E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి మారువేషంలో వెళ్లిన రణవీర్‌  

Nindu Noorella Saavasam Serial Today march 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి మారువేషంలో వెళ్లిన రణవీర్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అందరూ ఇంట్లో హోళీ సంబరాల్లో ఉండగా బయట కారులో ఉన్న రణవీర్‌, మనోహరికి వీడియో కాల్‌ చేస్తాడు. మనోహరి ఫోన్‌ చూసి షాక్ అవుతుంది. పక్కనే ఉన్న యాదమ్మ ఎవరు మనోహరి అని అడగ్గానే.. రణవీర్ అంటూ చెప్పి లోపలికి వెళ్తుంది మనోహరి. లోపలికి వెళ్లిన మనోహరి కాల్‌ లిఫ్ట్ చేస్తుంది. రణవీర్‌ హాయ్‌ మనోహరి నేను చెప్పిన ప్లాన్‌ మరిచిపోయి హోళీలో మునిగి తేలుతున్నావా..?  అని అడగ్గానే.. మనోహరి కోపంగా నా ముఖంలో ఎక్కడైనా రంగులు కనిపిస్తున్నాయా..? నడుము నొప్పితో నేను బాధపడుతుంటే.. హోళీలో మునిగి తేలుతున్నానంటా..? అనగానే.. రణవీర్‌ ఏమైంది అని అడుగుతాడు.

దీంతో మనోహరి ఏదో అయిందిలే.. నువ్వు ఎక్కడున్నావు అని అడగ్గానే.. రణవీర్‌ మీ ఇంటి బయటే ఉన్నాను.. కాసేపట్లో లోపలికి వస్తాను అని చెప్పగానే.. మనోహరి కంగారుగా అటూ ఇటూ చూస్తూ.. లోపలికి ఎలా వస్తావు అంటూ అడుగుతుంది. దీంతో రణవీర్‌ ముఖానికి రంగులు పూసుకుని ఇలా వస్తాను అని చెప్పగానే.. మనోహరి కంగారుగా అంటే రంగులు పూసుకుని ఒక్కడివే లోపలికి వస్తావా..? అమర్‌కు అనుమానం వస్తుంది అని చెప్పగానే.. రణవీర్‌ నేను ఒక్కడినే రావడం లేదు.. అని చెప్పగానే.. మనోహరి అటూ ఇటూ చూసి ఏంటి లాయర్‌ ను తీసుకొస్తావా..? తనను కూడా అమర్‌ గుర్తు పడతాడు కదా అని అడగ్గానే.. రణవీర్  లాయరు కాదు వేరే సెటప్‌ చేశాను. అని చెప్పగానే.. మనోహరి ఆతృతగా ఏంటి సెటప్పా..? ఏం సెటప్పు.. అని అడుగుతుంది.

Advertisement

దీంతో రణవీర్‌ తనకు ఎదురుగా ఉన్న కారు చూపిస్తూ.. ఆ క్వాలిస్‌లో నా ఆర్మీ ఉంది అని చెప్పగానే.. మనోహరి ఆశ్చర్యంగా ఆర్మీనా..? అని అడగ్గానే.. కారులోంచి బ్యాండ్‌ మేళం బ్యాచ్‌ దిగుతుంది. మనోహరి వాళ్లను ఎందుకు తీసుకొచ్చావు రణవీర్‌ అని అడగ్గానే.. రణవీర్‌ వాళ్లతో కలిసిపోయి లోపలికి వస్తాను. హోళీ ఆడుతూ అంజు పాపను ఎత్తుకెళ్తాను.. అని చెప్పగానే.. మనోహరి ఐడియా బాగుంది. కానీ జాగ్రత్త అమర్ కు డౌటు వచ్చిందంటే నీతో సహా నీ ఆర్మీని ఈ ఆర్మీ ఆఫీసర్‌ తుక్కు రేగొట్టేస్తాడు. నీ రక్తంతో హోళీ ఆడుకుంటాడు అంటూ హెచ్చరించగానే.. ఈ హోళీ నాది మనోహరి.. ఆట ఆడబోయేది నేను.. ఆ ఆటకు రెడీగా ఉండు.. అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు.. పక్కనే ఉన్న లాయరు.. ఆల్‌ది బెస్ట్‌ క్షేమంగా వెళ్లి పాపతో రండి అని చెప్పగానే.. రణవీర్‌ కారు దిగి బ్యాండ్ మేళం వాళ్ల దగ్గరకు వెళ్లి క్వాలిస్‌ ఎక్కి గెటప్‌ మార్చుకుంటాడు. మరోవైపు లోపలి నుంచి బయటకు వెళ్లిన మనోహరి యాదమ్మతో మెల్లగా రణవీర్‌ వస్తున్నాడు అని చెప్తుంది. భయంతో యాదమ్మ ఎలా వస్తున్నాడు అని అడుగుతుంది. వస్తున్నాడు చూడు అని చెప్తుంది మనోహరి.

బయట బ్యాండ్‌ మేళం గెటప్ వేసుకున్న రణవీర్‌ కారు దిగి అమర్‌ ఇంట్లోకి అడుగుపెడతాడు..    లోపలికి వచ్చిన రణవీర్‌ను చూసిన యాదమ్మ షాక్‌ అవుతుంది. బ్యాండ్‌ మేళం సౌండ్‌తో లోపలికి వస్తున్న రణవీర్ వాళ్లను రాథోడ్‌ వెళ్లి ఏయ్‌ ఆపంయ్యా ఆపండి ఎవరు మీరు.? అని అడగ్గానే.. రణవీర్‌ హోళీ లైవ్‌ మ్యూజిక్‌ సార్‌.. కాసేపను డప్పులు వాయిస్తాం.. మీకు తోచింది ఇవ్వండి సార్‌ అని చెప్పగానే.. రాథోడ్‌ కోపంగా ఓ డబ్బులు లాగడానికి ఇదొక కొత్త పద్దతా..? ఆల్‌ రెడీ మా దగ్గర మ్యూజిక్‌ సిస్టం ఉంది మీ లైవ్‌ మ్యూజిక్‌ మాకేం అక్కరలేదు మీరు వెళ్లండి.. అని చెప్తుండగానే.. అమర్‌ గమనించి రాథోడ్‌ వాళ్లను రానివ్వు కాసేపను వాయించి వెళ్తారు పిల్లుల కూడా ఎంజాయ్‌ చేస్తారు.. అని చెప్పగానే.. రాథోడ్‌ ఓకే సార్‌ కానివ్వండి అని చెప్పగానే.. రణవీర్‌ ఓకే సార్‌ అంటూ డప్పు వాయిస్తుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×