Montha In Vizag: విశాఖపట్నంలో మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడు ఈదురుగాలులు తోడయ్యాయి. ఫలితంగా నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
విశాఖ నగరంలో మొంథా ప్రభావం
విశాఖ నగరంలో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన గాలులు వీస్తుండడంతో ఏళ్ల తరబడి చెట్లు నేల కొరిగాయి. టౌన్‌లో పురాతన చెట్లు కూలిపోయాయి. పరిస్థితి గమనించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం అర్ధరాత్రి తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.
టౌన్, మిగతా ప్రాంతాల్లో విరిగిన , వాలిపోయిన చెట్లను తొలగించి ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. జీవీఎంసీ సిబ్బంది, పోలీసులతో సమన్వయం చేసుకుంటూ విరిగిన చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు, వాహనాలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఈదురుగాలులకు కైలాసగిరి సమీపంలోని అప్పుగర్ లో రోడ్డుపై చెట్లు కూలాయి. వర్షానికి బీచ్ రోడ్డు జలమయం అయ్యింది.
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్థంబాలు
అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, అరకు వంటి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలిపోయాయి. దీంతో ఆ రూట్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై చర్యలు చేపడుతోంది.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. అత్యధికంగా కొత్తవలసలో 5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయ్యింది. విజయనగరం జిల్లాలోని తాటిపూడి, ఆండ్ర, మడ్డువలస జలాశ్రయాలు నిండుకుండల్లా మారాయి. తూర్పు నౌకాదశం వవద్ద హెలికాఫ్టర్లు, సరకు విమానాలను సిద్ధం చేసింది. డీప్ డైవర్స్, రెస్క్యూ బృందాలకు సిబ్బందిని ఏర్పాటు చేశారు అధికారులు.
ALSO READ: వేగంగా కదులుతున్న మొంథా, కాకినాడ తీరానికి సమీపంలో
అటు కోస్తా జిల్లాల్లోని 26 తీరప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా మొంథా తుపాన్ హెచ్చరికలు జారీ చేసింది. క్షణాల్లో రియల్ టైమ్ వాయిస్‌తో ప్రజలను అలర్ట్ చేస్తోంది. ఈసారి అవేర్నెస్ అలర్ట్ బ్రాడ్కాస్టింగ్స్ సాంకేతికత వినియోగించింది ఏపీ ప్రభుత్వం. విద్యుత్ అంతరాయం జరిగినా, 360° హార్న్ స్పీకర్ వ్యవస్థ, కిలోమీటరు పరిధిలో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తుంది.
విశాఖ:
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం అర్ధరాత్రి తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటన.
టౌన్ కొత్త ప్రాంతాల్లో విరిగిపడిన , వాలిపోయిన చెట్లను తొలగించి తరలించే ప్రక్రియను స్వయంగా పరిశీలన.
జీవీఎంసీ సిబ్బంది, పోలీసులతో మాట్లాడుతూ విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించాలని,… pic.twitter.com/IldGKEg8S6
— Vizag News Man (@VizagNewsman) October 28, 2025
#CycloneMontha effect In #Vizag
Massive rains and winds lashing in
Video taken by me at 6:30AM today#NEM2025 pic.twitter.com/wrXMh2Wagp— Eastcoast Weatherman (@eastcoastrains) October 28, 2025