E-Paper
Advertisement

హార్డ్ vs సాఫ్ట్.. ఖరీదైన స్మార్ట్ ఫోన్‌కు.. ఏ కవర్ శ్రీరామరక్ష?

హార్డ్ vs సాఫ్ట్.. ఖరీదైన స్మార్ట్ ఫోన్‌కు.. ఏ కవర్ శ్రీరామరక్ష?
Advertisement

Mobile Cover: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ప్రతీ ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది. నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునేవరకూ ప్రతీ పని.. స్మార్ట్ ఫోన్ తో ముడిపడి ఉండటంతో వేలాది రూపాయలు ఖర్చు చేసి చాలా మంది ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అంత పెట్టి కొన్న ఫోన్ కిందపడినా సేఫ్ గా ఉండాలంటే వాటికి మెుబైల్ పౌచ్ లేదా బ్యాక్ కవర్ తప్పనిసరి. అయితే ఇక్కడే చాలా మంది మెుబైల్ యూజర్లను ఓ ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. మార్కెట్లో ప్రధానంగా లభించే హార్డ్ (గట్టి), సాఫ్ట్ (మెత్తని) కవర్లలో మెుబైల్ కి ఏది బెస్ట్ అని తెగ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ గందరగోళానికి ఈ కథనంతో చెక్ పెట్టే ప్రయత్నం చేద్దాం.

సాఫ్ట్ కవర్ మంచిదేనా?

సిలికాన్ లేదా టీపీయూ మెటీరియల్‌తో తయారయ్యే సాఫ్ట్ కవర్లు చేతికి మంచి గ్రిప్‌ను ఇస్తాయి. ఫోన్ చేతిలో నుంచి జారిపోకుండా ఇవి కాపాడతాయి. పొరపాటున ఫోన్ కింద పడినా ఇందులోని సాఫ్ట్ మెటీరియల్ ఆ ఒత్తిడిని (Shock) తట్టుకుంటుంది. దీనివల్ల ఫోన్ లోపలి భాగాలకు ఎలాంటి డ్యామేజ్ జరగదు. రోజువారీ వినియోగానికి.. చిన్న చిన్న ప్రమాదాల నుండి రక్షణకు ఇవి చక్కగా సరిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.

హార్డ్ కవర్ సంగతేంటి?

Advertisement

పాలి కార్బోనేట్ లేదా గట్టి ప్లాస్టిక్‌తో వీటిని తయారు చేస్తారు. ఇవి ఫోన్‌కు స్టైలిష్, ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. ఫోన్ ప్యాంట్ జేబులో, బ్యాగ్‌లో ఉన్నప్పుడు తాళాలు, ఇతర వస్తువుల వల్ల స్క్రాచెస్ పడకుండా ఇవి నూటికి నూరు శాతం ప్రొటెక్షన్ ఇస్తాయి. అయితే సాఫ్ట్ కవర్లతో పోలిస్తే.. ఇవి జారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఎత్తు నుండి కింద పడితే ఒత్తిడిని తట్టుకోలేక ఈ కవర్లు పగిలిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: స్మార్ట్ టీవీ స్క్రీన్‌ను ఎలా పడితే అలా తుడుస్తున్నారా? అయ్య బాబోయ్ ఇక కొంపమునిగినట్టే!

మరి రెండింటిలో ఏది బెస్ట్?

Advertisement

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫోన్ తరచూ కింద పడుతుంటే ‘సాఫ్ట్ కవర్’ బెస్ట్ ఛాయిస్. ఎందుకంటే సాఫ్ట్ కవర్లు కింద పడినప్పుడు వచ్చే ప్రెజర్ ను ఫోన్ స్క్రీన్ వరకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఒకవేళ మీకు ఫోన్ స్లిమ్‌గా, స్క్రాచెస్ పడకుండా అందంగా కనిపించాలనుకుంటే ‘హార్డ్ కవర్’ ఎంచుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హైబ్రిడ్ మోడల్స్ కొనుగోలు చేస్తే ఇంకా బెటరని పేర్కొంటున్నారు. బయటికి హార్డ్ గా, లోపల సాఫ్ట్ గా ఉన్న ఈ హైబ్రిడ్ కవర్లు.. స్మార్ట్ ఫోన్లకు అన్ని విధాల శ్రేయస్కరమని వివరిస్తున్నారు.

Also Read: షావోమి అధునాతన ‘FX Mini LED’ టీవీలు.. ఆశ్చర్యపరిచే ఫీచర్లు.. భారీ స్క్రీన్‌పై విజువల్స్ పండగ!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×