E-Paper
Advertisement

Honor Play 10A: కేవలం 10 శాతం బ్యాటరీతో 65 గంటలు నడిచే స్మార్ట్‌‌ఫోన్.. తక్కువ బడ్జెట్‌లో హానర్ కొత్త ఫోన్ లాంచ్

Honor Play 10A: కేవలం 10 శాతం బ్యాటరీతో 65 గంటలు నడిచే స్మార్ట్‌‌ఫోన్.. తక్కువ బడ్జెట్‌లో హానర్ కొత్త ఫోన్ లాంచ్
Advertisement

Honor Play 10A| హానర్ కంపెనీ చైనా మార్కెట్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ హానర్ ప్లే 10A 5G లాంచ్ చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరకే 5G కనెక్టివిటీ, లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాల్సిన యూజర్లకు రూపొందించారు. పవర్ ఎఫిషియెన్సీనే ఈ ఫోన్ బలమైన పాయింట్‌గా హానర్ హైలైట్ చేస్తోంది. కేవలం 10 శాతం బ్యాటరీతో 65 గంటల స్టాండ్‌బై ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఈ క్లెయిమ్ ఎంట్రీ లెవల్ బయ్యర్లను బాగా ఆకర్షిస్తోంది. పెద్ద డిస్‌ప్లే, మంచి చిప్‌సెట్, రోజువారీ ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. బేసిక్ పెర్ఫామెన్స్, ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ సపోర్ట్ కావాల్సినవారికి ఇది సరైన ఫోన్.

హానర్ ప్లే 10A 5G ధర,  అందుబాటు

హానర్ ప్లే 10A 5G ఇప్పటికి చైనాలో మాత్రమే లాంచ్ అయింది. రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్‌లో 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉంది. దీని ధర 799 యువాన్ (భారత కరెన్సీలో దాదాపు రూ.10,213). హయ్యర్ వేరియంట్‌లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉంది. దీని ధర 899 యువాన్ (సుమారు రూ.11,489). లేక్ బ్లూ, స్కై బ్లూ, ఇంక్ రాక్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంది. హానర్ అధికారిక వెబ్‌సైట్, JD.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.

పెద్ద డిస్‌ప్లే, కంటి రక్షణ ఫీచర్లు

Advertisement

హానర్ ప్లే 10A 5Gలో 6.75 అంగుళాల పెద్ద ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. HD ప్లస్ రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్, యాప్ నావిగేషన్ లభిస్తుంది. నేచురల్ లైట్ ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ, లో లైట్ కంఫర్ట్ మోడ్, ఈ-బుక్ మోడ్ ఉన్నాయి. లాంగ్ యూసేజ్‌లో కంటి స్ట్రెయిన్ తగ్గించడానికి ఇవి సహాయపడతాయి.

బేసిక్ ఫోటోగ్రఫీ కోసం కెమెరా సెటప్ ఏమిటి?

ఇందుంలో కెమెరా సెటప్‌ చాలా సింపుల్‌గా ఉంది. రియర్‌లో 13MP మెయిన్ కెమెరా ఉంది. రోజువారీ ఫోటోగ్రఫీ, క్యాజువల్ షూటింగ్‌కు సరిపోతుంది. ఫ్రంట్‌లో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. వీడియో కాల్స్, బేసిక్ సెల్ఫీలకు బాగా పనిచేస్తుంది. అడ్వాన్స్‌డ్ ఫోటోగ్రఫీ కంటే బ్యాటరీ, పెర్ఫామున్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారికి సరిపోతుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G పెర్ఫామెన్స్

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఎఫిషియెంట్ పెర్ఫామెన్స్‌తో 5జీ కనెక్టివిటీ ఇస్తుంది. రోజువారీ యాప్స్, సోషల్ మీడియా, స్ట్రీమింగ్ స్మూత్‌గా నడుస్తాయి. మ్యాజిక్‌ఓఎస్ 9 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. క్లీన్, రెస్పాన్సివ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.

Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం

భారీ బ్యాటరీ, స్టాండ్‌బై పవర్ క్లెయిమ్

హానర్ ప్లే 10A 5Gలో 5,300mAh భారీ బ్యాటరీ ఉంది. పవర్ ఎఫిషియెన్సీనే మెయిన్ సెల్లింగ్ పాయింట్‌గా చెప్పుకుంటోంది. 10 శాతం బ్యాటరీతో 65 గంటల స్టాండ్‌బై, 3.4 గంటల టాక్ టైమ్ ఇస్తుందని క్లెయిమ్ చేసింది. యూఎస్‌బీ టైప్-సీ ద్వారా 15వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

అదనపు ఫీచర్లు, బిల్డ్ డిటెయిల్స్

మైక్రోఎస్‌డీ కార్డ్ ఎక్స్‌పాన్షన్ సపోర్ట్ ఉంది. ఫేస్ రికగ్నిషన్ ద్వారా త్వరగా అన్‌లాక్ చేయవచ్చు. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ ఉంది. షాక్-రెసిస్టెంట్ డిజైన్‌తో డ్యూరబిలిటీ మెరుగైంది. ఫోన్ డైమెన్షన్లు 167 x 77 x 7.89ఎంఎం, బరువు 186 గ్రాములు. చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×