Telangana Rains: మొంథా తుపాను ప్రభావంలో తెలంగాణపై పడింది. సోమవారం సాయంత్రం నుంచి వివిధ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్థరాత్రి నుంచి హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురిసింది. రోడ్లపై ఎక్కడ చూసినా నీరు కనిపిస్తోంది. రాబోయే రెండు లేదా మూడు గంటలు పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది.
తెలంగాణకు వర్ష సూచన
వాటిలో మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక శాటిలైట్ అంచనాల ప్రకారం.. తెలంగాణలో మంగళవారం సూర్యుడు కనిపించక పోవచ్చని అంచనా వేసింది. రోజంతా ముసురుగా ఉండడం, లేకుంటే వర్షాలు పడతాయి. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తెలంగాణ వర్షం జోరు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. రాత్రి 9 గంటల తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి.
రెండు గంటల్లో ఆ జిల్లాలకు భారీ వర్షం?
మంగళ, బుధవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం నాడు హైదరాబాద్ సిటీలో 3 లేదా 4 సార్లు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ, మధ్య తెలంగాణలో చాలా జిల్లాల్లో కొన్ని చోట్ల 90 నుంచి 150 మిల్లీమీటర్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారత వాతావరణ శాఖ సూచన మేరకు మొంథా తుపాను ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా మారింది. తీవ్రమైన తుపానుగా మారిన తర్వాత గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఇదిలా ఉండగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ALSO READ: తప్పుడు ప్రచారం చేస్తే.. పరువునష్టం దావా-మంత్రి జూపల్లి
పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఓ అంచనా. కోస్తా కర్ణాటక, తూర్పు రాజస్థాన్, గంగా తీర పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, విదర్భలలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని భావించింది.
ఈనెల 30 వరకు అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్, పశ్చిమ మధ్యప్రదేశ్, మరాఠ్వాడ, రాజస్థాన్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది.