E-Paper
Advertisement

iPhone Scams: ఆండ్రాయిడ్ ఫోన్స్ కంటే ఐఫోన్లలో మోసాలు ఎక్కువ.. యాపిల్‌పై ఎటాక్ చేసిన గూగుల్

iPhone Scams: ఆండ్రాయిడ్ ఫోన్స్ కంటే ఐఫోన్లలో మోసాలు ఎక్కువ.. యాపిల్‌పై ఎటాక్ చేసిన గూగుల్

Google Claims iPhone Scams| స్మార్ట్‌ఫోన్లలో రెండు రకాలు.. ఒకటి ఆండ్రాయిడ్ అయితే మరొకటి ఐఓఎస్. టెక్ అగ్రదిగ్గజం యాపిల్ ఒక్కటే ఐఓఎస్ సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్‌టాప్స్ తయారు చేస్తుంది. మిగతా అన్ని కంపెనీలు ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఫోన్లు తయారు చేస్తున్నాయి. అయితే ప్రపంచమంతా సెక్యూరిటీ విషయంలో ఐఫోన్ సేఫ్ అని ఒక నమ్మకం ఉంది.

ఈ ఆలోచన తప్పు అని గూగుల్ తాజాగా ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఫోన్స్, డివైజ్‌లలో డేటా సురక్షితం కాదని.. హ్యాకర్లు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో సులభంగా స్కామ్ చేయగలరని వాదన తప్పు అని గూగుల్ చెబుతోంది. ఐఫోన్‌ల కంటే ఆండ్రాయిడ్ ఫోన్‌ల యూజర్లను బెటర్‌గా రక్షిస్తాయని చెబుతోంది. దీనికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అని చెప్పింది. సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ నెలలో కొత్త రిపోర్ట్‌ని విడుదల చేసింది. AI సెక్యూరిటీ ఫీచర్లు ప్రతి నెలా బిలియన్ల హ్యాకింగ్ ప్రయత్నాలను బ్లాక్ చేస్తున్నాయి.

సైబర్ మోసగాళ్లకు చెక్ పెడుతున్న ఏఐ

ప్రపంచవ్యాప్తంగా సైబర్ దొంగలు భారీ ఆర్థిక నష్టాలకు కలిగిస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే 400 బిలియన్‌ డాలర్లకు పైగా దోపిడీలు చేశారు. ఇప్పుడు హ్యాకర్లు కూడా AIని ఉపయోగించి మరింత నమ్మకంగా మోసం చేస్తున్నారు. ఫేక్ మెసేజ్‌లు, కాల్స్ తో ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. ఈ ఘటనల గురించి తెలిసిన వెంటనే గూగుల్ సైబర్ మోసాలను ఆపే టూల్స్ బిల్డ్ చేస్తోంది.

ప్రతినెలా బిలియన్ల హ్యాకర్లు బ్లాక్

ఆండ్రాయిడ్ సిస్టమ్ అద్భుతంగా పని చేస్తుందని గూగుల్ తెలిపింది. “నెలకు 10 బిలియన్‌కు పైగా స్కామ్ కాల్స్ బ్లాక్ చేస్తుంది. బిలియన్ల స్కామ్ మెసేజ్‌లను ఆపుతుంది. గూగుల్ RCSలోనూ సేఫ్టీ చెక్ ఉంది. గత నెలలోనే 100 మిలియన్ సస్పీషియస్ నంబర్లు బ్లాక్ అయ్యాయి.” అని గూగుల్ తన రిపోర్ట్ లో తెలిపింది.

