E-Paper
Advertisement

Road Accident: లారీని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు, స్పాట్‌‌లో డజను మంది, ఆపై ఇద్దరు

Road Accident: లారీని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు, స్పాట్‌‌లో డజను మంది, ఆపై ఇద్దరు
Advertisement

Road Accident: తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రతీ రోజు అరడజను పైగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా లారీని వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో 10 మంది వరకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రావెల్ బస్సు.. లారీ వెనుక భాగంలో బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లో ఇద్దరు మృతి చెందగా.. మరో 10 మంది వరకు గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తోంది. బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో దాదాపు కిలోమీటర్ మేరా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Advertisement

లారీని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు

అందులోని మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి అంబులెన్సులో తరలించారు. వాహనాలను పక్కకు పెట్టి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అతివేగంగా కారణంగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

అసలే చలికాలం, ఆపై పొగ మంచు కారణంగా వాహనాలు కనిపించడక పోవడంతో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. బాధితుల నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు పోలీసులు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో లారీ డ్రైవర్ మృతి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×