చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం Vivo మరో క్రేజీ సిరీస్ ను ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాబోతోంది. X300, X300 Pro మోడళ్లతో కూడిన Vivo X300 సిరీస్ ను ప్రపంచ మార్కెట్లలోకి అధికారికంగా విడుదల చేయబోతోంది. Vivo X200 సిరీస్ కు కొనసాగింపుగా ఈ సిరీస్ విడుదల కానుంది. ఈ హ్యాండ్ సెట్లు గత వారమే చైనాలో అందుబాటులోకి వచ్చాయి. లాంచ్‌కు ముందు ఈ బ్రాండ్ కు సంబంధించిన కీలక విషయాలను Vivo వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న Vivo X300, Vivo X300 Proకు సంబంధించి ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చైనాలో Vivo X300 ధర 12GB + 256GB ఆప్షన్ ధర CNY 4,399గా నిర్ణయించింది. భారత కరెన్సీలో ఈ ధర సుమారు రూ. 54,700. 16GB + 256GB వేరియంట్ ధర రూ. 58,400. అటు 12GB + 512GB ధర రూ. 62.100, 16GB + 512GB ధర రూ. 65,900, 16GB + 1TB ధర రూ. 72,900గా ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ ప్రపంచ మార్కెట్లలో ఇదే ధరకు అమ్మే అవకాశం ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు. ఇండియాలో కూడా ఇదే ధరకు అందుబాటులో ఉండనుంది. Vivo X300 హాలో పింక్, ఐరిస్ పర్పుల్, మిస్ట్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్ రంగులలో వస్తుంది.
అటు చైనాలో Vivo X300 Pro ధర 12GB + 256GB వేరియంట్ కోసం రూ. 65,900 నుంచి ప్రారంభం అవుతుంది. 16GB + 512GB ధర సుమారు రూ. 74,600గా ఉంది. 16GB + 1TB కాన్ఫిగరేషన్ హ్యాండ్ సెట్ ధర సుమారు రూ. 83,300గా ఉంది. 16GB + 1TB శాటిలైట్ కమ్యూనికేషన్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ. 1,03,200గా ఉంది. ఈ హ్యాండ్ సెట్ నాలుగు రంగులలో వస్తుంది. క్లౌడ్ వైట్, మిస్ట్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, డ్యూన్ బ్రౌన్.
Vivo X300, Vivo X300 Pro స్పెసిఫికేషన్లు చైనాలో అందుబాటులోకి వచ్చిన మోడల్స్ లాగే అదిరిపోయే స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు. X300 మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.31-అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఫ్లాట్ BOE Q10+ LTPO OLED స్క్రీన్ తో వస్తుంది. ఇది 7.95mm మందం, 190g బరువుతో వస్తుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ MediaTek Dimensity 9500 చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 ఆన్ బోర్డ్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6తో రన్ అవుతుంది. Vivo X300 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200 మెగాపిక్సెల్ సామ్ సంగ్ HPB ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో కూడిన 50 మెగాపిక్సెల్ సామ్ సంగ్ JN1 సెన్సార్, 50 మెగాపిక్సెల్ LYT-602 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. Vivo X300లో Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB 3.2 Gen 1 టైప్-C ఉన్నాయి. హ్యాండ్‌సెట్ 90W వైర్డు, 40W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,040mAh బ్యాటరీని కలిగి ఉంది.
Vivo X300 Pro 6.78-అంగుళాల ఫ్లాట్ BOE Q10+ LTPO OLED డిస్ ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. Vivo X300 మోడల్ మాదిరిగానే RAM, స్టోరేజ్, చిప్ సెట్, OS వెర్షన్ ను కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే, Vivo X300 Pro చైనీస్ వేరియంట్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 50 మెగాపిక్సెల్ సోనీ LYT 828 మెయిన్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ సామ్ సంగ్ JN1 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఈ హ్యాండ్ సెట్ X300 మాదిరిగానే ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. Vivo X300 Proలో కనెక్టివిటీ ఆప్షన్స్ ఒకేలా ఉంటాయి. ఇది 6,510mAh బ్యాటరీని అదే 90W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.
Read Also: 200MP హాసెల్ బ్లాడ్ టెలిఫోటో కెమెరా, లేటెస్ట్ AI ఫీచర్లు, మతిపోగొట్టే Find X9 సిరీస్ వచ్చేసింది!