ఐఓఎస్ కంటే ఆండ్రాయిడ్ బెటర్ తేల్చిన సర్వే

గూగుల్ YouGov అనే సంస్థతో సర్వే చేయించింది. ఈ సర్వేలో భారత్, అమెరికా, బ్రెజిల్ యూజర్లు పాల్గొన్నారు. ఫలితాలు ఆండ్రాయిడ్‌ను బలంగా సపోర్ట్ చేశాయి. ఈ సర్వేలో ఆండ్రాయిడ్ యూజర్లకు తక్కువ స్కామ్ మెసేజ్ లు పొందరని తేలింది. అలాంగే సర్వేలో పాల్గొన్న యూజర్లు ఫోన్ సెక్యూరిటీపై మరింత నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా పిక్సెల్ యూజర్లకు అతి తక్కువ స్కామ్ టెక్స్ట్‌లు వచ్చాయి.

ఐఫోన్ యూజర్లకు ఎక్కువ స్కామ్ టెక్స్ట్‌లు

సర్వేలో ఐఫోన్, పిక్సెల్ యూజర్లను డైరెక్ట్ గా కంపేర్ చేశారు. ఐఫోన్ యూజర్లు 136% ఎక్కువ స్కామ్ మెసేజ్‌లు పొందారు. ఇది అంతర్జాతీయ యూజర్ గ్రూప్ నుంచి వచ్చిన డేటా.

గూగుల్ ఫైండింగ్స్‌ను ధృవీకరించిన రీసెర్చర్లు

ఇండిపెండెంట్ రీసెర్చ్ గ్రూప్స్ గూగుల్ క్లెయిమ్స్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ కూడా .. ఫోన్ సెక్యూరిటీ ఫీచర్లు స్టడీ చేసింది. ఆండ్రాయిడ్ డివైస్‌లలో ఎక్కువ AI ప్రొటెక్షన్స్ ఉన్నాయనేది వారి అభిప్రాయం. గూగుల్, శాంసంగ్, మోటోరోలా ఫోన్లు సెక్యూరిటీ ఏరియాల్లో ఐఫోన్‌ను 10 అంశాల్లో అధిగమించాయి.

ఆండ్రాయిడ్ పై చేయి సాధించిన కీ సెక్యూరిటీ ఏరియాలు

సేఫ్ ఈమెయిల్ ఫిల్టరింగ్, సురక్షిత బ్రౌజింగ్ ఉన్నాయి. రియల్-టైమ్ స్కామ్ డిటెక్షన్ కూడా బెటర్ గా ఉంది. లెవియాథన్ సెక్యూరిటీ గ్రూప్ కూడా ఫోన్ సెక్యూరిటీ అనాలిసిస్ చేసింది. స్కామ్‌లకు వ్యతిరేకంగా ఆండ్రాయిడ్ ఫోన్లు టాప్ అని రేట్ చేసింది.

అత్యంత సురక్షిత ఫోన్

గూగుల్ పిక్సెల్ 10 ప్రోను లెవియాథన్ రీసెర్చ్ సంస్థ టాప్ డివైస్‌గా పేర్కొంది. ఆటోమేటిక్ కాల్ స్క్రీనింగ్, లైవ్ స్కామ్ డిటెక్షన్ ఫీచర్లు ఇందుకు కారణం. రియల్-టైమ్ ఫ్రాడ్ అలర్ట్స్ యూజర్లకు పంపుతుంది.

బ్యాక్ గ్రౌండ్‌లో నిశ్శబ్దంగా పని చేస్తున్న ఏఐ

గూగుల్ వాదన.. AI సేఫ్‌గార్డ్స్ ఫీచర్లు నిశ్శబ్దంగా పని చేస్తాయి. ఫేక్ కాల్స్ రింగ్ అవకముందే బ్లాక్ చేస్తాయి. స్కామ్ మెసేజ్‌లను మెసేజ్‌ల నుంచి ఫిల్టర్ చేస్తాయి. రిస్కీ యాప్ డౌన్‌లోడ్‌ల గురించి వార్నింగ్ ఇస్తాయి. ఎవరైనా మోసం చేయాలనుకుంటే అలర్ట్ చేస్తుంది.

Also Read: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×