E-Paper
Advertisement

రాహుల్‌గాంధీ బాటలో విజయసాయిరెడ్డి.. ఐడియా అదుర్స్, ఏపీ సమయం ఆసన్నమైందంటూ

రాహుల్‌గాంధీ బాటలో విజయసాయిరెడ్డి.. ఐడియా అదుర్స్, ఏపీ సమయం ఆసన్నమైందంటూ
Advertisement

Amaravati: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బాటలో వైసీపీ ఎగ్జిట్ నేత విజయసాయిరెడ్డి నడుస్తున్నారా? ఎన్నికల సమయంలో రాహుల్ చెప్పిన న్యాయ్ స్కీమ్ ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారా? ఇంతకీ వీఎస్ఆర్‌కు ఆ ఆలోచన ఎందుకొచ్చింది? ఏపీని అప్పుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.

రాహుల్‌గాంధీ బాటలో విజయసాయిరెడ్డి

Advertisement

శుక్రవారం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆయిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా మధ్యతరగతి సామాన్యుడు బక్క చిక్కిపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీలోని కూటమి ప్రభుత్వానికి కీలక సూచన చేశారు మాజీ సీఎం విజయసాయిరెడ్డి.

రాష్ట్రంలో పేద కుటుంబాలకు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం-UBI పథకం అమలు చేయాలని అవసరం ఉందన్నారు. అత్యంత పేదరికంలో 50 శాతం కుటుంబాలకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నెలకు రూ. 10 వేలు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అనేక సంక్షేమ పథకాలతో పోలిస్తే ఎలాంటి అవినీతి లేకుండా దీన్ని అములు చేస్తే బాగుంటుందన్నారు.

Advertisement

వీఎస్ఆర్ న్యాయ్ -2 ప్లాన్, కూటమి ప్రభుత్వం మాటేంటి?

ఏపీలో ఏటా సుమారు రూ. లక్ష కోట్ల ఖర్చుతో అత్యంత పేదరికంలో ఉన్న 85 లక్షల అట్టడుగు కుటుంబాలకు నేరుగా మద్దతు ఇచ్చినట్లు అవుతుందన్నారు. ప్రస్తుతం సంక్షేమంపై ఖర్చు చేస్తున్న దాదాపు రూ. 1.13 లక్షల కోట్ల కంటే తక్కువేనన్నారు. వీఎస్ఆర్ ఆలోచన బాగుంది.. మరి డబ్బుల మాటేంటి? అన్నదే అసలు ప్రశ్న.

అన్నట్లు విజయసాయిరెడ్డి బయట పెట్టిన ఈ ఆలోచన 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఈ తరహా పథకాన్ని ప్రతిపాదించారు. తాము అధికారంలోకి వస్తే న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామని అప్పట్లో ప్రకటించిన విషయం తెల్సిందే. పేదరిక నిర్మూలన కోసం న్యాయ్ పథకం కింద అత్యంత అట్టడుగున్న 20 శాతం మంది నిరుపేద కుటుంబాలకు నెలకు రూ.6000 చొప్పున ఇస్తామన్నారు.

ALSO READ: కడప నడిబొడ్డున జగన్‌పై లోకేష్ మాస్ ర్యాగింగ్.. ఇంతకీ ఏం జరిగింది? 

ఆ లెక్కన చూస్తే రూ.72 వేలు అందిస్తామన్నది ఆనాటి ప్రకటన. దీనికి కాస్త ఎక్కువగా జోడించిన వీఎస్ఆర్ మరో నాలుగు వేలు కలిపి రూ. 10 వేల ఇస్తే బాగుంటుందన్నారు.  అందుకు సమయం ఆసన్నమైందని ఆ పోస్టులో ప్రస్తావించారు. రేపో మాపో పార్టీ పెట్టాలని భావిస్తున్న వీఎస్ఆర్ ఈ పథకానికి కచ్చితంగా పెడతారంటూ అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి. వీఎస్ఆర్ లెక్కలు బాగానే వేశారని, ఆ నిధులు ఇప్పిస్తే బాగుంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Related News

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

Big Stories

Advertisement
×