E-Paper
Advertisement

రైతులపై కక్షనా? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా? కాంగ్రెస్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

రైతులపై కక్షనా? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా? కాంగ్రెస్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!
Advertisement

Srinivas Goud: రాష్ట్రంలో రైతుల పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వర్షాలు లేక పత్తి చేలు ఎండిపోతున్నాయన్నారు. వరి నార్లకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు నింపుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మరోవైపు ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలు కృష్ణా, గోదావరి జలాలను వాడుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి రైతులపై కక్షనా? బీఆర్ఎస్ పార్టీపై కక్షనా? అని ఆయన నిలదీశారు.

తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన శ్రీనివాడ్.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎల్ ని నో పైనే చర్చ జరుగుతోందన్నారు. కృష్ణా, గోదావరి జలాలు వచ్చి.. పంటలు పండితే రైతు బంధు, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆరోపించారు. అటు రాష్ట్రంలో యూరియా సరఫరా లేదని.. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. కేసీఆర్ తెలంగాణలో కరువు రాకుండా ఉండేందుకు ప్రాజెక్టులు నిర్మించారని.. ఇప్పుడు ఆయన్ను బదనాం చేసి కాలం గడపాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

ప్రపంచంలో అప్పులు చేయని దేశం లేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణకు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే దిక్కు అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ లో మీటింగ్ పెట్టినా తాము పర్మిషన్ ఇచ్చామన్నారు. సరూర్ నగర్ మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టు పర్మిషన్ ఇచ్చిందన్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చినప్పుడు ఉంది పెయిడ్ బ్యాచ్, పెయిడ్ జేఏసీనా? అని నిలదీశారు.

Also Read: మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Advertisement

ఇచ్చిన హామీలు ప్రశ్నిస్తే పెయిడ్ బ్యాచ్ ఎలా అవుతారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. విద్యార్థులపై ఆంక్షలు లేకుండా వదిలేయాలన్నారు. లేదంటే రాష్ట్రం పరువురు పోగొట్టుకోవాల్సి వస్తుందని సూచించారు. కాగా ఈ మీడియా సమావేశంలో సమావేశంలో టాడీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఫ్రీ వైఫై వాడుతున్నారా? పాస్‌వర్డ్‌లు ఒకటే పెట్టారా? అయితే మీ సేవింగ్స్ గోవిందా!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×