E-Paper
Advertisement

ల్యాప్‌టాప్ కీబోర్డ్‌ను ఇలా క్లీన్ చేస్తున్నారా? అయితే కొంప మునిగినట్లే!

ల్యాప్‌టాప్ కీబోర్డ్‌ను ఇలా క్లీన్ చేస్తున్నారా? అయితే కొంప మునిగినట్లే!
Advertisement

Laptop Keyboard Cleaning: ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం మన్నాలన్నా, కీబోర్డ్ సరిగ్గా పనిచేయాలన్నా దాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కీ బోర్డ్‌లో దుమ్ము చేరితే టైపింగ్ చేయడం కష్టమవుతుంది. అందుకే ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులతో కీబోర్డ్‌ను ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడీ కథనం ద్వారా తెలుసుకుందాం రండి..

పవర్ ఆఫ్ చేయడం మరవొద్దు..

కీబోర్డ్ క్లీన్ చేసే ముందు ల్యాప్‌టాప్‌ను పూర్తిగా ఆపివేయాలి (పవర్ ఆఫ్ చేయాలి). ఛార్జర్ కనెక్ట్ చేసి ఉంటే తీసేయాలి. ఆ తర్వాత ల్యాప్‌టాప్‌ను బోర్లా తిప్పడం వల్ల లోపల ఉన్న దుమ్ము, చిన్న చిన్న నలకలు సులభంగా కింద పడిపోతాయి.

దుమ్మును వదిలించండిలా..

Advertisement

Keyల మధ్యలో పేరుకుపోయిన దుమ్మును తొలగించడానికి ఒక చిన్న సాఫ్ట్ పెయింట్ బ్రష్ ఉపయోగించవచ్చు. చాలా జాగ్రత్తగా కీల మధ్య బ్రష్‌తో తుడవాలి. ఒకవేళ మీ వద్ద కంప్రెస్డ్ ఎయిర్ స్ప్రే ఉంటే, ల్యాప్‌టాప్‌ను కాస్త వంచి స్ప్రే చేయడం ద్వారా క్షణాల్లో దుమ్మంతా బయటకు వచ్చేస్తాయి.

Also Read: పాత టీవీల్లా ‘సెంటర్ స్టాండ్’ ఇప్పుడు ఎందుకు రావడం లేదు? దీని వెనుక ఇంత పెద్ద స్కెచ్ ఉందా?

మైక్రోఫైబర్ క్లాత్ వాడాలి..

Advertisement

పైపై దుమ్ము పోయిన తర్వాత.. కీబోర్డ్ పైభాగంలో ఉండే చేతి జిడ్డును వదిలించడానికి మైక్రోఫైబర్ క్లాత్ ఉపయోగించాలి. కొద్దిగా మొండి మరకలు ఉంటే, క్లాత్‌పై కొన్ని చుక్కల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (70% కంటే తక్కువ ఉన్నది) వేసి మెల్లగా తుడవాలి. కానీ ఆల్కహాల్‌ను నేరుగా కీలపై మాత్రం పోయకూడదు.

ముందు చెక్ చేసుకోండి..

కీల కింద మురికి ఎక్కువగా పేరుకుపోతే.. ల్యాప్‌టాప్ కీస్ విడిపోతాయో లేదో ముందే కంపెనీ వెబ్‌సైట్లో చూసుకోవాలి. అవి ఊడి వచ్చేవే అయితే, ఒక చిన్న స్క్రూడ్రైవర్ సహాయంతో మెల్లగా వాటిని పైకి తీసి, లోపల ఉన్న మురికిని తుడిచి, ఆరిన తర్వాత మళ్లీ అమర్చాలి.

ఒకవేళ లిక్విడ్స్ పడితే..

ఒకవేళ పొరపాటున కీబోర్డ్‌పై నీళ్లు పడితే, వెంటనే ల్యాప్‌టాప్ ఆఫ్ చేసి, ఒక టవల్‌పై కీబోర్డ్ కిందికి ఉండేలా బోర్లా పెట్టి కనీసం 24 గంటలు వదిలేయాలి. అదే కూల్‌డ్రింక్స్ లాంటి తీపి పదార్థాలు పడితే మాత్రం సొంత ప్రయోగాలు చేయకుండా వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం మంచిది.

Also Read: Wi-Fi స్పీడ్ తగ్గడానికి అసలు కారణం రూటర్ కాదు.. తెరవెనుక జరిగే అసలు కథ ఇదీ!

Tags

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×