E-Paper
Advertisement

Google Pixel 9 Pro: భారీ డిస్కౌంట్స్ లైవ్.. పిక్సెల్ 9 ప్రో ధర దుమ్మురేపుతోంది, ఇదే సరైన సమయం!

Google Pixel 9 Pro: భారీ డిస్కౌంట్స్ లైవ్.. పిక్సెల్ 9 ప్రో ధర దుమ్మురేపుతోంది, ఇదే సరైన సమయం!
Advertisement

Google Pixel 9 Pro: గ్లోబల్ టెక్ కంపెనీ గూగుల్ ఇటీవలే పిక్సెల్ 10 సిరీస్‌ని విడుదల చేసింది. అందువల్ల, తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన పిక్సెల్ 9 ప్రో ధరను భారీగా తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రీమియమ్ ఫోన్‌ను అమెజాన్‌లో రూ20వేల కంటే.. ఎక్కువ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. కస్టమ్ టెన్సర్ చిప్, హై క్వాలిటీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్ ఎంతో ప్రీమియంగా కనిపిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌‌ను కొనాలనుకుంటుంటే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్లు, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేద్దాం రండి..

ధర & అమెజాన్ ఆఫర్లు:

గూగుల్ పిక్సెల్ 9 ప్రో 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ అసలు ధర రూ1,09,999. దీనిపై ప్రస్తుతం అమెజాన్ 19% డిస్కౌంట్‌ను అందిస్తోంది. తగ్గింపుతో ఫోన్ ప్రభావవంతమైన ధర రూ88,990 అవుతుంది. అంతేకాదు.. దీనిపై ఇంకా అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకపోతే కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లింపు చేస్తే అదనంగా రూ1,500 బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ47,650 వరకూ పొందే అవకాశం ఉంది. అయితే, ఎక్స్‌ఛేంజ్ విలువ ఫోన్ బ్రాండ్, కండీషన్, కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ వద్ద బడ్జెట్ ఒకేసారి అందుబాటులో లేకపోతే.. నెలకు రూ4,314 చొప్పున EMI ఆప్షన్ కూడా ఉంది.

Advertisement

Also Read: భారత్ మార్కెట్‌లో అడుగుపెట్టనున్న రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. 200MP కెమెరా హైలైట్!

డిస్‌ప్లే & పనితీరు:

గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.3-అంగుళాల సూపర్ ఆక్టువా డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. మెరుగైన పనితీరు కోసం ఇందులో టెన్సర్ G4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇక డిస్‌ప్లే సేఫ్టీ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంది. ఈ ఫోన్ 16GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

కెమెరా, బ్యాటరీ విషయానికొస్తే:

Advertisement

ఫొటోలు, వీడియోల కోసం పిక్సెల్ 9 ప్రో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని మెయిన్ కెమెరా 50MP, సెల్ఫీల కోసం 42MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ విషయంలో.. ఈ ఫోన్‌లో 4700mAh సామర్థ్యం గల బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. అదనంగా Wi-Fi, బ్లూటూత్, GPS వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: శక్తివంతమైన బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ కెమెరా.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V60eపై దిమ్మతిరిగే డిస్కౌంట్!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×