BigTV English

Mrunal Thakur: సీరియల్ హీరోయిన్ టూ స్టార్ హీరోయిన్..

Mrunal Thakur: సీరియల్ హీరోయిన్ టూ స్టార్ హీరోయిన్..

Mrunal Thakur: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు హీరో అవుతారు.. ఎవరు ఎప్పుడు జీరో అవుతారు అనేది చెప్పడం కష్టం. ఒక్కోసారి ఒక్కొక్కరికి లక్ ఫెవర్ చేస్తుంది. ఇంకొకరికి టైమ్ ఫెవర్ చేస్తుంది. అలా వచ్చి హీరోయిన్లు అయిపోయినవారు ఉన్నారు. ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో ఉంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోయిన్ అయినవారు ఉన్నారు.


ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. హార్డ్ వర్క్ ను నమ్ముకొని.. ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ అయిన ఒక చిన్నదాని పుట్టినరోజు ఈరోజు. ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి.. ఇదంతా చెప్పడం జరిగింది. ఇంతకు ఆ చిన్నది ఎవరు అంటే.. ఎంతోమందికి ఆమె సీత.. మరెంతో మందికి ఆమె యష్ణ.. ఇంకొంతమందికి బంగారం.. అభిమానుల మనస్సులో దేవత. అందానికి నిలువెత్తు నిదర్శనం మృణాల్ ఠాకూర్. ఈ మరాఠీ ముద్దుగుమ్మ 1992, ఆగస్టు 1 న జన్మించింది.

చిన్నతనం నుంచి నటనపై ఆసక్తితో పెరిగిన మృణాల్ చదువు పూర్తి చేసి ముజ్సే కుచ్ కెహ్తీ…యే ఖామోషియాన్ అనే సీరియల్ తో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. దీని తరువాత కుంకుమ భాగ్య సీరియల్ లో హీరోయిన్ చెల్లిగా నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఎదగడానికి ఈ చిన్నది ఎన్నో కష్టాలు పడింది. దాదాపు సీరియల్స్ నుంచి బయటకు వచ్చిన నాలుగేళ్లకు అమ్మడికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.


లవ్ సోనియా సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది మృణాల్. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేక పోయింది. ఇక మృణాల్ ను బాలీవుడ్ గుర్తుపట్టింది అంటే అది సూపర్ 30 సినిమా వలన. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మృణాల్ కీలక పాత్రలో నటించింది. దీని తరువత బాట్లా హౌస్ కూడా అమ్మడికి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మృణాల్ ను ఒక నటిగా గుర్తించి, ఆమెకు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది మాత్రం తెలుగు అభిమానులే.

సీతారామం.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ నటించి మెప్పించింది. సీత అనే పేరుకే కాదు పాత్రకు కూడా ఆమె న్యాయం చేసిందనే చెప్పాలి. తెలుగువారు మృణాల్ లాంటి భార్య రావాలి అని కోరుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ఏళ్లు ఆమె పడిన కష్టానికి ప్రతిఫలం ఈ విజయం. ఒక్క సినిమాతో తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది.

మృణాల్ పేరు కాస్తా సీతగా మారిపోయింది. అంతగా తెలుగు ప్రేక్షకులు మృణాల్ ను మనసులో దాచుకున్నారు. ఇక ఒక్క సక్సెస్ తోనే ఆగకుండా మంచి మంచి కథలను ఎంచుకుంటూ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది మృణాల్. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఒకపక్క ట్రెడిషనల్ గా ఉంటూనే ఇంకోపక్క అందాల ఆరబోత కూడా చేస్తూ ఈ జనరేషన్ అమ్మాయిలనే తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్.. ముందు ముందు కూడా ఈ స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను ఇలాగే కొనసాగిస్తుందా.. ? లేదా .. ? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Related News

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big Stories

×