E-Paper
Advertisement

స్మార్ట్ టీవీ స్క్రీన్‌ను ఎలా పడితే అలా తుడుస్తున్నారా? అయ్య బాబోయ్ ఇక కొంపమునిగినట్టే!

స్మార్ట్ టీవీ స్క్రీన్‌ను ఎలా పడితే అలా తుడుస్తున్నారా? అయ్య బాబోయ్ ఇక కొంపమునిగినట్టే!
Advertisement

Smart TV Cleaning: ప్రస్తుతం ప్రతీ ఇంట్లో స్మార్ట్ టీవీలు ముఖ్యమైన వస్తువులుగా మారిపోయాయి. అయితే సహజంగానే వీటిపై ఎప్పటికప్పుడు దుమ్ము, దూళి పేరుకుపోతుంటాయి. స్క్రీన్ పై డస్ట్ ఉండటం వల్ల సినిమాలు, సిరీస్ లు చూసేందుకు కాస్త ఇబ్బంది అనిపించవచ్చు. దీంతో చాలా మంది చేతికి దొరికిన వస్తువుతో స్క్రీన్ ను తుడిచే ప్రయత్నం చేస్తుంటారు. ఇది చాలా తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం అలసత్వం వహించినా.. టీవీ స్క్రీన్స్ దెబ్బతిని రూ.వేల రూపాయల నష్టం రావొచ్చని పేర్కొంటున్నారు. కాబట్టి టీవీ స్క్రీన్ క్లీనింగ్ సందర్భంగా పాటించాల్సిన గోల్డెన్ రూల్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

గ్లాస్ క్లీనర్లు, కెమికల్స్ వద్దు

సాధారణంగా కిటికీలు, అద్దాలను తుడవడానికి వాడే ‘కోలిన్’ వంటి గ్లాస్ క్లీనర్లను కొందరు టీవీ స్క్రీన్ తుడవడానికి వినియోగిస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. వీటిలో ఉండే అమ్మోనియా, ఆల్కహాల్ వంటి కెమికల్స్ టీవీ స్క్రీన్‌పై ఉండే ప్రొటెక్టివ్ కోటింగ్‌ను దెబ్బతీస్తాయి. దీనివల్ల స్క్రీన్ కలర్ మారిపోవడం, మసకబారడం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పేపర్లు, బట్టలు అస్సలు వద్దు

Advertisement

టీవీని తుడవడానికి కొందరు న్యూస్ పేపర్లు, టిష్యూ పేపర్లు, లేదా ఇంట్లో ఉండే రఫ్ బట్టలను వాడుతుంటారు. ఇది కరెక్ట్ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అవి చూడటానికి మెత్తగా అనిపించినా వీటిలోని పీచు పదార్థం స్క్రీన్‌పై స్క్రాచెస్ పడేలా చేస్తాయని హెచ్చరిస్తున్నారు. కేవలం మైక్రోఫైబర్ క్లాత్ (కళ్లద్దాలు లేదా ల్యాప్‌టాప్ తుడిచే గుడ్డ)ను మాత్రమే టీవీ స్క్రీన్ క్లీనింగ్ కు వాడాలని సూచిస్తున్నారు.

నేరుగా నీటిని స్ప్రే చేయవద్దు

స్క్రీన్‌పై నేరుగా నీటిని గానీ, ఎలాంటి లిక్విడ్‌ను గానీ స్ప్రే చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల ద్రవం కిందికి జారి టీవీ లోపలి భాగాల్లోకి వెళ్లి షార్ట్ సర్క్యూట్‌కు దారితీయెుచ్చని హెచ్చరిస్తున్నారు. ఏవైనా మొండి మరకలు ఉంటే మైక్రోఫైబర్ క్లాత్‌ను లైట్ గా తడిపి, నీటిని పిండేసి నెమ్మదిగా తుడవాలని హితవు పలుకుతున్నారు.

Advertisement

Also Read: షావోమి అధునాతన ‘FX Mini LED’ టీవీలు.. ఆశ్చర్యపరిచే ఫీచర్లు.. భారీ స్క్రీన్‌పై విజువల్స్ పండగ!

ఇవి కూడా మీ మంచికే..!

టీవీని శుభ్రం చేసే క్రమంలో అనుసరించాల్సిన మరికొన్ని జాగ్రత్తలను సైతం నిపుణులు సూచిస్తున్నారు. వారి ప్రకారం.. క్లీనింగ్ కు ముందు తప్పనిసరిగా టీవీని పవర్ ఆఫ్ చేసి, ప్లగ్ తొలగించాలి. స్క్రీన్‌పై గట్టిగా ఒత్తిడి పెట్టకుండా మృదువుగా తుడవాలి. స్క్రీన్ ను పూర్తిగా తుడిచిన తర్వాతే టీవీని ఆన్ చేయాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే స్మార్ట్ టీవీ స్క్రీన్ కొత్తదానిలా మెరుస్తూ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: కాలం మారిందోచ్.. ఇక వర్షాకాలంలో వెచ్చగా ఉంచే.. టాప్ 5 ఏసీలు ఇవే..!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×