Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘రాంబంటు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) లీడ్ రోల్ పోషించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో ఆయన కూతురు పాత్రలో నటించింది. ఇకపోతే తెలుగులో మంచి మంచి పాత్రలు లభిస్తున్నా.. సక్సెస్ మాత్రం అనుకున్న రేంజ్ లో అందుకోలేకపోయింది. దాంతో కోలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె అక్కడే కలిసి సినిమాలు చేసి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.
ఈ ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. వెంకటేష్ (Venkatesh) హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భాగ్యం పాత్రలో నటించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ప్రాంతీయంగా రూ.300 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమా తర్వాత అవకాశాలు వరుసగా తలుపు తడతాయి అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈమెకు తెలుగులో ఒక్క సినిమాలో కూడా అవకాశం లభించలేదు. అటు కోలీవుడ్లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అవి కూడా ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి ఈమెకు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ చేసే అవకాశం లభించినట్లు సమాచారం.
సంగీత , తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో 2022లో వచ్చిన హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ మసూద. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సాయికిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు కావ్య కళ్యాణ్ రామ్ కు ఇటు సంగీతకి కూడా మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. సినిమా సక్సెస్ అయితే అయ్యింది కానీ ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సాయి కిరణ్ (Sai Kiran)మరో సినిమాకి దర్శకత్వం వహించలేదు. పైగా ఈ సినిమా వచ్చే మూడేళ్లు అవుతున్నా.. ఇంకా ఈయన మరో సినిమాకి ఛాన్స్ దక్కించుకోకపోవడం గమనార్హం. అలాంటి ఈయన ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత మహేశ్వర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
ALSO READ:Tollywood: ఇండస్ట్రీకి నెక్స్ట్ హీరోయిన్ రెడీ.. ఆ హాట్ ఫోజులు చూశారా!
అటు సక్సెస్ సాధించిన ఐశ్వర్య రాజేష్ కి ఇప్పటివరకు అవకాశాలు రాలేదు. ఇటు దర్శకుడు సాయికిరణ్ కూడా సినిమా చేసి మూడేళ్లు అవుతున్నా.. మరో సినిమాకి దర్శకత్వం వహించలేదు. అటు నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఖాతాలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. అలాంటి ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథ కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఆడియన్స్.. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఒక ముగ్గురు కలయికలో రాబోతున్న కథతో మెప్పిస్తారా? అసలు బాక్సాఫీస్ వద్ద మార్కెట్ లేని ఈ ముగ్గురు ఇప్పుడు ఈ కథతో ఏ విధంగా సక్సెస్ అందుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే రిస్క్ చేస్తున్నారేమో అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ ముగ్గురు కలిసి రాబోతున్న ఈ లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.