E-Paper
Advertisement

Android – iPhone: ఆపిల్ ఫోన్ల కంటే ఆండ్రాయిడ్ ఫోన్లు బెస్టా? అసలు విషయం చెప్పిన గూగుల్!

Android – iPhone: ఆపిల్ ఫోన్ల కంటే ఆండ్రాయిడ్ ఫోన్లు బెస్టా? అసలు విషయం చెప్పిన గూగుల్!
Advertisement

చాలా మంది వినియోగదారులు ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చితే ఆపిల్ ఫోన్లు బెస్ట్ అని భావిస్తారు. ముఖ్యంగా భద్రత విషయంలో ఆపిల్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లను తలదన్నేలా ఉంటాయి అనుకుంటారు. కానీ, ఆ వాదనలో నిజం లేదని వెల్లడించింది టెక్ దిగ్గజం గూగుల్. వినియోగదారులను స్కామ్‌ల నుంచి రక్షించే విషయంలో ఐఫోన్ల కంటే ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా మెరుగ్గా పని చేస్తున్నాయని వెల్లడించింది. స్కామ్స్ నుంచి కాపాడటంతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది.

ప్రతినెలా 10 బిలియన్లకు పైగా అనుమానిత కాల్స్, మెసేజెస్ బ్లాక్!

సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ తాజా నివేదికలో ఆండ్రాయిడ్‌ లోని AI ఆధారిత సేఫ్టీ ఫీచర్లు ప్రతి నెలా బిలియన్ల కొద్దీ స్కామ్ కాల్స్, మెసేజ్ లకు అడ్డుకట్ట వేయడంలో సాయపడుతున్నాయని గూగుల్ వెల్లడించింది. గత 12 నెలల్లో స్కామ్‌లు ప్రపంచ వ్యాప్తంగా 400 బిలియన్ డాలర్లకు పైగా నష్టాలకు దారితీశాయి తెలిపింది. సైబర్ మోసగాళ్లు ఇప్పుడు నకిలీ మెసేజ్ లు, కాల్స్ ను మరింత నమ్మేలా కనిపించేందుకు AIని ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే, ఇలాంటి హానికర కాల్స్, మెసేజ్ లు వినియోగదారులకు చేరకుండానే అడ్డుకునేందుకు పలు ఏఐ టూల్స్ రూపొందించినట్లు తెలిపింది. ప్రతి నెలా  ఆండ్రాయిడ్ 10 బిలియన్లకు పైగా అనుమానిత స్కామ్ కాల్స్, మెసేజ్ లను బ్లాక్ చేస్తుందని వెల్లడించింది. RCS (రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్)లో భద్రతా తనిఖీలను కూడా నిర్వహిస్తుందని తెలిపింది. గత నెలలో దాదాపు 100 మిలియన్ల అనుమానాస్పద నంబర్లను బ్లాక్ చేసినట్లు ప్రకటించింది.

ఐఫోన్లతో పోల్చితే ఆండ్రాయిడ్ ఫోన్లు మరింత సేఫ్!

Advertisement

ఇక గూగుల్ నిర్వహించిన YouGov సర్వేలో భారత్, అమెరికా, బ్రెజిల్ సహా పలు దేశాల్లోని ఆండ్రాయిడ్ వినియోగదారులు తక్కువ స్కామ్ మెసేజ్ లను అందుకున్నారని, వారి ఫోన్ భద్రత గురించి ఎక్కువ నమ్మకంగా ఉన్నారని తేలింది. ముఖ్యంగా పిక్సెల్ వినియోగదారులు అతి తక్కువ సంఖ్యలో స్కామ్ మెసేజ్ లు వచ్చినట్లు వెల్లడించింది. వాస్తవానికి, ఐఫోన్ వినియోగదారులు ఒకే వారంలో పిక్సెల్ యూజర్ల కంటే 136% ఎక్కువగా స్కామ్ మెసేజ్ లు అందుకున్నట్లు తేలింది. ఇండిపెండెంట్ రీసెర్చర్స్ కూడా ఈ సర్వే ఫలితాలను సమర్థిస్తున్నారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అధ్యయనంలో ఆండ్రాయిడ్ డివైజ్ లు ముఖ్యంగా గూగుల్, శామ్‌ సంగ్, మోటరోలాకు చెందిన ఫోన్లు ఇమెయిల్ ఫిల్టరింగ్, బ్రౌజింగ్ సెక్యూరిటీ, రియల్ టైమ్ స్కామ్ డిటెక్షన్ లాంటి 10 కీలక అంశాల్లో ఐఫోన్ల కంటే ఎక్కువ AI- ఆధారిత సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నట్లు తేలింది. లెవియాథన్ సెక్యూరిటీ గ్రూప్ చేసిన మరో అధ్యయనంలో పిక్సెల్ 10 ప్రో ఆండ్రాయిడ్ ఫోన్లు స్కామ్ లను అత్యంత పకడ్బందీగా ఎదుర్కొనే డివైజ్ లుగా తేలింది. కాల్ స్క్రీనింగ్, స్కామ్ డిటెక్షన్, రియల్ టైమ్ స్కామ్ డిటెక్షన్ ను పక్కాగా అమలు చేస్తున్నట్లు గుర్తించింది. సో, ఇంతకాలం ఆపిల్ సేఫ్టీ పరంగా బెస్ట్ అనుకునే వారికి ఇదో షాకింగ్ విషయం అని చెప్పుకోకతప్పదు.

Read Also:  ఇవాళే Vivo X300 సిరీస్ లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కిర్రాక్ అంతే!

Related News

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

Big Stories

Advertisement
×