E-Paper
Advertisement

HBD Balayya : బాలనటుడు టు లెజెండ్.. బాలయ్య ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

HBD Balayya : బాలనటుడు టు లెజెండ్.. బాలయ్య ఆస్తులు ఎన్ని కోట్లంటే..?
Advertisement

HBD Balayya : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే గాడ్ ఆఫ్ మాసెస్ గా, లెజెండ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. వయసుతో సంబంధం లేకుండా పవర్ ఫుల్ డైలాగ్లు, అలాగే మాస్ యాక్షన్ సీన్లతో అదరగొట్టేస్తుంటాడు బాలయ్య. యాక్షన్ అభిమానులకు ఈయన ప్రియమైన హీరో.. కేవలం హీరోగా మాత్రమే కాదు అటు రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఇకపోతే బసవతారకం హాస్పిటల్ ద్వారా ఆయన చేస్తున్న సేవలకు గాను పద్మభూషణ్ ను అందించారు భారత ప్రభుత్వం. అలాంటి బాలయ్య పుట్టినరోజు నేడు.. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, హిందూపురం నియోజకవర్గం ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. అయితే ఇవాళ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఆస్తులను కూడా పెట్టాడో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

బాలయ్య ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

నందమూరి నట వారసుడు గా బాలకృష్ణ బాలునటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటనకు తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు.. అయితే ఒక్కో సినిమాతో తన నటనతో ప్రజలను ఆకట్టుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పటివరకు నటించిన సినిమాలలో చాలావరకు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడంతో బాలయ్య సినిమాల కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఆయన ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఆస్తులు కూడా పెట్టారు అన్నది ఇప్పుడు తెలుసుకునేందుకు అభిమానులు, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో గూగుల్లో వెతికేస్తున్నారు. సినిమాల నుంచి వచ్చే రెమ్యునరేషన్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, వ్యాపారాల ద్వారా ప్రధానంగా బాలయ్య ఆదాయాన్ని పొందుతున్నారు. బాలయ్య ఒక్కో సినిమాకి 30 నుంచి 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని విలువ 20 కోట్లకు పైనే ఉంటుంది.. అదేవిధంగా మరో ఇంటిని కూడా నిర్మిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దాని విలువ దాదాపు 30 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.. వీటితోపాటుగా ఆయన గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాయి.. బాలయ్య పేరు మీద 81 కోట్లు, ఆయన భార్య పేరు మీద 140 కోట్లు ఉన్నాయట. అంతే కాదు దాదాపు 13 కోట్ల వరకు అప్పు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా బాలయ్య కుటుంబానికి ఉన్న ఆస్తులు 400 కోట్లకు పైనే అని అంచనా వేస్తున్నారు.. అంతకుమించి ఉండొచ్చు కూడా..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనాను కూల్ చేసిన బాలు.. రవి, శృతి ల పెళ్లిరోజు..రోహిణి దొరికిపోయిందా..?

సినిమాల విషయానికొస్తే..

14 ఏళ్ల వయసులో తాతమ్మ కల చిత్రంతో సినీరంగ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత 100కు పైగా సినిమాలలో నటించారు. ఇండస్ట్రీ లోకి ఈయన అడుగు పెట్టి దాదాపు 50 ఏళ్లు పూర్తయింది.. 1984లో సాహసమే జీవితం సినిమాతో సోలో హీరోగా అడుగుపెట్టారు. గతంలో రిలీజ్ అయినా వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది విడుదలైన డాకు మహారాజు మూవీతో పర్వాలేదనే టాక్ ని సొంతం చేసుకుంది.. అలాగే ఈ ఏడాది భారీ అంచనాలు నడుమ అఖండ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఇవాళ బాలయ్య బర్త్ డే సందర్భంగా ఆ మూవీ నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.. వచ్చేఏడాది ఈ సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి..

Related News

జానీ మాస్టర్ అవుట్.. సందీప్ ఇన్!

అక్క మరణంపై మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్!

కాబోయే భర్తను పరిచయం చేసిన ‘గద్దల కొండ గణేష్’ మూవీ హీరోయిన్!

కూతుళ్లు చెప్పినా వినకుండా రూ.26 కోట్లు నష్టపోయిన నిర్మాత?

డ్యాన్సర్ అసోసియేషన్లో మళ్లీ వివాదం.. సుమలత తీరుపై ఫెడరేషన్ మండిపాటు!

పెళ్లి బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగించిన పూజా హెగ్డే.. వరుడు ఎవరంటే?

‘అబద్ధమేవ జయతే’ పాటను విడుదల చేసిన దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ..

బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి చూడాల్సిన టాప్ తెలుగు సినిమాలు

Big Stories

Advertisement
×