E-Paper
Advertisement

Pixel 10 Pro Discount: పిక్సెల్ 10 ప్రో‌పై రూ.10000 డిస్కౌంట్.. గూగుల్ స్పెషల్ ఆఫర్ ఎక్కడంటే

Pixel 10 Pro Discount: పిక్సెల్ 10 ప్రో‌పై రూ.10000 డిస్కౌంట్.. గూగుల్ స్పెషల్ ఆఫర్ ఎక్కడంటే
Advertisement

Pixel 10 Pro Discount| గూగుల్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 10 ప్రో (Pixel 10 Pro) ఇప్పుడు అమెజాన్‌లో లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ డీల్ కొంతకాలం మాత్రమే త్వరలో ముగిసే అవకాశం ఉంది. ఫోన్ కొనాలనుకుని ధర ఎక్కువగా ఉందని వేచి చూసినవారికి ఇది గొప్ప అవకాశం.

లాంచ్ ధర, ఆఫర్ వివరాలు

భారతదేశంలో పిక్సెల్ 10 హైయర్ వేరియంట్ మోడల్ Pixel 10 Pro ఆగస్టు 2025లోలాంచ్ అయింది. ఆ సమయంలో దీని ధర రూ.1,09,999. ఇప్పుడు అమెజాన్‌లో డైరెక్ట్ రూ.7,000 డిస్కౌంట్ ఆఫర్‌తో లిస్ట్ అయింది. అంటే డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ ధర రూ.1,02,999. అంతేకాకుండా అదనపు సేవింగ్స్ కోసం బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.

IndusInd బ్యాంక్ కార్డ్‌తో అదనపు డిస్కౌంట్

Advertisement

IndusInd బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో EMIలో కొనుగోలు చేస్తే మరో రూ.3,250 తగ్గుతుంది. దీంతో ఫైనల్ ధర దాదాపు రూ.99,749 అవుతుంది. ఒక రూ.లక్ష బడ్జెట్‌లోపు ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది చాలా మంచి డీల్.

ట్రేడ్-ఇన్ ఆప్షన్‌తో మరిన్ని సేవింగ్స్

పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే మరిన్ని తగ్గుతుంది. పాత ఫోన్ మోడల్, కండిషన్ బట్టి ఎక్స్‌చేంజ్ వాల్యూ మారుతుంది. కొత్త ఫోన్లు ఎక్స్‌చేంజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్

Advertisement

Pixel 10 Proలో 6.3 అంగుళాల LTPO OLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, యానిమేషన్లు స్మూత్‌గా ఉంటాయి. గరిష్ట బ్రైట్‌నెస్ 3,300 నిట్స్ వరకు ఉంది. బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తో ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది.

ప్రాసెసర్, పర్‌ఫామెన్స్

ఈ ఫోన్‌లో Google Tensor G5 చిప్‌సెట్ ఉంది. AI, మెషిన్ లెర్నింగ్ టాస్క్‌లలో బాగా పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ, వాయిస్ రికగ్నిషన్, స్మార్ట్ ఫీచర్లు మెరుగుపడతాయి. 16GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

బ్యాటరీ, ఛార్జింగ్

ఫోన్‌లో 4,870mAh బ్యాటరీ ఉంది. రోజంతా హెవీ యూజర్లకు కూడా సరిపోతుంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

కెమెరా సెటప్

పిక్సెల్ ఫోన్లలో కెమెరా క్వాలిటీ బెస్ట్. ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. 50MP వైడ్, 48MP అల్ట్రావైడ్ (మాక్రో ఫోకస్‌తో), 48MP టెలిఫోటో (5x ఆప్టికల్ జూమ్) లెన్స్ కెమెరాలు. ముందు 48MP సెల్ఫీ కెమెరా ఉంది. గూగుల్ AI కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీతో అద్భుతమైన ఫోటోలు వస్తాయి.

Also Read: ఇండక్షన్ స్టవ్ కొనేముందు ఇవి చెక్ చేసుకోండి.. లేకపోతే కరెంట్ బిల్లు వాచిపోద్ది

కలర్ ఆప్షన్లు

Moonstone, Jade, Porcelain, Obsidian కలర్ వేరియంట్స్‌లలో వస్తోంది. ప్రీమియం, ఆధునిక లుక్ ఇస్తాయి.

పిక్సెల్ 10 ప్రోలో పవర్‌ఫుల్ హార్డ్‌వేర్, అద్భుతమైన కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న డిస్కౌంట్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకునేవారు ఈ ఆఫర్‌ మిస్ చేయకండి. లిమిటెడ్ టైమ్ ఆఫర్ కాబట్టి త్వరగా చెక్ చేయండి.

ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలిపిన గూగుల్ పిక్సెల్ ఫోన్ ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. ఆఫర్‌లో కొనుగోలు చేసే సమయంలో సరిగా చెక్ చేసి కొనాలని సూచన. మీరు కొనుగోలు చేసే సమయానికి పైన పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. అందుకు ధర కచ్చితత్వం విషయంలో ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.

 

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×