E-Paper
Advertisement

గూగుల్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్ గురించి తెలిస్తే.. ప్రపంచంలో అన్ని భాషలూ వచ్చినట్లే!

గూగుల్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్ గురించి తెలిస్తే.. ప్రపంచంలో అన్ని భాషలూ వచ్చినట్లే!
Advertisement

Live Translate: మనం వేరే దేశం వెళ్లినప్పుడో.. లేదా మనకు తెలియని భాషలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడో ఏం చెప్తున్నారో అర్థం కాక ఇబ్బంది పడుతుంటాం కదా! ఇకపై అలాంటి టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గూగుల్ సంస్థ మాటలను రియల్-టైమ్‌లో (వెంటనే) అనువదించే ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. దీని పేరు ‘Gemini 3.5 Live Translate’. ఇప్పటివరకు మన ఫోన్లలోని గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను, ఇకపై యాప్స్ తయారుచేసే డెవలపర్లు కూడా వాడుకునేలా గూగుల్ దీనిని Gemini API రూపంలో విడుదల చేసింది.

Read also-HBD Balayya : బాలనటుడు టు లెజెండ్.. బాలయ్య ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

దీనితో ఏం చేయవచ్చు?

Advertisement

ఈ కొత్త టెక్నాలజీ 70 కి పైగా భాషలను సపోర్ట్ చేస్తుంది. అంటే అవతలి వాళ్లు మాట్లాడే మాటలను క్షణాల్లో మనకు నచ్చిన భాషలోకి మార్చి వినిపిస్తుంది. గూగుల్ చూపించిన డెమోల ప్రకారం దీనితో ఎంతటి అద్భుతాలు చేయవచ్చో తెలుసుకుందాం.

వెంటనే డబ్బింగ్ (Live Dubbing): ఇంటర్నెట్‌లో ఏదైనా వేరే భాషలో (ఉదాహరణకు హిందీ లేదా ఇంగ్లీష్) లైవ్ వీడియో వస్తుంటే.. ఈ టెక్నాలజీ సహాయంతో దానిని వెంటనే మనకు నచ్చిన భాషలోకి డబ్బింగ్ చేసి వినవచ్చు.

Advertisement

మీటింగ్స్‌లో లైవ్ అనువాదం: ఒక పెద్ద మీటింగ్‌లో స్పీకర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారనుకుందాం. అక్కడ కూర్చున్న వేర్వేరు దేశాల ప్రజలు ఒక QR కోడ్‌ని స్కాన్ చేసి.. స్పీకర్ చెప్పే మాటలను ఎవరికి నచ్చిన భాషలో (జపనీస్, జర్మన్, తెలుగు ఇలా..) వాళ్లు లైవ్‌గా ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని వినేయొచ్చు.

సెట్టింగ్స్ మార్చక్కర్లేదు: అవతలి వ్యక్తి ఏ భాష మాట్లాడుతున్నాడో ఈ సిస్టమ్ ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. మనం ప్రత్యేకంగా భాషను సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు.

కంప్యూటర్ వాయిస్‌లా ఉండదు: సాధారణంగా ట్రాన్స్‌లేషన్ వాయిస్ అనగానే ఏదో రోబో మాట్లాడుతున్నట్లు ముక్కలు ముక్కలుగా ఉంటుంది. కానీ, ఈ జెమిని 3.5 మోడల్ ఎక్కడా ఆగకుండా, ఒక మనిషి మాట్లాడినట్లే చాలా సహజంగా అనువదిస్తుంది.

Read also-ఫాస్ట్ ఛార్జింగ్ vs స్లో ఛార్జింగ్.. EV బ్యాటరీకి ఏది బెస్ట్?

ఎక్కడ వాడుకోవచ్చు?

యాప్స్ తయారు చేసే డెవలపర్లు దీనిని తమ సాఫ్ట్‌వేర్‌లలో వాడుకోవడానికి గూగుల్ అనుమతి ఇచ్చింది. మనలాంటి సామాన్య వినియోగదారులు దీనిని ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలోని గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. అంతేకాదు, త్వరలోనే మనం ఆన్‌లైన్ మీటింగ్స్ చెప్పుకునే గూగుల్ మీట్ (Google Meet) లో కూడా ఈ లైవ్ అనువాద ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇక మీదట ప్రపంచంలో ఏ భాష వాళ్లతోనైనా సరే.. భయం లేకుండా ఈజీగా మాట్లాడేయచ్చన్నమాట!

Related News

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌లో కాకుండా.. మెటల్‌‌ లోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

Big Stories

Advertisement
×