E-Paper
Advertisement

Samsung 320MP Camera: త్వరలో శాంసంగ్ 320MP కెమెరా ఫోన్.. భారీ ఎక్సినోస్ 2600 ప్రాసెసర్‌తో ఫ్లాగ్‌షిప్

Samsung 320MP Camera: త్వరలో శాంసంగ్ 320MP కెమెరా ఫోన్.. భారీ ఎక్సినోస్ 2600 ప్రాసెసర్‌తో ఫ్లాగ్‌షిప్
Advertisement

Samsung 320MP Camera S26 | కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో కొత్తగా గెలాక్సీ S26 లాంచ్ చేయబోతోంది. అయితే ఈ కొత్త సిరీస్‌తో మొబైల్ పనితీరు, కెమెరా టెక్నాలజీని సరికొత్తగా డిఫైన్ చేయాలని ప్లాన్ చేస్తోంది. లీక్స్ ప్రకారం.. శామ్‌సంగ్ ఇప్పటివరకు తన అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ చిప్‌సెట్‌ లాంచ్ చేయనుంది. ఈ ప్రాసెసర్ త్వరలోనే విడుదల కాబోతున్న గెలాక్సీ S26 సిరీస్‌తో లాంచ్ కావచ్చు.

గెలాక్సీ S26 సిరీస్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?

శామ్‌సంగ్ సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రారంభంలో కొత్త గెలాక్సీ S సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేస్తుంది. ఇండస్ట్రీ సోర్సెస్ ప్రకారం.. గెలాక్సీ S26 సిరీస్ వచ్చే జనవరి 2026 నెలలోనే లాంచ్ కావచ్చు. టెక్ ప్రేమికులు ఈ ఫ్లాగ్‌షిప్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గెలాక్సీ S26లో ఎక్సినోస్ 2600 చిప్‌సెట్ ప్రధాన ఆకర్షణ

Advertisement

శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్‌లో కొత్త ఎక్సినోస్ 2600 చిప్‌సెట్‌ తో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇది కొత్త సిరీస్‌లో ప్రధాన హైలైట్ కావచ్చు. శామ్‌సంగ్ ఈ చిప్‌ను అడ్వానస్ 2nm మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీతో డిజైన్ చేసింది. ఇది శామ్‌సంగ్ ఇప్పటివరకు చేసిన అత్యంత శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్ అని కంపెనీ చెబుతోంది.

క్వాల్‌కామ్ చిప్‌తో ఎక్సినోస్ 2600 పోటీ

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5తో శాంసంగ్ కొత్త చిప్ ఎక్సినోస్ 2600 నేరుగా పోటీ పడుతుంది. క్వాల్‌కామ్ చిప్ 3nm ప్రాసెస్‌తో తయారవుతుందని అంచనా. శామ్‌సంగ్ 2nm చిప్‌తో మరింత ఎఫిషియెన్సీ, బెటర్ పనితీరు ఆశిస్తోంది.

పనితీరు, ఎఫిషియెన్సీని మెరుగుపరిచేందుకు కొత్త GAA టెక్నాలజీ

Advertisement

ఎక్సినోస్ 2600లో గేట్-ఆల్-అరౌండ్ (GAA) టెక్నాలజీ ఉంది. ఇది ట్రాన్సిస్టర్ కంట్రోల్ మరియు పవర్ ఎఫిషియెన్సీని మెరుగుపరుస్తుంది. ఎక్సినోస్ 2500 కంటే 39 శాతం మెరుగైన పనితీరు ఇస్తుందని శామ్‌సంగ్ చెబుతోంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కూడా మెరుగైంది. హీట్ పాత్ బ్లాక్ సిస్టమ్ భారీ ఉపయోగంలో ఓవర్‌హీటింగ్‌ను తగ్గిస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో స్టెబులిటీ ఇస్తుంది.

ఎక్సినోస్ 2600లో 10-కోర్ CPU ఆర్కిటెక్చర్

ఎక్సినోస్ 2600లో 10-కోర్ CPU డిజైన్ ఉంది. కొత్త ఆర్మ్ ల్యూమెక్స్ ఆర్కిటెక్చర్‌తో తయారు చేశారు. ప్రాసెసింగ్ స్పీడ్, ఎఫిషియెన్సీ పెరుగుతాయి. శామ్‌సంగ్ ఎక్స్‌క్లిప్స్ 960 GPUతో జత చేసింది. గ్రాఫిక్స్ రెండరింగ్ గణనీయంగా మెరుగవుతుంది. 32K MAC NPU జనరేటివ్ AI పనితీరును 113 శాతం వరకు పెంచుతుంది. AI టాస్క్‌లు వేగంగా, స్మూత్‌గా జరుగుతాయి.

Also Read: ఒక్క రోజులోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగిపోతారు.. యాడ్స్ అవసరం లేదు.. ఎలాగంటే

320MP కెమెరా సెన్సార్లకు సపోర్ట్

శామ్‌సంగ్ కెమెరా ప్రాసెసింగ్‌లో భారీ మెరుగులు ప్లాన్ చేస్తోంది. ఎక్సినోస్ 2600 చిప్.. 320 మెగాపిక్సెల్స్ వరకు కెమెరా సెన్సార్లను సపోర్ట్ చేస్తుంది. అడ్వాన్స్‌డ్ ఫోటోగ్రఫీ ఫీచర్లు లభిస్తాయి. దీంతో ఇమేజ్ క్లారిటీ, డీటెయిలింగ్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుతుంది. AVP కోడెక్ సపోర్ట్ వీడియో కంప్రెషన్, క్వాలిటీని మెరుగుపరుస్తుంది. ఆపిల్ ప్రోరెస్ వీడియో రికార్డింగ్‌ను టార్గెట్ చేస్తుంది. వీడియో క్రియేటర్లకు ఈ అప్‌గ్రేడ్ చాలా ఉపయోగకరం.

గేమింగ్ పనితీరు ఎలా మెరుగుపడుతుంది?

శామ్‌సంగ్ ఈ చిప్‌సెట్‌తో గేమింగ్ పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్స్‌క్లిప్స్ 960 GPU డబుల్ కంప్యూటింగ్ పవర్ ఇస్తుంది. రే ట్రేసింగ్ పనితీరు 50 శాతం మెరుగవుతుంది. గేమ్‌లు మరింత రియలిస్టిక్‌గా, ఇమ్మర్సివ్‌గా కనిపిస్తాయి. ఎక్సినోస్ న్యూరల్ సూపర్ శాంప్లింగ్ టెక్నాలజీ AI ఆధారిత అప్‌స్కేలింగ్‌తో మెరుగైన విజువల్స్ ఇస్తుంది. స్మూత్ ఫ్రేమ్స్ జనరేట్ చేస్తుంది. గేమర్లకు స్థిరమైన పనితీరు, మెరుగైన గ్రాఫిక్స్ లభిస్తాయి.

గెలాక్సీ S26 సిరీస్ తో ఆపిల్ కు గట్టి పోటీ

గెలాక్సీ S26 సిరీస్ శామ్‌సంగ్ ప్రాసెసర్లకు టర్నింగ్ పాయింట్ కావచ్చు. కొత్త చిప్‌సెట్ పవర్, ఎఫిషియెన్సీ, అడ్వాన్స్ ఫీచర్లపై దృష్టి పెడుతుంది. శామ్‌సంగ్ క్వాల్‌కామ్, ఆపిల్‌తో బలంగా పోటీ పడాలని చూస్తోంది. అధికారిక లాంచ్‌లో ఫైనల్ స్పెసిఫికేషన్లు పూర్తిగా వెల్లడవుతాయి.

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×