Sky Stadium: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, నిన్నటి నుంచి ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. కలర్ ఫుల్ హంగులతో ఓ స్టేడియం గాలిలో కనిపిస్తోంది. మొత్తం లైటింగ్స్ తో మెరుస్తోంది. అద్దాల మేడలో ఈ స్టేడియాన్ని ఏకంగా 350 మీటర్ల ఎత్తులో నిర్మించారు. దీనికి సంబంధించిన వీడియో చూసిన జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఇదెక్కడ కట్టార్రా? ఇంద్ర భవనం లాగా ఉందని వాపోతున్నారు. ఇది ఎక్కడో కాదు సౌదీ అరేబియాలో నిర్మించేందుకు సన్నహాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఈ వీడియోను అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో వైరల్ గా మారింది.
ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియాన్ని నిర్మించేందుకు సౌదీ అరేబియా ప్లాన్ చేస్తోంది. సౌదీ తన భవిష్యత్తు నగరం ది లైన్ లో నియోమ్ స్టేడియం అనే స్కై స్టేడియాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. దాని నమూనా వీడియోను కూడా పంచుకుంది. 2032 సంవత్సరం నాటికి ఈ స్టేడియాన్ని ప్రారంభం చేయనున్నట్లు వెల్లడించింది. 2034 ఫీఫా ప్రపంచ కప్ మ్యాచ్ లకు ఈ స్టేడియం ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నా యి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే భూమి నుంచి 350 మీటర్ల ఎత్తులో ఈ స్కై స్టేడియం ఉంటుంది. ఇక ఈ స్కై స్టేడియం నిర్మించేందుకు ఒక బిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని చెబుతున్నారు. అంటే దాదాపు Rs. 7500 కోట్లు ఖర్చు అవుతుందన్న మాట.
సౌదీ అరేబియా కట్ట బోతున్న స్టేడియం 2034 ఫుట్ బాల్ ప్రపంచకప్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. 350 మీటర్ల ఎత్తులో ఉండనున్న సౌదీ అరేబియాలోని ఈ స్కై స్టేడియంలో 46,000 మంది అభిమానులు కూర్చునే అవకాశం ఉంటుందట. 7500 కోట్ల నుంచి 8 వేల కోట్ల వరకు ఈ స్టేడియం కట్టడానికి ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 2032 నాటికి ఈ స్టేడియం పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. 48 జట్లు పోటీపడే 2034 ప్రపంచ కప్ నేపథ్యంలో సౌదీలోని ఐదు నగరాలు ఈ టోర్నమెంట్ కు ఆథిత్యం ఇస్తాయి. 2027లో ఈ స్టేడియం నిర్మించడానికి పనులు ప్రారంభం కాబోతున్నాయి. 2032 నాటికి పూర్తిచేసేలా పకడ్బందీగా ప్లాన్లు చేస్తున్నారు. అంటే దాదాపు 5 సంవత్సరాలపాటు ఈ స్టేడియం నిర్మిస్తారు. ఇలాంటి నేపథ్యంలో దానికి సంబంధించిన నమూనా చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియం
స్కై స్టేడియం నిర్మాణానికి సౌదీ అరేబియా సన్నాహాలు
సౌదీలోని ది లైన్ నగరంలో నియోమ్ స్టేడియం అనే స్కై స్టేడియాన్ని నిర్మించేందుకు కసరత్తు
2032 నాటికి స్టేడియం ప్రారంభం కానున్నట్లు వెల్లడి
భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో స్టేడియం pic.twitter.com/yBbCrwPC8C
— BIG TV Breaking News (@bigtvtelugu) October 27, 2025