ్ ఫోన్ ని లాంచ్ చేసింది. యూరోప్‌లో తాజాగా విడుదలైన ఈ ఫోన్ అక్కడ సెన్సేషన్ గా మారింది. ఈ ఫోన్ పేరు ఫాసిబాట్ F113. ఈ ఫోన్ చాలా బలమైన బ్యాటరీతో, అసాధారణ డ్యూరబిలిటీతో వచ్చింది. ఇది ఔట్‌డోర్ అడ్వెంచర్లు, కఠిన పరిస్థితుల్లో పని చేసే వాళ్లకు ప్రత్యేకంగా రూపొందించారు. మరి ముఖ్యంగా, 50 మీటర్ల చీకట్లో కూడా స్పష్టమైన ఫోటోలు తీయగల కెమెరా ఫీచర్ ఉంది. ఈ ఫోన్ 2025 నవంబర్ 28న లాంచ్ అయింది.

ధర, అందుబాటు

ఫాసిబాట్ F113 ధర €399.99 (పౌండ్లు) (భారత కరెన్సీలో సుమారు రూ.48,000). కానీ ప్రస్తుతం లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లో $279 (సుమారు రూ.23,500)కి అందుబాటులో ఉంది. ప్రోమో కోడ్ PR113 ఉపయోగించి మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 3 వరకు మాత్రమే. ఈ మిలిటరీ గ్రేడ్ రగ్గడ్ ఫోన్ మొదట యూరోపియన్ మార్కెట్లలో విడుదల అయింది. అధికారిక వెబ్‌సైట్ fossibot.com నుంచి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం గ్లోబల్‌గా అందుబాటులో లేదు, కానీ త్వరలో వస్తుందని అంచనా.

డిస్‌ప్లే, బిల్డ్ క్వాలిటీ

ఫోన్‌లో 6.78 అంగుళాల పెద్ద IPS LCD డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్స్ (FHD+). 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా స్క్రాలింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో స్క్రాచ్‌ల నుంచి కాపాడుతుంది. మల్టీ-కలర్ LED లైట్ ఉంది, ఇది నోటిఫికేషన్లు, కాల్ అలర్ట్‌లకు ఉపయోగపడుతుంది. రియర్ డైనమిక్ బ్రీతింగ్ లైట్ 20 కలర్లు, మ్యూజిక్ రిథమ్ మోడ్‌లతో పర్సనలైజ్ చేయవచ్చు. సైడ్‌లో క్యారీ స్ట్రాప్ ఉంది. ఈ ఫోన్ లో బ్రైట్ టార్చ్‌ లైట్ ఉంది. చీకటిలో అద్భుతంగా ఉపయోగించవచ్చు.

ఎక్స్‌ట్రీమ్ డ్యూరబిలిటీ

ఈ ఫోన్ చాలా కఠిన పరిస్థితులకు తట్టుకునేలా డిజైన్ చేశారు. IP68 రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్. IP69K సర్టిఫికేషన్‌తో హై-ప్రెషర్ వాటర్ జెట్‌లకు కూడా తట్టుకుంటుంది. MIL-STD-810H స్టాండర్డ్‌తో డ్రాప్-ప్రూఫ్, షాక్-రెసిస్టెంట్. ఔట్‌డోర్ వర్కర్లు, ట్రావెలర్లకు ఇది పర్ఫెక్ట్.

పెర్ఫామెన్స్, స్టోరేజ్

మీడియాటెక్ డైమెన్సిటీ 7050 (6nm) ప్రాసెసర్‌తో 5G సపోర్ట్ ఉంది. 12GB ర్యామ్ (ప్లస్ 24GB వర్చువల్, మొత్తం 36GB) మల్టీటాస్కింగ్ స్మూత్‌గా చేస్తుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోSD కార్డ్‌తో 2TB వరకు ఎక్స్‌పాండ్ చేయవచ్చు. బాక్స్ అవుట్‌ఆఫ్ ఆండ్రాయిడ్ 15 OSతో వస్తుంది. రోజువారీ పనులు, గేమింగ్ అన్నీ ఫాస్ట్‌గా సాగుతాయి.

ఆడియో, లైట్ సోర్స్

ఫోన్‌లో 110 dB ఇంటర్నల్ బాక్స్ స్పీకర్ ఉంది, చాలా బిగ్గరగా సౌండ్ వస్తుంది. టాప్ ఎడ్జ్‌లో 160-లూమెన్ LED లైట్ (1.5W) ఉంది, 38 గంటలు కంటిన్యూస్‌గా పనిచేస్తుంది. చీకటి ప్రదేశాల్లో ఇది చాలా ఉపయోగకరం. మ్యూజిక్, అలర్ట్‌లకు రిథమ్ లైటింగ్ కస్టమైజ్ చేయవచ్చు.

బ్యాటరీ

ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 20,000 mAh. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు-మూడు రోజులు సులువుగా పనిచేస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో ఔట్‌డోర్ ట్రిప్‌లకు ఇది ఐడియల్. LED లైట్‌ను కూడా ఎక్కువసేపు వాడవచ్చు.

నైట్ విజన్ కెమెరా సిస్టమ్

రియర్ కెమెరాల్లో 50MP మెయిన్ + 64MP ఇన్‌ఫ్రారెడ్ నైట్ విజన్ + 5MP మ్యాక్రో ఉన్నాయి. ముఖ్య ఫీచర్ 64MP IR కెమెరా – 3W IR లైట్‌తో.. 50 మీటర్ల చీకట్లో స్పష్టమైన ఫోటోలు తీస్తుంది. సాధారణ రగ్డ్ ఫోన్‌లు 5-10 మీటర్లకు మాత్రమే పరిమితం, కానీ ఇది 50 మీటర్ల వరకు క్లియర్ విజిబిలిటీ ఇస్తుంది. ఫ్రంట్ 32MP సెల్ఫీ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీలకు మంచిది.

ఫాసిబాట్ F113 అసాధారణ ఫీచర్స్‌తో వచ్చిన రగ్డ్ ఫోన్. చీకటి ఫోటోగ్రఫీ, లాంగ్ బ్యాటరీ, డ్యూరబిలిటీ.. అన్నీ ఒకే ఫోన్‌లో ఉన్నాయి. ఔట్‌డోర్ క్యాంప్ ప్రియులకు ఇది మిస్ చేయకూడదు. ఆఫర్ ముగిసే ముందు అధికారిక సైట్‌లో చెక్ చేయండి. ఈ ఫోన్ మీ అడ్వెంచర్‌లను మరింత ఎక్సైటింగ్ చేస్తుంది!

Also Read: దేశంలో నకిలీ ఫోన్ల విక్రయాలు.. ఒకేసారి 100కు పైగా ఐఫోన్లు డెడ్..

Related News

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

Big Stories

×