BigTV English
Advertisement

Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో చెప్పులతో కొట్టుకున్న ప్రయాణికుల వీడియో వైరల్..

Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో చెప్పులతో కొట్టుకున్న ప్రయాణికుల వీడియో వైరల్..

Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అసభ్యకర ప్రవర్తన, కొట్లాట, తిట్టుకోవడం, డ్యాన్స్ లు, రీల్స్ చేయడం వంటి అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. ఇలా ఏదో ఒక వీడియోతో తరచూ హాట్ టాపిక్‌గా మారుతున్న ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. మరో వీడియోతో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. తాజాగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణికులు కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. బయటకు వచ్చిన వీడియోలో, ఇద్దరు ప్రయాణీకులు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. ముందుగా ఓ వ్యక్తి చెప్పులు తీసి మరో ప్రయాణికుడి ముఖంపై కొట్టడం, తర్వాత వ్యక్తి కూడా చెంపదెబ్బ కొట్టడం వీడియోలో చూడవచ్చు.


ఢిల్లీ మెట్రో లోపల రికార్డైన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మధ్య అకస్మాత్తుగా గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో చిన్నగా మొదలైన గొడవ కాస్త పెద్దదిగా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడమే కాదు చివరకు చెప్పులతో కూడా కొట్టుకున్నారు. చెంప దెబ్బలు, చెప్పులతో కొట్టుకోవడంతో మెట్రోలో ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ గొడవ చోటుచేసుకోవడంతో అక్కడే ఉన్న ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో వారిని ఆపకుండా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీస్తూ నెట్టింట పోస్ట్ చేశారు.

అయితే ఇంతలో, ఇద్దరి మధ్య గొడవను ఆపడానికి మరొక ప్రయాణికుడు జోక్యం చేసుకుంటాడు. ఇద్దరు ప్రయాణీకుల మధ్య గొడవకు కారణమేమిటో తెలియనప్పటికీ, ఈ వీడియోను వైరల్ అవుతోంది. మెట్రో లోపల జరిగే ఇతర పోరాటాలతో పోల్చితే ఇది మామూలే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ ఢిల్లీ మెట్రోకు సంబంధించిన ఇలాంటి వీడియోలు సాధారణమే అని పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తున్నారు.


Related News

Viral Video: బ్యాండ్ మేళాతో పిల్లల్ని నిద్రలేపిన తల్లి.. బద్దకానికి భలే ట్రీట్మెంట్!

Costliest Pani Puri: వోడ్కాతో పానీపూరీ, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Duvvada Srinivas: వాళ్ల వల్లే మాకు అంత క్రేజ్.. దువ్వాడ షాకింగ్ కామెంట్స్!

Viral Video: సీజన్‌తో పనిలేదు.. ఈ బామ్మ దగ్గర 365 రోజులు మామిడి పండ్లు దొరుకుతాయ్, అందుకు ఏం చేస్తోందంటే?

Fact Check: సౌదీలో అట్టహాసంగా దీపావళి వేడుకలు, అసలు విషయం ఏంటంటే?

Viral Video: రన్నింగ్ కారులో నుంచి మూత్రం పోసిన యువకుడు, నెట్టింట వీడియో వైరల్!

Sadar Festival: సదర్ దున్నపోతుకు కాస్ట్లీ మద్యం.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Diwali Celebrations: కిలో మీటరు మేరకు పటాకులు పేల్చి బీభత్సం.. ఫ్యామిలీకి రూ.10 వేలు చందాలు వేసుకుని మరీ..

Big Stories

×