E-Paper
Advertisement

Israel Vs Iran: ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు.. నేను బతికే ఉన్నాను, ఇదిగో ఎవిడెన్స్ అంటూ వీడియో పోస్ట్

Israel Vs Iran: ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు.. నేను బతికే ఉన్నాను, ఇదిగో ఎవిడెన్స్ అంటూ వీడియో పోస్ట్
Advertisement

Israel Vs Iran: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తోంది. యుద్ధం ఏమోగానీ తప్పుడు వార్తలు, వీడియోలు హంగామా చేస్తున్నాయి. దీంతో ఏం జరిగిందో తెలియక మద్దతుదారులు కంగారుపడుతున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణించారంటూ వస్తున్న వార్తలను ఆయన స్వయంగా ఖండించారు. అంతేకాదు ఓ వీడియో కూడా విడుదల చేశారు.

నేను బతికే ఉన్నాను, ఇదిగో ఎవిడెన్స్ అంటూ వీడియో పోస్ట్-ఇజ్రాయెల్ పీఎం

Advertisement

ఇరాన్ చేపట్టిన మిస్సైళ్ల దాడుల్లో ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు మరణించారంటూ రకరకాల వార్తలు హంగామా చేస్తున్నాయి. ఆయా వార్తలకు చెక్ పెట్టేందుకు నేరుగా ఆయన రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన తన చేతిని చూపిస్తూ తనకు ఐదు వేళ్లు ఉన్నాయని చెప్పారు. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఆరు వేళ్లు ఉన్నాయని గుర్తు చేశారు.

ఓ షాపులో కాఫీ ఆర్డర్ చేస్తూ కనిపించారు నెతన్యాహు. తనకేమీ కాలేదని అందులో పేర్కొన్నారు. ప్రాణాలు పోయినా తన దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటానని, ఈ క్లిష్ట సమయంలో ప్రజల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం స్పందించింది. అవన్నీ అసత్యాలని, ప్రధాని బెంజిమన్ క్షేమంగా ఉన్నారని తెలిపింది. ఏకంగా తన వీడియో ద్వారా పీఎం స్పష్టత ఇచ్చారు.

Advertisement

ఇజ్రాయెల్ పీఎంకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెచ్చరిక జారీ 

మరోవైపు ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ నెతన్యాహుకు ఇరాన్‌కి చెందిన రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఓ హెచ్చరిక జారీ చేసింది. పిల్లల ప్రాణాలు తీసే వ్యక్తిగా ఆయన్ని అభివర్ణించింది. ఆయన ఇంకా బతికే ఉంటే తమ శక్తి మేరా వెంటాడతామని వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ పీఎం మరణంపై వస్తున్న తప్పుడు వార్తలని ఇజ్రాయెల్‌ పేర్కొన్న కొన్ని గంటల్లో ఐఆర్‌జీసీ ఈ హెచ్చరికలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీంతో నెతన్యాహు బతికే ఉన్నారని తేలిపోయింది. యూఎస్‌ కన్జర్వేటివ్‌ నేత కాండేస్‌ ఓవెన్స్‌ ఈ వార్తలపై రియాక్ట్ అయ్యారు. బీబీ ఎక్కడ..? ఆయన కార్యాలయం ఫేక్‌ ఏఐ వీడియోను ఎందుకు విడుదల చేసిందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై మరికొందరు ఎక్స్‌ వేదికగా రియాక్ట్ అవుతున్నారు.

ALSO READ: యుద్ధం వేళ ఫోన్‌లో మాట్లాడుకున్న ట్రంప్, పుతిన్.. అసలేం జరిగింది?

 

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×