Champion Movie Review : సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ కిడ్స్‌లో రోషన్ మేకా కూడా ఒకరు. పెళ్లి సందD మూవీతో ఒకే అనిపించుకున్నా… ప్రాపర్ హిట్ అనే పేరైతే రాలేదు. ఇప్పుడు ఛాంపియన్ మూవీపై రోషన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తన కెరీర్‌లో ఈ ఛాంపియన్ మూవీ పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాడు. మరి రోషన్‌ను ఛాంపియన్ మూవీ ఛాంపియన్‌గా నిలబెట్టిందా..? అనేది ఈ రివ్యూలో చూద్దాం.
1948 లో దేశం మొత్తం స్వాతంత్య్రం సంబురాల్లో ఉంది. కానీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం రజాకార్ల చేతుల్లో నలిగిపోతుంది. అలాగే బైరాన్ పల్లి గ్రామం ఆ రజాకార్లను ఎదరిస్తూ పోరాటం చేస్తున్నారు. ఆ టైంలో… మైఖేల్ సి. విలియమ్స్‌కి (రోషన్) ఫుట్ బాల్ ఆట కోసం ఇంగ్లాండ్ వెళ్లే ఛాన్స్ వస్తుంది. అందుకోసం మైఖేల్ ఓ గన్ డీల్ చేయాల్సి వస్తుంది. ఆ గన్ డీల్ చేసే టైంలో బైరాన్ పల్లిలో ఉండిపోతాడు. మైఖేల్ వెళ్లిన తర్వాత బైరాన్ పల్లిలో ఎలాంటి మార్పులు జరిగాయి? రజాకార్లు vs బైరాన్ పల్లి గ్రామస్థుల మధ్య జరిగే యుద్దంలో మైఖేల్ ఎలాంటి పాత్ర పోషించాడు? దీనికి తాళ్లపూడి చంద్రకళ (అనశ్వర రాజన్) సంబంధమేంటి అనేది మిగితా స్టోరీ.
తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం.. దాని తర్వాత నిజాం, రజాకార్లపై చేసిన పోరాటం చరిత్రపుటల్లో ఉంటుంది. దీన్ని ఎప్పుడూ మర్చిపోలేరు ఇక్కడి ప్రజలు. ముఖ్యంగా బైరాన్ పల్లిని వీరా బైరాన్ పల్లిగా మార్చిన ప్రజల త్యాగాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
అలాంటి ఊరుపై సినిమా చేస్తున్నారంటే… చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది చరిత్ర కాబట్టి… ఏ మాత్రం తేడా వచ్చినా.. తేడా కొట్టేస్తుంది. మరీ ఈ సినిమాలో అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా అంటే… అస్సలు తీసుకోలేదు అని చెప్పొచ్చు.
1948 ఆగస్టు 27వ తేదీ అర్థరాత్రి 1000 మందికిపైగా రజాకార్లు ఓ ఊరుపై పడి కంటికి కనపడిన వాళ్లను కనపడినట్టు చంపారు. కనిపించిన ఆడవాళ్లను మానభంగం చేశారు. వాళ్ల బట్టలు విప్పించి బతుకమ్మలు ఆడించారు. అప్పట్లో… ఈ బైరాన్ పల్లి ఘటనను మినీ జలియన్ మినీ జలియన్ వాలాబాగ్ దురంతంగా పిలిచారంటే… రజాకార్లు ఎంత దారుణంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఘటన ప్రపంచానికి తెలియడంతో… అప్పటి సెంట్రల్ హోం మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదారాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని ఆపరేషన్ పోలో చేపట్టాడు.
ఇప్పటికీ చరిత్రపుటల్లో ఉంటుంది… ఆపరేషన్ పోలో రావడానికి కారణం.. బైరాన్ పల్లి ప్రజల మాన, ప్రాణాల త్యాగం అని. అలాంటి కథను.. బైరాన్ పల్లి ప్రజల త్యాగాన్ని డైరెక్టర్ పూర్తిగా మార్చేశాడు. హీరోకు అనుకూలంగా మార్చేసి, హీరోకు ఎలివేషన్స్ పెట్టి… కమర్షియల్ హంగులను అద్ది.. చరిత్రను మార్చారు.
ఇక చరిత్ర పక్కన పెట్టి వీళ్లు చేసిన ఛాంపియన్ సినిమా గురించి మాట్లాడుకుంటే.. హీరో లక్ష్యం వేరు… చేసే పోరాటం వేరు. ఫస్టాఫ్ వరకు కొంత పర్లేదు అనుకున్నా.. సెకండాఫ్ చాలా డల్‌గా రన్ అవుతుంది స్క్రీన్ ప్లే. క్లైమాక్స్ లో వచ్చే యుద్ధం ఒకే అనుకున్నా… హీరోకు మూడు బుల్లెట్స్ పడినా… లేచి మళ్లీ ఫైట్ చేయడం కన్వీన్స్‌గా లేదు. అలాగే బైరాన్ పల్లి గ్రామం అంటూ వేసిన సెట్స్ కూడా చాలా పేలవంగా ఉన్నాయి.
ఫర్ఫామెన్స్ గురించి అంటే.. రోషన్ తన వరకు బానే చేశాడు. అనశ్వర రాజన్ పాత్రను అందం కోసం.. హీరో పక్కన హీరోయిన్ అన్నట్టు పెట్టినట్టు ఉంది. అంతకు మించి ఆ పాత్రతో ఉపయోగం లేదు. మిగితా నటీనటులు పర్లేదు.
రోషన్ నటన
చరిత్రను మార్చడం
డల్ స్క్రీన్ ప్లే
పేలవమైన సెట్స్
మొత్తంగా.. సినిమా కోసం చరిత్ర మార్చొద్దు.