BigTV English

Honor Magic 6 Pro: వామ్మో ఇదేం కెమెరా రా బాబు.. 180MPతో Honor నుంచి కొత్త ఫోన్.. రేపే లాంచ్..!

Honor Magic 6 Pro: వామ్మో ఇదేం కెమెరా రా బాబు.. 180MPతో Honor నుంచి కొత్త ఫోన్.. రేపే లాంచ్..!

Honor Magic 6 Pro Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ హానర్ రేపు అనగా ఆగస్టు 2న తన లైనప్‌లో ఉన్న ‘Honor Magic 6 Pro’ ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతోంది. కంపెనీ ఈ ఫోన్‌ను ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. లాంచ్‌కు ముందు కంపెనీ ఈ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్‌ల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించింది. అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభూతిని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఫోన్ రూపొందించినట్లు తెలిపింది.


హానర్ మ్యాజిక్ 6 ప్రోలో కంపెనీ కెమెరా సిస్టమ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఫోన్ AI పవర్డ్ నెక్స్ట్ జనరేషన్ ఫాల్కన్ కెమెరా సిస్టమ్‌తో అందించబడింది. ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన లెన్స్ 50 మెగాపిక్సెల్స్, ఇందులో సూపర్ డైనమిక్ ఫాల్కన్ కెమెరా H9000 HDR సెన్సార్ ఉంది. అలాగే180-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, మాక్రో కెమెరాను కలిగి ఉంది. ఈ సెన్సార్ ప్రత్యేకత విషయానికొస్తే.. ఇది చాలా ప్రకాశవంతంగా వెలుతురు ఉన్న ప్రదేశాలలో కూడా కాంతిని ఎక్కువగా చూపకుండా చాలా క్లారిటీగా చేయగలదు.

Also Read: ఈ ఫీచర్లు చూస్తే హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే కొనేస్తారు.. ధర కూడా తక్కువే..!


అంతేకాకుండా సంబంధిత వివరాలను కూడా సేకరిస్తుంది. హానర్ మ్యాజిక్ 6 ప్రో ముందు వైపు 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఉంది. ఇది f/2.0 ఎపర్చరు వైడ్ యాంగిల్ లెన్స్‌తో రాబోతోంది. ఇది 3D డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. 30 FPS వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు, సెకనుకు 30/60 ఫ్రేమ్‌లను సపోర్ట్ చేయగలదు. 1080p వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇవ్వగలదు. ఇది మాత్రమే కాకుండా AI ఆధారిత అధునాతన మోషన్ సెన్సింగ్ టెక్నాలజీని అందించిన ఈ ఫోన్‌లో స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ కూడా చేయవచ్చు. అలాగే తక్కువ కాంతి ఫోటోగ్రఫీకి గొప్ప అనుభూతిని అందిస్తామని కంపెనీ పేర్కొంది. కెమెరా ఇన్-సెన్సర్ జూమ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది వివిధ జూమ్ లెవెళ్లకు మద్దతు ఇస్తుంది.

ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. ఈ ఫోన్ 2800 x1280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.8 అంగుళాల LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనికి 100% DCI-P3 కలర్ గామట్ సపోర్ట్ ఉంటుంది. ఇది 5000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉండబోతోంది. డిస్ప్లేలో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కనిపిస్తుంది. అంతేకాకుండా డాల్బీ విజన్‌కు మద్దతు కూడా డిస్ప్లేలో అందుబాటులో ఉంటుంది. అలాగే IP68 రేటింగ్ కూడా ఇవ్వబడింది. ఓవరాల్‌గా మ్యాజిక్ 6 ప్రోలో కంపెనీ డిస్ ప్లే, కెమెరా పరంగా గొప్ప ఫీచర్లను అందించబోతోందని చెప్పొచ్చు.

Related News

iPhone 17 Pro Max: ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ కు పోటీనిచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు..

iPhone 16 vs iPhone 17: ఐఫోన్ 16 లేదా ఐఫోన్ 17.. భారతీయులకు ఏది బెటర్?

Best Selling iPhone: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే.. తాజా రిపోర్ట్‌‌లో షాకింగ్ విషయాలు!

Iphone Air : వచ్చేసింది ఐఫోన్ ఎయిర్.. గెలాక్సీ S25 ఎడ్జ్‌కు సవాల్ విసిరిన ఆపిల్

Nothing Phone Discount: నథింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్‌పై సూపర్ ఆఫర్.. రూ.35000 డిస్కౌంట్.. ఎక్స్‌ఛేంజ్ లేకుండానే!

No network Simcard: ఫోన్‌లో సిమ్ కార్డ్ ఉన్నా నెట్ వర్క్ చూపించడం లేదా? ఇవే కారణాలు..

Big Stories

×