E-Paper
Advertisement

ఫాస్ట్ ఛార్జింగ్ vs స్లో ఛార్జింగ్.. EV బ్యాటరీకి ఏది బెస్ట్?

ఫాస్ట్ ఛార్జింగ్ vs స్లో ఛార్జింగ్.. EV బ్యాటరీకి ఏది బెస్ట్?
Advertisement

Fast vs Slow EV Charging: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీ హెల్త్ గురించి కూడా వినియోగదారుల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా ఈవీ యూజర్లలో ఓ ప్రశ్న తరచూ వినిపిస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ మంచిదా? స్లో ఛార్జింగ్ మంచిదా? అనే సందేహం చాలా మందిలో ఉంది.  ఇంతకీ, ఈవీ బ్యాటరీకి ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రెండు రకాలుగా ఈవీ ఛార్జింగ్

EVలను కామన్ గా రెండు రకాలుగా ఛార్జ్ చేస్తారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఉపయోగించే AC ఛార్జింగ్‌ ను స్లో ఛార్జింగ్ అంటారు.  హైవేలు, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో కనిపించే DC ఛార్జర్ల ద్వారా వేగంగా ఛార్జ్ చేయడాన్ని ఫాస్ట్ ఛార్జింగ్ అంటారు.

స్లో ఛార్జింగ్ గురించి..

Advertisement

స్లో ఛార్జింగ్‌ లో విద్యుత్ నెమ్మదిగా బ్యాటరీలోకి చేరుతుంది. దీనివల్ల బ్యాటరీపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వేడి కూడా ఎక్కువగా ఉత్పత్తి కాదు. ఈ విధానం బ్యాటరీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి అనుకూలంగా భావిస్తారు. రాత్రిపూట ఇంట్లో వాహనాన్ని ఛార్జ్ చేయడానికి ఈ విధానం బెస్ట్ ఆప్షన్ గా భావిస్తారు.

 ఫాస్ట్ ఛార్జింగ్ గురించి..

ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది తక్కువ సమయంలో ఎక్కువ రేంజ్ అందిస్తుంది. కొన్నిసార్లు అరగంటలోనే వందల కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడే ఛార్జ్ లభిస్తుంది. దీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, అధిక శక్తితో విద్యుత్ బ్యాటరీలోకి వెళ్లడం వల్ల ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా బ్యాటరీపై కొంత అదనపు ఒత్తిడి పడుతుంది.

ఫాస్ట్ ఛార్జింగ్ తో బ్యాటరీ త్వరగా పాడవుతుందా?

Advertisement

ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ వెంటనే పాడవుతుందని భావించడం సరైంది కాదు. ఆధునిక EVల్లో ఉన్న బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ ఉష్ణోగ్రత, వోల్టేజ్, ఛార్జింగ్ వేగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తాయి. అవసరమైతే ఆటోమేటిక్ గా ఛార్జింగ్ వేగాన్ని తగ్గించి బ్యాటరీని రక్షిస్తాయి. అయితే, ఎక్కువగా AC ఛార్జింగ్ ఉపయోగించే బ్యాటరీలు సంవత్సరానికి సగటున 1.5 శాతం సామర్థ్యాన్ని కోల్పోతాయి. తరచుగా DC ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించే బ్యాటరీల్లో ఈ క్షీణత 2.5 నుంచి 3 శాతం వరకు ఉండొచ్చు. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ వృద్ధాప్యాన్ని కొద్దిగా వేగవంతం చేస్తుంది. కానీ, భారీ నష్టం కలిగించదు. చాలా మంది గమనించే మరో విషయం 80 శాతం తర్వాత ఛార్జింగ్ వేగం తగ్గిపోవడం. బ్యాటరీ పూర్తిగా నిండే సమయంలో అదనపు ఒత్తిడి రాకుండా వాహనం ఆటోమేటిక్ గా ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తుంది. అందుకే, చాలా కంపెనీలు రోజువారీ వినియోగానికి 80 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేయాలని సూచిస్తాయి.

బ్యాటరీ లైఫ్ ఎలా పెంచుకోవాలంటే?

బ్యాటరీ జీవితకాలాన్ని పెంచాలంటే కొన్ని సులభమైన అలవాట్లు పాటించాలి. రోజువారీ అవసరాలకు AC ఛార్జింగ్‌ను ఉపయోగించడం, ప్రతిరోజూ 100 శాతం వరకు ఛార్జ్ చేయకపోవడం, వరుసగా ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టకపోవడం, ఎక్కువ వేడి ఉన్న సమయంలో ఛార్జ్ చేయకపోవడం వల్ల బ్యాటరీ లైఫ్ హెల్తీగా ఉంటుంది.

Read Also: బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? EV కొనుగోలుదారులకు లాభమా? నష్టమా?

Related News

కొత్త ఫీచర్లు.. కొత్త డిజైన్.. ఆగస్టులో వస్తున్న 3 సూపర్ మోడళ్లు ఇవే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ డబుల్ గేమ్.. ఒకవైపు ఈవీలు.. మరోవైపు పెట్రోల్ బైక్‌లు!

నిస్సాన్ టెక్టన్, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు స్టార్ట్.. కస్టమర్లకు తాళాలు అందజేత!

ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌ లో సంచలనం.. అవోర్ నుంచి ఒకేసారి ఏకంగా 3 కొత్త మోడళ్లు లాంచ్!

ఫోన్ టచ్ చేయాల్సిన పనిలేదు.. ఈ హెల్మెట్ అన్నీ చూసుకుంటుంది!

టాటా నుంచి రెండు సూపర్ ఈవీలు.. సఫారీ, అవిన్యా రిలీజ్ ఎప్పుడంటే?

2026 బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల.. ఏ వేరియంట్ కాస్ట్ ఎంతంటే?

మహీంద్రా మాస్టర్ ప్లాన్.. ఒకేసారి 5 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×